స్టార్ కాస్ట్ , నేరేషన్ , సినిమాటోగ్రఫీస్టార్ కాస్ట్ , నేరేషన్ , సినిమాటోగ్రఫీమొదటి భాగం , అక్కడక్కడ స్లో అవడం

తనకున్న ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు సిటీలో స్మగ్లింగ్ చేస్తుంటాడు రఘునందన్ (ఆది పినిశెట్టి). అప్పులన్ని తీర్చే ఓ పెద్ద ఢీల్ కోసం చూస్తున్న తరుణంలో ఓ చైనా వ్యాపారి ద్వారా మరకతమణి ఢీల్ వస్తుంది. ఎన్నో ఏళ్లుగా మరకతమణి పొందుదామని ప్రయత్నిస్తున్నా కుదరకపోవడంతో అది తెచ్చిస్తే  10 కోట్ల రూపాయలు ఇస్తామన్ ఆఫర్ ఇస్తారు. ఎంత రిస్క్ అయినా సరే ఆ మణి తెచ్చివ్వాలని నిర్ణయించుకుని దాని వేటలో పడతాడు రఘునందన్. ఈ క్రమంలో ఓ పక్క నచ్చిన అమ్మాయి దొరుతుంది. మరకతమణి పొందాలనుకునే వారు అనూహ్యంగా మరణిస్తుంటారు. ఇక ఆత్మల సాహంతో మణి కోసం రంగంలో దిగుతాడు రఘునందన్. ఇంతకీ రఘునందన్ మరకతమణిని సంపాదించాడా..? మణి అసలు కథ ఏంటి..? అన్నది అసలు కథ.    

తెలుగు తమిళ భాషల్లో సుపరిచితుడైన ఆది పినిశెట్టి సోలో హీరోగా నిలబడే ప్రయత్నంలో చేసిన ప్రయత్నం మరకతమణి. సినిమాలో రఘునందన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు ఆది. సినిమాలో తన పాత్ర చాలా ఫన్నిగా ఉంటుంది. హీరోయిన్ నిక్కి గర్లాని పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆమె కూడా వచ్చిన అవకాశాన్ని వాడుకుంది. రామనాధంగా ఆనంద్ రాజ్ నవ్వులు పండించాడు. రాందాస్ పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. చివర్లో బ్రహ్మానందం కామెడీ నవ్వు తెప్పించేలా ఉన్నా ఆల్రెడీ రొటీన్ కామెడీ అనిపిస్తుంది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ గా ఈ సినిమా మంచి అవుట్ పుట్ వచ్చినట్టే. ముఖ్యంగా సినిమా కెమెరా వర్క్ బాగుంది. పివి. శంకర్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యింది. థామస్ మ్యూజిక్ సినిమాకు చక్కగా కుదిరింది. ఏ.ఆర్.కె శరవణన్ కథ కథనాల్లో దర్శకుడి ప్రతిభ కనిపించింది. అయితే కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. 
మరకతమణి.. టీజర్ ట్రైలర్ తో ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ అయిన ఈ సినిమా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చినా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం సగానికి పైగా పాత్రల పరిచయాలు వారి క్యారక్టరైజేషన్ తోనే నడిపించాడు. కథనంలో ప్రతిభ కనిపించినా అసలు కథ మరకతమణి కోసం వెళ్లేప్పుడే అన్నట్టు స్క్రీన్ ప్లే ఉంటుంది.

సినిమా ఇంటర్వల్ టైంలో దానికి ముందు రాసుకున్న కొన్ని సీన్స్ బాగా వచ్చాయి. కథలో ఆడియెన్స్ ను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి ఆ సీన్స్. అయితే మళ్లీ సెకండ్ హాఫ్ లో మళ్లీ అవి తేలగొట్టేశారు. మళ్లీ ఆ హైప్ ప్రీ క్లైమాక్స్ లో తీసుకొచ్చాడు దర్శకుడు. కథనంలో ఇంకాస్త జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా మరకతమణి ఓ మంచి సినిమా అయ్యుండేది.

ఇక సినిమా స్క్రీన్ ప్లే.. అక్కడక్కడ తమిళ నేటివిటీ కనిపిస్తుంది.. సినిమా తెలుగులో ఇంకాస్త సీన్స్ రాసుకుని ఉంట్తే బాగుండేది. సరైనోడు తర్వాత ఆది నటించిన మరకతమణి ప్రేక్షకులు పర్వాలేదు అనుకునేలా ఉంది.
Aadhi,Nikki Galrani,ARK Saravan,Rushi Media,Dhibu Ninan Thomasమరకతమణి కామెడీ తో త్రిల్లింగ్ అంశాలు కలిపి ఇంప్రెస్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: