Star cast: SushanthShanvi
Producer: NagasusheelaDirector: Sai Karthik

Adda - English Full Review

అడ్డా రివ్యూ: చిత్రకథ 
అభి ప్రేమ జంటలను విడగొట్టడంలో నేర్పరి. అంతే కాదు దానిని ప్రవృత్తిగా చేసుకొంటాడు. రిజిస్ట్రేషన్ మ్యారేజికి అప్లై చేసిన జంటలను విడదీయడానికి వాళ్ల తల్లిదండ్రుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ.. రిజిస్ట్రేషన్ ఆఫీసునే అడ్డాగా చేసుకొని ఉంటుంటాడు. ప్రియ (షాన్వి) లోకల్ గా పేరుమోసిన రౌడీ శంకర్ పటేల్ (నాగినీడు) కూతురు. ఒక పనికోసం అభిని కలుస్తుంది. అలా పరిచయం కాస్త ప్రేమ గా మారుతుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల అపార్థల వలన ఎవరూ తమ ప్రేమను ప్రపోజ్ చెయ్యరు. ఇదిలా ఉండగా శంకర్ పటేల్ ప్రియ పెళ్లి వాళ్ల బావ (దేవ్ గిల్) తో నిశ్చయిస్తాడు. అప్పుడు ప్రియ అభిని అడిగిన సహాయం ఏమిటి? ప్రియ-అభి మధ్య అపార్థాలకు కారణం ఏమిటి ? అభి-ప్రియ ప్రేమను గెలుచుకున్నాడా? లేదా? ఇవన్నీ వెండితెర మీద చూడాల్సిందే..


అడ్డా రివ్యూ: నటీనటుల ప్రతిభ
కాళిదాసు, కరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ మీదకు దండెత్తి వచ్చి విజయం సాధించలేక పోయినా అక్కినేని నాగేశ్వరరావు గారి సుశాంత్ చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. ఇంత గ్యాప్ తీసుకున్నాడు కదా.. చాలా బ్రంహాండంగా తన నటనను మెరుగు పర్చుకున్నాడనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. సుశాంత్ నటనలోడిక్షన్ లో చెప్పుకోదగ్గ మార్పు లేదు. డ్యాన్స్ ల్లో ఫరవాలేదనిపించినా.. పట్టి-పట్టి చేసినట్లనిపించింది. ఫైట్లు కూడా నిరాశపరిచాయి. మొత్తానికి సుశాంత్ నటుడిగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి.

షాన్వి చాలా అందంగా కనిపిస్తూ.. స్కిన్ షో తో కుర్రకారుని కవ్విస్తూ పరవాలేదనిపించింది. కోట శ్రీనివాసరావు, నాగినీడు, దేవ్ గిల్ లాంటి మంచి నటులను ఉపయోగించుకోవండంలో దర్శకుడు విఫలమయ్యాడు.

అడ్డా రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

కొత్త దర్శకుడు సాయి కార్తిక్ దర్శకత్వమే కాకుండా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఇలా అన్ని ఇంపార్టెంట్ శాఖలను తనపై వేసుకొని ఒంటి చేత్తో నడిపించడానికి ప్రయత్నించాడు. కానీ అన్ని శాఖలలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 149 నిముషాల నిడివితో ప్రేక్షకులను వారి సీట్లలో కూర్చొపెట్టలేకపోయాడు.

కథ కొంచెం కొత్తగా ఉన్నా.. ప్రేమకు సంబంధించిన కొన్ని కొన్ని డైలాగులు హృదయానికి హత్తుకొనే విధంగా ఉన్నా ఎందుకూ పనికిరాని స్క్రీన్ ప్లే తో మొత్తం సినిమాను పాడు చేశాడు. అనూప్ రూబెన్స్ సంగీతం - నేపధ్య సంగీతం రెండూ చక్కగా ఉన్నాయి. అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతం రాజు ఎడిటింగ్ ఇంకా చాలా మంచిగా ఉండి ఉండోచ్చు. సినిమా నిర్మాణ విలువులు ఉన్నతంగా ఉన్నాయి.


అడ్డా రివ్యూ: హైలెట్స్
  • అనూప్ రూబెన్స్ సంగీతం
  • ప్రేమను గురించి చెప్పే కొన్ని మాటలు
  • షాన్వి గ్లామర్

అడ్డా రివ్యూ: డ్రా బాక్స్
  • ఆకట్టుకోని కథనం
  • పసలేని కామెడీ,
  • మేము ఉన్నామో అంటు వచ్చే పాటలు,హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడం

అడ్డా రివ్యూ: విశ్లేషణ

ప్రేమ ఈ రెండక్షరాల పదం సినిమా రంగానికి బంగారు వరంలాంటిది. ప్రేమ కథలను బేస్ చేసుకొని వెల సినిమాలు వచ్చినా కూడా ఇంకా ఎన్నోఎన్నో వెల సినిమాలు తీయవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చినా కథలో వినూత్నత.. కథనంలో ట్విస్ట్, కడుపుబ్బ నవ్వించే కామెడి, యువతీ-యువకులు తమని హీరో హీరోయిన్లు గా ఊహించుకోగలిగే విధంగా సాగే చిత్రీకరణ ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి.

అడ్డా సినిమాకి పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఇది సాఫ్ సీదా ప్రేమ కథ. కథలో కూసింత నూత్నత తప్పించి ఎంటువంటి ఉరుములు-మెరుపులు లేని ప్రేమ కథ. ఇందులో ఉన్న సీన్లన్నీ మనం ఎప్పడో చూసేశామని అనిపించే ప్రేమ కథ.. పోనీ కామెడీ అన్నా ఉందా అంటే మగాళ్ల ‘గే’ కామెడీ అనే ఘాటుతో దానిని నాశనం చేసేసిన ప్రేమ కథ. పోనీ హీరో-హీరోయిన్ కి ప్రాముఖ్యతనిస్తూ హృదయానికి హత్తుకునే విధంగా తీశారంటే అదీ లేదు. మొదటి ప్రేము నుండి చివరి ఫ్రేము వరకు హీరో చుట్టూ తిరుగుతూ మిగిలిన వాళ్లని పట్టించుకోని ప్రేమకథ. ఏతా-వాతా చెప్పొచ్చేదేమిటంటే దర్శకుడు ఒక మాస్ హీరో పాత్రను ప్రేమకథ అనే ముసుగులో పెట్టి సినిమా తీసేద్దామనుకున్నాడు. మరి ప్రేక్షకులు పిచ్చొళ్లు కాదుకదా మోసపోడానికి... చివరగా : అడ్డా దర్శకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యింది.


అడ్డా రివ్యూ: చివరగా
సీనియర్ నటులు కోట, నాగినీడు, దేవెగిల్ వంటి వారిని ఉపయోగించుకోకపోవడం
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Adda | Adda Wallpapers | Adda Videos

మరింత సమాచారం తెలుసుకోండి: