మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్, మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్, నేరేషన్, రొటీన్ స్టోరీ, ఎడిటింగ్
డాక్టర్ వృత్తి లో ఉన్న బాంధవి (పూజ.కె.దోషి) పెళ్లిసంబంధాలు చూసి చూసి విసిగిపోతుంది. ఏవో కారణాలు చెప్పి వచ్చిన వారు వచ్చినట్టే వెళ్తుంటారు. ఈ క్రమంలో తన స్నేహితురాలి సలహా మేరకు ప్రేమించేందుకు సిద్ధమవుతుంది బాంధవి. ఆ ప్రయత్నంలో కార్తిక్ (హరిష్ కళ్యాణ్)ను ఇష్టపడుతుంది బాంధవి. తన టిపికల్ మెంటాలిటీతో బాంధవికి దూరమవుతాడు కార్తిక్. ఇక కొద్దిరోజులకు బాంధవి క్రాంతిని (సాయి రోనక్)ను ఇష్టపడుతుంది. కార్తిక్, క్రాంతి ఇద్దరు సిన్సియర్ గా బాంధవిని ప్రేమిస్తారు. ఇద్దరిలో బాంధవి ఎవరి ప్రేమకు ఓకే చెప్పింది..? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగింపు ఏమైంది అన్నదే అసలు కథ. 


సినిమాలో హీరోలు ఇద్దరు అన్నట్టు కనిపించినా హరిష్ మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. తన పాత్ర పరంగా ఎంతవరకు చేయాలో అంత చేసి మెప్పించాడు హరిష్. ఇక సాయి రోనక్ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బాంధవి పాత్ర చేసిన పూజాకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అయితే కథానాయికగా పూజా ఇంకా అభినయం మెరుగు పరచుకోవాల్సి ఉంటుంది. సినిమాలో సుదర్శన్ కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పాత్రలు అంత ప్రాముఖ్యత కలిగినవేం కాదు.


సినిమా దర్శకుడు పట్టాబి ఆర్.చిలుకూరి రొటీన్ కథనే కాదలి అని టైటిల్ పెట్టి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ల నుండో చూసి పక్కన పడేసిన ముక్కోణపు ప్రేమకథనే దించాడు. కనీసం కథ పాతదే అయినా కథనంలో కూడా కొత్తదనం చూపించలేదు. సినిమాకు సంగీతం అందించిన ప్రసన్, ప్రవీణ్, శ్యాం పర్వాలేదు అనిపించుకున్నారు. వనమాలి సాహిత్యం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త దృష్టి పెట్టి చేయాల్సింది. ప్రొడక్షన్ కూడా అంతా తక్కువ బడ్జెట్ లోనే కానిచ్చేశారు.

 

లవ్ ట్రయాంగిల్ సబ్జెక్ట్స్ తెలుగు వారికి కొత్తేమి కాదు.. అయితే కథ పాతదే అయినా దర్శకుడి ప్రతిభని బట్టి అది కొత్తగా ప్రెజెంట్ చేస్తే తప్పకుండా ఆడియెన్స్ మెప్పు పొందే అవకాశం ఉంది. కాదలి సినిమా రొటీన్ కథతోనే వచ్చింది. అంతేకాదు కథనంలో కూడా అదే రొటీన్ పంధానే కొనసాగించాడు దర్శకుడు. 


ఇక సినిమాలో బలమైన సీన్స్ లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా హీరోయిన్ ఇంపార్టెంట్ ఉన్న కథ కాబట్టి హీరోయిన్ గా తెలిసిన అమ్మాయి అయితే బాగుండేది అనిపిస్తుంది. ఇక కథలో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా చాలా ప్లేన్ గా నడిపిస్తాడు దర్శకుడు.


కథగా అనుకున్న దాన్నే సీన్స్ రూపంలో చెప్పినట్టు అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇక సినిమాలో పాటలు ఏవో సాగదీసేందుకు తప్ప ఎందుకు ఉపయోగపడవు. ఇక సినిమా క్లైమాక్స్ లవ్ స్టోరీస్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. క్లైమాక్స్ సీన్స్ లో కూడా తేలగొట్టేశారు. 


Pooja K. Doshi,Sai Ronak,Harish Kalyan,Pattabhi R. Chilukuri,Prasan Praveen Shyamమనసుని కదిలించలేకపోయిన కాదలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: