Star cast: Ram CharanShruti HaasanAmy JacksonAllu ArjunKajal Aggarwal
Producer: Dil RajuDirector: Vamsi Paidipally.

Yevadu - English Full Review

ఎవడు రివ్యూ: చిత్రకథ 
సత్య(అల్లు అర్జున్) మరియు దీప్తి(కాజల్) ఇద్దరు ప్రేమించుకుంటారు దీప్తిని ఎలాగయినా తన సొంతం చేసుకోవాలని అనుకున్న ధీరుభాయ్(రాహుల్ దేవ్) దీప్తి అమ్మ నాన్నలను బెదిరిస్తాడు ఆ విషయం తెలుసుకున్న సత్య దీరు భాయ్ ని ఎదిరించడానికి వెళుతుండగా దీప్తి వారించి ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. అలా వెళ్తున్న వాళ్ళని బస్సు లో నే చంపేసి బస్సు ని తగలబెట్టేస్తారు దీరుభాయ్ మనుషులు . కోన ఊపిరితో ఉన్న సత్య ను హాస్పిటల్ లో చేర్పిస్తారు అప్పటికే సగానికి పైగా కాలిపోయిన తన మొహాన్ని చరణ్ (చరణ్ తేజ్) మొహంతో సర్జేరి చేస్తుంది డాక్టర్ శైలజ(జయసుధ) హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన సత్య , చరణ్ రూపంలో ఉంటె దీప్తి ని చంపినా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడు దీరు భాయ్ ని కూడా చంపేసాక చరణ్ మీదకి ధర్మ(సాయి కుమార్) మనుషులు ఎటాక్ చేస్తారు .... ధర్మ ఎవరు? చరణ్ ఎవరు? చరణ్ ల కనిపించే సత్య మీదకి ధర్మ ఎందుకు ఎటాక్ చేస్తాడు అనేది మిగిలిన కథ...

ఎవడు రివ్యూ: నటీనటుల ప్రతిభ
అల్లు అర్జున ఉన్న కాసేపు చిత్రం చాలా బాగుంటుంది, అతని స్క్రీన్ ప్రేసేన్స్ సినిమాకి ప్రేక్షకుడిలో సృష్టించాల్సిన ఆసక్తిని సృష్టించేస్తుంది. చరణ్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాడు , చరణ్ లా చేసిన చరణ్ చరణ్ లానే చేసాడు అలానే అల్లుఅర్జున్ ల చెయ్యాల్సిన చరణ్ కూడా చరణ్ లానే చేయడంతో రెండు పాత్రలకు మధ్యన తేడా లేకుండా పోయింది. డాన్సు మరియు ఫైట్ విషంలో చరణ్ అభిమానులకు పండుగ కానుక ఇచ్చాడు. కాజల్ చిన్న పాత్ర అయిన బానే నటించింది. శృతి హసన్ ఉన్నంతసేపు చాల బాగా నటించింది కాస్త కామెడీ ఉన్న సన్నివేశాలలో తన టైమింగ్ తో ఆకట్టుకుంది. ఏమి జాక్సన్ ని ఈ చిత్రంలో ఎందుకయితే ఎంచుకున్నారో ఆ కారణాన్ని సఫలం చేసింది. సాయి కుమార్ నటన చిత్రానికి బాగా ప్లస్ అయింది కోట శ్రీనివాస్ రావు గారి పాత్రా చిన్నదే అయినా ఆయనకున్న అనుభవం ఆ పాత్రకు లేని ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. సెకండ్ హాఫ్ లో వచ్చ్సు జయసుధ గారి సన్నివేశాలలో ఆమె చాలా బాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శశాంక్ , వెన్నెల కిషోర్ బ్రహ్మానందం , అజయ్, ఎల్బీ శ్రీరాం ఇంకా మొదలగువారు ఉన్నారు కాని ఈ చిత్రంలో అంత గుర్తింపు పొందలేకపోయారు.

ఎవడు రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

వక్కంతం వంశీ అందించిన కథ కొత్తది కాదు ఇప్పటికి ఇలాంటి కథను చాలా తెలుగు చిత్రాలలోనే చూసాం, అదే లైన్ కి ఒక కొత్త సీన్ ని జత చేసి మళ్ళీ తీసారు. ఇక కథనం విషయానికి వస్తే మొదటి అర్ధ భాగంలో కామెడీ, రెండవ అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు చాలా సాగదీసారు. అబ్బూరి రవి రచించిన మాటలు అంతగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకత్వం విషయంలో వంశీ పైడిపల్లి చాల సేఫ్ వే ఎంచుకున్నాడు. సినిమాటోగ్రఫీ కూడా ఏదో ఉందంటే ఉంది కాని అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ ఇంకాస్త కట్ చెయ్యాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. కోరియోగ్రఫీ చాలా బాగుంది కొన్ని ఫిఘ్త్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ అందించిన సంగీతంలో పాటలు పరవలేధనిపించేలా ఉన్నా నేపధ్య సంగీతం సన్నివేశాలకు లేని బలాన్ని చేకూర్చాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సినిమా అంతా రిచ్ గా ఉంటుంది.


ఎవడు రివ్యూ: హైలెట్స్
  • ప్రధాన పాత్రలు, ఫైట్ సన్నివేశాలు,దేవిశ్రీ అందించిన సంగీతం,కథనం

ఎవడు రివ్యూ: డ్రా బాక్స్
  • కొన్ని సన్నివేశాలు డ్రాగింగ్,ఎడిటింగ్,అసలు పాత్రలు లేని హీరోయిన్ పాత్రలు,తెలుగు చిత్రాల షేడ్స్ కనిపించడం

ఎవడు రివ్యూ: విశ్లేషణ

మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం లో ఒక అభిమానికి, ఒక ప్రేక్షకుడికి ఏదైతే కావాలో అదే ఇచ్చాడు. కాని సమస్యల్ల వచ్చింది కథనం దగ్గరే చెప్పేదే రొటీన్ కథ అందులోనూ ప్రేరణ పొందిన సన్నివేశాలు, చరణ్ బ్లాంక్ ఎక్స్ప్రెషన్ సెకండ్ హాఫ్ లో దానికి జత అయిన శృతి బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇవి ఈ చిత్రాలలో మైనస్ లు ప్లస్ ల గురించి మాట్లాడితే అల్లు అర్జున్ నటన దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎలివేషన్ ఇవన్ని ప్లస్ , మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రం ఈ సంక్రాంతి విజేత, ఈ సంక్రాంతికి ఏదయినా చిత్రం చూడాలి అనుకుంటే రెండవ ఆలోచన లేకుండా "ఎవడు" చిత్రానికి వెళ్ళిపొండి ...


ఎవడు రివ్యూ: చివరగా
సంక్రాంతికి మాస్ విజేత
 

Review board: Sridhar, Rama Krishna. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Yevadu | Yevadu Wallpapers | Yevadu Videos

మరింత సమాచారం తెలుసుకోండి: