లీడ్ కాస్టింగ్ , ఎంటర్టైనింగ్ సీన్స్ , మ్యూజిక్లీడ్ కాస్టింగ్ , ఎంటర్టైనింగ్ సీన్స్ , మ్యూజిక్సెకండ్ హాఫ్ , నెమ్మదిగా సాగే కథనం

హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న వేణు (హరిష్) అందులో ఉన్న వారందరిని ఏదో ఒక పనిలో తనకు ఉపయోగపడేలా వాడుకుంటాడు. ఇక అదే అపార్ట్మెంట్ లో అద్దెకు దిగుతుంది భాను (అవంతిక). వేణు ప్రేమికురాలిని అంటూ బ్టూటీ పార్లర్ కూడా నడిపే భాను వేణు ఎదురవడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఇక ఇద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ముందు స్నేహితులుగా ఉన్న వారు ఆ తర్వాత ప్రేమికులుగా మారుతారు. ఇద్దరికి ఎప్పుడు మనస్పర్ధలు రావడం గొడవపడటం జరుగుతుంది. అసలు భాను ఎవరు..? ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది..? వీరి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యింది అన్నది అసలు కథ.

హీరో హరిష్ నటన బాగుంది.. ఓ పక్క సరదాగా ఉంటూనే ఎమోషనల్ సీన్స్ లో బాగానే అలరించాడు. భానుగా అవంతిక కూడా ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్రకు తగ్గ అభినయం తో ఇంప్రెస్ చేసింది. ఇక కథలో ఇంపార్టెంట్ పాత్ర సాయి కుమార్ ది చిన్న పాత్రే అయినా సాయి కుమార్ నటన బాగుంది. పృధ్వి, భద్రం, కాశీ విశ్వనాధ్ వంటి నటులు పాత్ర పరిధి మేరకు నటించారు. 

దర్శకురాలు జయ ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయితే దాన్ని తెరకెక్కించే విధానంలో బలమైన సన్నివేశాలు పడలేదు. సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ క్లైమాక్స్ దాకా తెలియకపోవడం విశేషం. కథ ఓకే అనిపించేలా ఉన్నా కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. మ్యూజిక్ బాగానే ఉంది. రెండు మూడు పాటలు ఆకట్టుకున్నాయి. కెమెరామన్ పనితనం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బి.ఏ.రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే రిచ్ గా ఉన్నాయి.
లవ్ లీ తర్వాత జయ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీసిన సినిమా విశాఖం. సినిమా పాయింట్ చాలా చిన్నదే.. ముఖ్యంగా సినిమా అసలు పాయింట్ మనది అనుకోవడమే చాలా గొప్పది అన్న కాన్సెప్ట్ సినిమా లాగించారు. కథ ఓకే అనేలా ఉన్నా కథనంలో ఇంకాస్త పట్టు సాధించాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది.  
హీరో హీరోయిన్స్ మధ్య స్నేహం ప్రేమ.. గొడవలు పడటం ఇలాంటి వాటిల్లో డైరక్షన్ ఓకే అనేలా ఉన్నా సినిమా ఎంటర్టైనింగ్ విషయంలో మాత్రం ఏదో లోపించిందనిపిస్తుంది. సినిమాలో అసలైన ట్విస్ట్ క్లైమాక్స్ దాకా ఉంచడం.. ఈలోపు ప్రేక్షకులు సినిమా మీద ఓ నిర్ణయానికి రావడం జరుగుతుంది.

పాటలు, డైలాగ్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉన్నా సినిమా కథ కథనాల్లో ఇంకా ఏదో కొత్తదనం లోపించినట్టు అనిపిస్తుంది. ఆర్టిస్టులు కొత్త వారు కాబట్టి వారిని ఆడియెన్స్ డైజెస్ట్ చేసుకోడానికి కాస్త సమయం పడుతుంది. ఓవరాల్ గా సినిమా జయ గారు చేసిన ఓ మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. కాని ఇంకాస్త జాగ్రత్త పడుంటే బాగుండేది. 
Harish,Avanthika,Jaya.B,BA Raju,D.J.Vasanthఎమోషనల్ గా సాగిన వైశాఖం.. అలా అలా నడిపించారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: