తారకరత్న , లాస్య నటనతారకరత్న , లాస్య నటనకథ, కథనం, మ్యూజిక్ , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

నాగరాజు (నందమూరి తారకరత్న) టూటెక్ కంపెనీ సి.ఈ.ఓ. ఎన్నోసార్లు బెస్ట్ సి.ఈ.ఓగా అవార్డ్ అందుకున్న నాగరాజు సిఎం పోసాని మురళికృష్ణతో నమ్మి తన కంపెనీలో ఉన్న డబ్బంతా రియల్ ఎస్టేట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. అదే కంపెనీలో జాబ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తున్న రవి (రేవంత్), తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు లాస్య కష్టపడుతుంటారు. ఇక తండ్రి కోటిశ్వరుడైనా ఇంట్లో జాబ్ ప్రెజర్ తో ఏదో ఒకటి చేయాలనుకునే మిర్చి హేమంత్, ఎప్పుడు తండ్రి అసహ్యించుకుంటూ నోయెల్ ఎం.బి.ఏ చేసి ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్ ప్రోద్బలంతో తండ్రిని అడిగిమరి టూటెక్ లో షేర్ తీసుకుంటారు మిర్చి హేమంత్, నోయెల్. సడెన్ గా వీళ్లందరు రోడ్ల మీద పడతారు. నాగరాజు టూటెక్ కంపెనీ దివాలా తీసిందని తెలుస్తుంది. ఎంప్లాయీస్ రోడ్డున పడతారు. ఆ భాధలో ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారు..? అసలు ఈ కుట్రలో భాగస్వామ్యులు ఎవరు..? ఆ తర్వాత వారు ఏం చేశారు..? అన్నది అసలు కథ. 

రాజా మీరు కేకలో ముగ్గురు ప్రధాన పాత్రధారులైతే.. సినిమా మొత్తం నాగరాజు పాత్ర అంటే నందమూరి తారకరత్న మీదే నడుస్తుంది. రేవంత్ మెయిన్ లీడ్ గా కనిపిస్తాడు. నటనలో చాలా మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నోయెల్ పాత్రకు న్యాయం చేశాడు. మిర్చి హేమంత్ పర్వాలేదు అనిపించుకున్నాడు. సినిమాలో హీరో స్నేహితురాలిగా లాస్య అలరించింది. హీరోయిన్ కూడా పర్వాలేదు. సినిమాలో ముఖ్యంగా తారకరత్న నటన మెచ్చుకునేలా ఉంటుంది. దర్శకుడు క్లారిటీ మిస్ అయ్యాడు తప్ప తన పాత్ర వరకు దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు తారరత్న. సిఎంగా పోసాని తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.

సినిమా దర్శకుడు కృష్ణ కిశోర్ రాసుకున్న కథ ఓకే అనిపించేలా ఉన్నా కథనంలో మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. సినిమాలో అన్నికోణాల్లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. మ్యూజిక్ శ్రీ చరణ్ కూడా అంత ఇంప్రెసివ్ మ్యూజిక్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ కూడా సోసోగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త చెయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఏం అనిపించవు.
చిన్న సినిమాల్లో సంచలనం సృష్టించాలంటే కచ్చితంగా అందులో మ్యాటర్ గొప్పగా ఉండాలి. అలా కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు విమర్శకులను సైతం వారెవా అనేలా చేస్తుంది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ డబ్బు ఆశతో సిఎంతో చేతులు కలిపి ఎంప్లాయీస్ గురించి లెక్క చేయకుండా రిస్క్ చేస్తాడు.

ఫలితంగా తాను సేఫ్ గా ఉన్నా అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కష్టాల్లో పడతారు. ఈ క్రమంలో ఆ కోపంతో ఆ కంపెనీ సి.ఈ.ఓని కిడ్నాప్ చేస్తారు. అతన్ని మార్చి తమలా రోడ్డున పడ్డ వారందరిని సేవ్ చేస్తారు. అయితే ఇక్కడ ఓ కంపీనీకి సంబంధించి కాబట్టి ఎంప్లాయీస్ కు అన్యాయం చేయడం అనేది అంతగా ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. 

కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే బోర్డ్ తిప్పేస్తారు. అందులో పనిచేసే వారి క్ష్టాలకు తన భాధ్యత కాదు. అయితే కంపెనీ లాసుల్లో ఉన్నా సరే షేర్స్ కోసం గొప్పగా చూపించి జనాలను మోసం చేస్తున్న వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు కథ చెప్పారు. 

ఓ కంపెనీ సిఈఓ ఇలా ఓ సిఎంతో కలిసి ప్లాన్ వేసి ఎంప్లాయీస్ ను రిస్క్ లో పెట్టడం.. కంపెనీ ప్రతినిధులు ఏం జరిగినా సరే ఈజీగా ప్రజల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం లాంటివి బాగానే చూపించారు. కథ అనుకున్న దానికి కథనం అందించిన దానికి ఏమాత్రం సరితూగలేదు.  

ఇక సినిమాలో సీన్స్ ఎందుకు వస్తున్నాయి.. ఎందుకు వెళ్తున్నాయి అన్నది కూడా తెలియదు. తొలి ప్రయత్నమే అయినా కథను పర్ఫెక్ట్ గా చెప్పడంలో దర్శకుడు ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఏమాత్రం లాజిక్ లేకుండా కథనం నడిపించి ఆడియెన్స్ కు చిరాకు తెప్పించేశారు.
Lasya,Taraka Ratna,Revanth,Noel Sean,Krishna Kishore .T,Raaj Kumar .M,Sricharanరాజా మీరు కేక.. తారకరత్న మరో విఫల ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: