బోయపాటి డైరక్షన్, మ్యూజిక్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీను డ్యాన్స్బోయపాటి డైరక్షన్, మ్యూజిక్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీను డ్యాన్స్స్క్రీన్ ప్లే, ఎడిటింగ్
చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తి (శరత్ కుమార్)కి ఇద్దరు కొడుకులు. అందులో గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్) చురుకైన కుర్రాడు. అతని సోదరుడు నందు. తొలి చూపులోనే ప్రేమలో పడిన జానాకి (రకుల్ ప్రీత్ సింగ్)ను తెచ్చి తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు గగన్. ఇంతలోనే ఆమె కష్టాల్లో ఉన్నదని గమనిస్తారు. అశ్వద్ నారాయణ వర్మ (జగపతి బాబు), అరుణ్ పవార్ (తరుణ్ అరోరా) జానకిని చంపాలని చూస్తారు. అసలు జానకిని రౌడిలు ఎందుకు చంపాలనుకుంటారు..? గగన్ వాళ్ల భారీ నుండి జానకి ఎలా కాపాడాడు..? రౌడిలతో హీరో గగన్ కు ఉన్న శత్రుత్వం ఏంటి అన్నది అసలు కథ.



బెల్లంకొండ శ్రీనివాస్ గగన్ గా బోయపాటి హీరోయిజం ఏమాత్రం తగ్గకుండా చూశాడు. సినిమాలో ఎమోషన్స్ సీన్స్ కాస్త తడబడ్డట్టు అనిపించినా ఫైట్స్, డ్యాన్సులలో శ్రీనివాస్ సూపర్ అనిపించుకున్నాడు. మొదటి రెండు సినిమాల కన్నా యాక్టింగ్ లో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో రకుల్ అద్భుతంగా నటించింది. ఇక ప్రగ్యా జైశ్వాల్ కొద్దిసేపైనా హాట్ లుక్స్ తో మెప్పించింది. శరత్ కుమార్ తండ్రి పాత్రలో అలరించగా విలన్లుగా జగపతి బాబు, తరుణ్ అరోరా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.


బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. జయ జానకి నాయకా సినిమా విషయంలో కూడా అదే ప్రూవ్ చేశాడు. సినిమా మొత్తం బోయపాటి మార్క్ లోనే సాగుతుంది. అయితే రొటీన్ కథ అంటూ కాస్త టాక్ వస్తుంది. ఇక కెమెరామన్ పనితనం బాగుంది. దేవి మ్యూజిక్ సినిమాకు మేజర్ హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ ఓకే..  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హంసలదీవి దగ్గర సీన్స్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ లో కూడా కొత్తదనం చూపించాడు బోయపాటి.


ఊర మాస్ సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించే బోయపాటి సినిమా అంటే ఆడియెన్స్ లో ఓ బలమైన ముద్ర వేసుకున్నారు. అదే పంథాలో వచ్చిన ఈ జయ జానకి నాయకా సినిమా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రేమకథని నడిపించాడు బోయపాటి. రాసుకున్న ప్రేమకథకే కమర్షియల్ హంగులను అద్దాడు. ఎలాంటి సినిమా తీసినా సరే బోయపాటి డైరక్షన్ అంటే బి, సి సెంటర్ ఆడియెన్స్ లేచి సీటి కొట్టాల్సిందే.


సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీనివాస్ రకుల్ ల మధ్య సీన్స్ బాగా రక్తికట్టించాయి. హీరో ఫ్యామిలీ సీన్స్ కూడా మంచి పాజిటివ్ మూడ్ ఏర్పరుస్తాయి. అయితే ఇదే కథతో ఇదవరకే చాలా సినిమాలు చూశాం అన్న భావన ఆడియెన్స్ కు వస్తుంది. కథనం కూడా తన పరంగా మాస్ ఎలిమెంట్స్ తో కొత్తగా రాసుకున్నట్టు అనిపించినా బోయపాటి మార్క్ సినిమాలా తప్ప మిగతాది అంతా కొత్తగా ఏమి అనిపించదు.


యూత్ ఆడియెన్స్ కు నచ్చే లవ్ తో పాటుగా మాస్ ఆడియెన్స్ కు నచ్చే కమర్షియల్ హంగులతో వచ్చిన జయ జానకి నాయకా సినిమా ఈరోజు వచ్చిన మూడు సినిమాల పోటీలో నెగ్గే సినిమా అనే చెప్పొచ్చు.


Bellamkonda Sreenivas,Rakul Preet Singh,Pragya Jaiswal,Boyapati Srinu,M. Ravinder Reddy,Devi Sri Prasad కొత్త కుర్రాడితో బోయపాటి మార్క్ మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: