బాలయ్య ఎనర్జీ , టేకింగ్ , యాక్షన్ సీన్స్బాలయ్య ఎనర్జీ , టేకింగ్ , యాక్షన్ సీన్స్కథలో కొత్తదనం లోపించడం , మ్యూజిక్
తేడా సింగ్ (బాలకృష్ణ) తేడా తేడాగా బిహేవ్ చేస్తూ పృధ్వి రాజ్ ఇంటికి ఆక్రమిస్తాడు. ఇక బాబ్ మార్లే (విక్రం జీత్) మనిషులు వచ్చి తేడా సింగ్ కు వార్నింగ్ ఇస్తాడు. అయినా సరే వారిని ఓ ఉతికి ఉతికేసి వారికే వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇంతలోనే మఫ్తీలో బాబ్ మార్లేని డీ కొట్టే దమ్మున్న వాడిని వెతికే పనిలో ఉన్న కిరణ్ బేడికి తేడా సింగ్ తారసపడతాడు. బాబ్ మార్లేని పట్టుకునే అసలైన మగాడు అతనే అని పై ఆఫీసర్స్ కు చెబుతుంది. ఈ క్రమంలో బాబ్ మార్లేని చంపాలని అతనికి టాస్క్ ఇస్తుంది. ఇక బాబ్ మార్లే లోకల్ గ్యాంగ్ తో స్నేహం పెంచుకుని అక్కడ వారిని ఎటాక్ చేస్తుంటాడు తేడా సింగ్. ఇంతకా తేడా సింగ్ ఎవరు..? మధ్యలో తల్లి, కూతుకురికి అండగా నిలుస్తున్న తేడా సింగ్ గతం ఏంటి అన్నది అసలు కథ.



బాలయ్య తేడా సింగ్, బాలాగా అదరగొట్టేశాడు. ఈ సినిమా బాలకృష్ణను కొత్తగా చూడొచ్చు. తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య డైలాగ్ డెలివరీ.. ఫైట్స్ బాగా నచ్చుతాయి. ఇక శ్రీయ యాస్ యూజివల్ రోల్ చేసింది. శ్రీయ సోదరిగా ముస్కన్ కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక ఏసిపిగా కిరణ్ బేడి ఓకే. విలన్ విక్రం జీత్ గట్టి పోటీ ఇచ్చాడు. సన్నిగా అమిత్ ఆకట్టుకున్నాడు. ఆలి ఉన్నా సరిగా వాడుకోలేదు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగుంది.. పోర్చుగల్ లో యాక్షన్ సీక్వెన్సెస్ బాగా తీశాడు. పూరి మార్క్ టేకింగ్ కనిపించగా కథ పాత చింతకాయ పచ్చడే అనిపిస్తుంది. ఇక కథనంలో ముఖ్యంగా బాలయ్యను చూపించిన విధానం బాగుంది. అనూప్ మ్యూజిక్ రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఆనంద్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను రిచ్ గా చూపించాయి.   

పూరి సినిమాలంటే ఓ అంచనాలుంటాయి. ఇక అదే పూరి స్టార్ హీరోతో సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. బాలయ్యతో పూరి సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్ లలో పూరి బాలయ్యను పూర్తిగా మార్చేశాడని అనిపించింది. సినిమా మొత్తం బాలయ్య క్యారక్టరైజేషన్ మీదే నడిపించాడు. కచ్చితంగా ఈ సినిమా బాలయ్య కెరియర్ కు కొత్త జోష్ ఇస్తుంది.

యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ పైసా వసూల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు సమానంగా డీల్ చేశాడు పూరి. ఇక కొన్నాళ్లుగా హిట్ కోసం తపించిపోతున్న పూరి పైసా వసూల్ తో హిట్ ట్రాక్ ఎక్కేసినట్టే. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక కథ విషయానికొస్తే సీక్రెట్ ఏజెంట్ ను పెట్టి ఫారిన్ లో ఉన్న విలన్ ను టార్గెట్ చేయడం పాత కథే. 

అయితే కథనం నడిపించిన తీరు బాలయ్య క్యారక్టర్ ను చూపించిన విధానం బాగా అనిపించాయి. సినిమా మొత్తం బాలయ్య భుజాన వేసుకుని నడిపించాడు. సినిమాలో లాజిక్ లను వెతుకకుండా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసేయొచ్చు.


Nandamuri Balakrishna,Shriya Saran,Muskan Sethi,Kyra Dutt,Puri Jagannadh,V. Anand Prasad,Anup Rubensపూరి మార్క్ పైసా వసూల్ బాలయ్య కోసం చూసేయొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: