కామెడీ, తాప్సీ, ప్రొడక్షన్ వాల్యూస్ కామెడీ, తాప్సీ, ప్రొడక్షన్ వాల్యూస్ సాంగ్స్, సెకండ్ హాఫ్
ఎన్నారై అయిన రాము (రాజీవ్ కనకాల) తల్లిదండ్రులను కోల్పోతాడు. అయితే వారి జ్ఞాపకాలతో శ్రీలక్ష్మి నిలయం అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటూ వార్తలు వస్తాయి. రెండు కుటుంబాలకు చెందిన దెయ్యాలు అందులో ఉంటున్నట్టు సృష్టిస్తారు. ఇవన్ని నమ్మొద్దంటూ రాము ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. అందుకే ఈసారి ఆ ఇంట్లో దెయ్యం లేదు అని చెప్పేందుకు ఓ ప్లాన్ వేస్తాడు. ఇక విషయం తెలుసుకున్న సిద్ధూ (శ్రీనివాస్ రెడ్డి), ఫ్లూట్ రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్)ఆ ఇంట్లోకి వస్తారు. ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి అనుభూతి కలిగింది..? వారి వల్ల దెయ్యాలు భయపడ్డాయా..? దెయ్యాల వల్ల వీరు భయపడ్డారా అన్నది అసలు కథ.  


సినిమా టీజర్ ట్రైలర్ లో తాప్సీనే మొత్తం సినిమా నడిపిస్తుందని అనుకుంటాం. కాని ఆమె పాత్రం నిడిపి తక్కువే ఉంటుంది. ఉన్నంతలో తాప్సీ బాగా ఆకట్టుకుంది. ఇక కమెడియన్ కం హీరోస్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ ఆకట్టుకోగా షకలక శంకర్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. తాగుబోతు రమేష్ కూడా బాగా చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.


పాఠశాల సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ ఆనందో బ్రహ్మ కొత్త కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే కథనంలో అది కాస్త పట్టుతప్పిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. కె.కె మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. ఎడిటింగ్ పర్వలేదు. ఇక నిర్మాణ విలువలు కూడా సినిమాకు ఎంత కావాలో అంత పెట్టేశారు.



హర్రర్ కామెడీ అనగానే వారు భయపెడుతూ ఆడియెన్స్ ను నవ్వించే ప్రయత్నమే.. కొద్ది కాలంగా రెగ్యులర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాలకు భిన్నంగా హర్రర్ జానర్ లో సినిమాకే కొత్త అర్ధం చెప్పే ప్రయత్నం చేశారు. కథ కథనాల విషయంలో దర్శకుడి అభిరుచి మెచ్చుకోదగినదే. అయితే మొదటి భాగం పాత్రల పరిచయానికే సగం సరిపోతుంది. మొదటి 20 నిమిషాలు కాస్త ఆకట్టుకుంటుంది.


ఇక ఇంటర్వల్ దాకా రొటీన్ కామెడీతోనే నడిపించాడు. ఇక మరో పక్క సెకండ్ హాఫ్ కూడా సేం కామెడీ డ్రామా నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో కాని పాయింట్ కన్విన్స్ చేయడం కుదరదు. అయితే క్లైమాస్ లో కూడా దర్శకుడు అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. సినిమా నటీనటుల పరంగా అంతా ఓకే కాని సినిమా తాప్సీ కనిపించిన స్క్రీనింగ్ టైం ఆడియెన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది.


కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ ఈ సినిమాకు కథను మెచ్చుకునే అవకాశం ఉంది. అయితే దర్శకుడు కథనం విషయంలో అదే రొటీన్ స్క్రీన్ ప్లే ఫాలో అయ్యేసరికి అంత కిక్ అనిపించదు. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కు వస్తారో లేదో చూడాలి. 



Taapsee Pannu,Vennela Kishore,Srinivas Reddy,Mahi V Raghav,Vijay Chilla,Shashi Devireddy,Krishna Kumarఆనందో బ్రహ్మ.. అలరించేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: