లీడ్ క్యారక్టర్స్ , ప్రగ్యా జైశ్వాల్, సెకండ్ హాఫ్లీడ్ క్యారక్టర్స్ , ప్రగ్యా జైశ్వాల్, సెకండ్ హాఫ్రొటీన్ కథ , ఫస్ట్ హాఫ్ బోరింగ్
తాత తండ్రి పోలీస్ ఆఫీసర్స్ అవడం చేత చిన్న నాటి నుండి ఎస్.ఐ కావాలని కలలు కంటాడు రామారావు(సందీప్ కిషన్). మూడు తరాల వారు పోలీసులు అవడం వల్ల తన రక్తంలోనే పోలీస్ ఉన్నాడని భావిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తనకు రాని ఇంగ్లిష్ నేర్చుకుని మరి ఎస్.ఐ పరిక్షకు హాజరవ్వాలని అనుకుంటాడు చివరి నిమిషంలో రామారావు కమీషనర్ రామబ్రహ్మం కొడుకు రాహుల్ (తనీష్) రామారావుకి అడ్డుపడతాడు.

అప్పటికే ప్రేమించిన రెజినా రామారావు కోసం పోలీస్ డ్రెస్ గిఫ్ట్ గా తెస్తుంది. అలెగ్జాండర్ పేరుతో ఉన్న పోలీస్ డ్రెస్ తో దొంగల పని పడుతుంటాడు. ఇదే సమయంలో కిరణ్ రెడ్డి (ప్రగ్యా జైశ్వాల్) రామారావు అతను వేసుకున్న అలెగ్జాండర్ పోలీస్ డ్రెస్ చూసి కమీషనర్ కు అప్పగిస్తుంది. ఇంతకీ అసలు ఎవరీ అలెగ్జాండర్..? అతని కోసం కమీషనర్ ఎందుకు వెతుకుతాడు..? రామారావుకి అలెగ్జాండర్ కు ఏదైనా సంబంధం ఉందా అన్నది అసలు కథ. 
పోలీస్ కావాలని కలలుకనే రామారావు పాత్రలో సందీప్ కిషన్ బాగా నటించాడు. అలెగ్జాండర్ గా సాయి ధరం తేజ్ ఉన్నంత సేపు అదరగొట్టాడు. సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చే పాత్ర చేశాడు తేజ్. ఇక సినిమాలో రెజినా కేవలం అందాల ప్రదర్శనకే అన్నట్టు ఉంది. ఇక ప్రగ్యా జైశ్వాల్ మాత్రం సినిమా మొత్తం దాదాపు సందీప్ కిషన్ తో పాటుగా సరిసమానమైన రోల్ పోశించింది. విలన్ గా తనీష్ ఓకే. హోం మినిస్టర్ గా జేడి చక్రవర్తి, నిజాయితి గల పోలీస్ ఆఫీసర్ గా ప్రకాశ్ రాజ్ కూడా నటనలో మెప్పించారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

శ్రీకాంత్ నరోజ్ బాగుంది.. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కృష్ణవంశీ డైరక్షన్ మార్క్ కనిపించినా కథ కథనంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

నక్షత్రం అంటూ సందీప్ కిషన్ రెజినా జంటగా వచ్చిన ఈ సినిమాతో పోలీసుల నిజాయితి గురించి చెప్పే కథ. కథ కథనాల్లో కృష్ణవంశీ తన మార్క్ చూపించినా ఎందుకో సినిమా మొదటి భాగం అంతగా ఇంప్రెస్ చేయలేదు. సందీప్ కిషన్ పాత్ర కన్నా అలెగ్జాండర్ పాత్ర దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంటుంది.

ఇక సినిమాలో హీరోయిజం కాస్త తగ్గిందనిపిస్తుంది. తేజ్ క్యారక్టర్ ఇచ్చిన బిల్డప్ కు అతని పాత్ర ముగించిన తీరు ఇంప్రెస్ చేయలేదు. సందీప్ కిషన్ బాగానే చేసినా ఇంకాస్త హీరోయిజం చూపించాల్సి ఉంది. రెజినా కేవలం గ్లామర్ షోకే అన్నట్టు ఉంది. ఇక సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ ను బాగా వాడుకున్నారు.

సినిమా అసలు హీరో ప్రగ్యా అంటే నమ్మేయాలి. అయితే ఆమె పాత్రని పరిచయం చేసిన సందర్భంలో మళ్లీ కృష్ణవంశీ తప్పు చేశాడని అనిపిస్తుంది. దర్శకుడిగా సీన్ ప్రెజెంటేషన్ లో పర్ఫెక్ట్ గా అనిపించుకున్నా మొదటి భాగం స్లో అవడం కాస్త నిరాశ పరుస్తుంది. సెకండ్ హాఫ్ బాగున్నా మధ్యలో మళ్లీ రొటీన్ స్క్రీన్ ప్లే నడుస్తుండటం ఇబ్బంది పెడుతుంది. ఫైనల్ గా మళ్లీ క్లైమాక్స్ లో న్యాయం చేశాడు. 

సందీప్ కిష, తేజ్ ల నటన.. ప్రగ్యా, రెజినాల అందాల కోసం నక్షత్రం చూడొచ్చు. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశాలున్నాయి.

Sundeep Kishan,Sai Dharam Tej,Regina Cassandra,Pragya Jaiswal,Prakash Raj,Krishna Vamsi,K. Srinivasulu,S. Venugopal,Sajju,Bheems CeciroleoComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: