రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ నటన , సినిమాటోగ్రఫీరాజ్ తరుణ్, హెబ్భా పటేల్ నటన , సినిమాటోగ్రఫీమ్యూజిక్ , రొటీన్ రివెంజ్ స్టోరీ

పుట్టుకతో అంధునిగా ఉన్న గౌతం (రాజ్ తరుణ్) శారదా అనాధ ఆశ్రమంలో ఉంటాడు. తన లాంటి అంధులతో కలిసి ఉండే గౌతం పెద్ద వాడై వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ప్రేమించిన నేత్ర (హెబ్భా పటేల్) వాళ్ళ డీన్ డాక్టర్ తో మాట్లాడి రంజిత్ కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్) కళ్లు గౌతమ్ కు ఇప్పిస్తుంది. ఇక అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. కళ్లు రాగానే గౌతం కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. తనకు ఓ ఆత్మ కనిపిస్తుందని అందరిని నమ్మిస్తాడు. అసలు గౌతంను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది..? గౌతం ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు..? ఎవరెవరిని చంపాడు అన్నది అసలు కథ. 

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్ తన మార్క్ సినిమాతో అంధగాడుగా వచ్చాడు. సినిమాలో అంధునిగా రాజ్ తరుణ్ నటన బాగుంది. సినిమా సినిమాకు నటనలో మంచి పరిణితి సాధిస్తున్నాడు. ఇక హెబ్భా పటేల్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఆమెకు అంత స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. విలన్ పంతం బాబ్జిగా రాజా రవింద్ర బాగానే చేశాడు. షయాజి షిండే, ఆశిష్ విద్యార్ధి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కులకర్ణిగా రాజేంద్ర ప్రసాద్ నటన సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. 
రచయితగా సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా కూడా మంచి స్క్రీన్ ప్లేతో అంధగాడు సినిమా చేశారు. కాని సినిమా కథ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. రొటీన్ రివెంజ్ డ్రామాల్లానే ఇది కూడా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ సోసోగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి.
అంధగాడుగా వచ్చిన రాజ్ తరుణ్ కథ మాత్రం రొటీన్ అనిపించక తప్పదు. అయితే కథనం నడిపించిన తీరు మాత్రం మెచ్చుకునేలానే ఉంది. రివెంజ్ డ్రామానే అయినా కాస్త కొత్తగా చెప్పాలని చూశారు. అయితే లాజికల్ లేని విషయాలు చాలా కనిపిస్తాయి.

రాజేంద్ర ప్రసాద్ క్యారక్టర్ ఆత్మగా కనిపిస్తుంది. అయితే ఒకానొక దశలో కాస్త బోర్ కొట్టించేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ చేసినా సెకండ్ లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో పట్టు సాధించాడు. ఇలాంటి రొటీన్ రివెంజ్ డ్రామాలు ఇదవరకు చాలానే చూశామన్న భావన రాక తప్పదు.

సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరో చిన్ననాటి సన్నివేశాలు సినిమాలో చాలా ప్రాముఖ్యత వహించేలా ఉన్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి అంశాలతో సాగించి కథనం బాగానే రాసుకున్నా ఓవరాల్ గా కథ మాత్రం పాత చింతకాయ పచ్చడి అనే అనిపిస్తుంది. సరదాగా ఓసారి సినిమా చూసేద్దాం అనుకున్న వారికి అంధగాడు నచ్చే అవకాశం ఉంది. కొత్తదనం కోరుకునే వారికి మాత్రం నచ్చకపోవచ్చు.
Raj Tarun,Hebah Patel,Veligonda Srinivas,Ramabrahmam Sunkara,Sekhar ChandraComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: