Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Feb 20, 2018 | Last Updated 6:55 pm IST

Menu &Sections

Search

జై లవ కుశ : రివ్యూ

- 2.75/5
జై లవ కుశ : రివ్యూ ఈ సినిమా రివ్యూ ను తెలుగులో చదవండి

What Is Good

  • ఎన్.టి.ఆర్ నటన
  • ఎంటర్టైన్మెంట్

What Is Bad

  • ఎడిటింగ్
  • సెకండ్ హాఫ్ ప్లాట్
Bottom Line: ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం ఈ జై లవ కుశ..!

Story

జై లవ కుశ ముగ్గురు కవలలు.. నాటకాలను వేస్తూ ఉండే వీరు లవ కుశనాటకాలేస్తుంటే జై మాత్రం తన లోపం వల్ల అందరిచేత అవమానించ బడతాడు. తల్లిని కోల్పోయిన వీరు మేనమామతో కలిసి నాటకాలు వేస్తుంటారు. అనుకోకుండా ఓ ఫైర్ యాక్సిడెంట్ లో వారు ఎవరికీ వారు అవుతారు. దాని నుండి ముగ్గురు సురక్షితంగా బయట పడినా ఎవరికి వారు మిగతా ఇద్దరు చనిపోయారని అనుకుంటారు. ఇక పెరిగిన వారిలో చిన్న వాడైన లవ బ్యాంక్ మేనేజర్ అవుతాడు. కుశ యూఎస్ వెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటాడు. పాతిక లక్షలు సంపాదించే క్రమంలో ఉన్న కుశ ఎలాగోలా ఇమిగ్రేషన్ కోసం ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగా నోట్ల రద్దు వల్ల ప్లాన్ అంతా చెడిపోతుంది. ఇక దానితో డిస్ట్రబ్ అయిన కుశ తాగి రోడ్డు మీద వస్తుంటాడు. అదే టైంలో కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన లవ అనుకోకుండా కుశని గుద్దేస్తాడు.

ఇక ఇద్దరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మాట్లాడుతారు. ఇక అమాయకుడైన కుశ బ్యాంక్ లో తనకుఉన్న సమస్యల గురించి కుశతో షేర్ చేసుకుంటాడు. ఇక అదే టైంలో లవగా కుశ బ్యాంక్ లోకి వెళ్తాడు. ఇక మరో పక్క జై రాజకీయ నేతగా ఎదగాలనుకుంటాడు. అతనికున్న నత్తి వల్ల స్పీచ్ లు ఇవ్వలేడు. ఇక తన గ్రూప్ లో వ్యక్తి చనిపోవడం వల్ల అక్కడకు వెళ్లి నివేథను చూసి ఇష్టపడతాడు. ఇక అక్కడ నుండి కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ జై లవ కుశ కలిశారా..? జై పాలిటిక్స్ లోకి వెళ్లాడా..? కుశ నిజంగానే 25 లక్షలు దొంగిలించాడా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారు అన్నది తెర మీద చూడాల్సిందే.     Star Performance

ఎన్.టి.ఆర్ ఈ మూడు అక్షరాలు చాలు ఈ సినిమాకు అనిపిస్తుంది. జై లవ కుశగా ఎన్.టి.ఆర్ చూపించిన అభినయం వేలెత్తి చూపించేందుకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక పాత్రకు మరో పాత్రకు ఎన్.టి.ఆర్ చూపించిన వ్యత్యాసం అదరహో అనిపిస్తుంది. కేవలం ఎన్.టి.ఆర్ కోసం రెండు మూడు సార్లు సినిమా చూసేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఇక రాశి ఖన్నా, నివేథా థామస్ ల అందం, అభినయం ఆకట్టుకుంటుంది.  రోనిత్ రాయ్ విలనిజం కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సాయి కుమార్ నటన కూడా ఇంప్రెస్ చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

Techinical Team

సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయానికొస్తే చోటా కె నాయుడు పనితనం అదుర్స్ అని చెప్పొచ్చు. సినిమాలో ప్రతి ఫేం అద్భుతంగా ఉంటుంది. ఇక మాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. ఎడిటింగ్ ఇంప్రెస్ చేసింది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ఇక ప్రొడక్షన్ ఖర్చు కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా చేశారు. బాబి డైరక్షన్ టాలెంట్ ఏంటో చూపించాడు. మూడు పాత్రల్లో ఎన్.టి.ఆర్ నుండి నట విశ్వరూపం అందరికి నచ్చేలా చేశాడు.

Analysis

బాబి కథను ఎన్.టి.ఆర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది సినిమాలో ప్రతి పాత్ర అభినయం చూస్తే తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి సినిమా కావాలనుకున్నాడో అదే ఈ జై లవకుశ. కథ కథనాల్లో దర్శకుడు బాబి చూపించిన పనితనం అంతా ఇంతా కాదు. ఎన్.టి.ఆర్ లోని నటనకు పరిపూర్ణత తెచ్చేలా మూడు పాత్రలు వేటికవి పోటీ పడేలా చేశాడు. ఇక మొదటి భాగం లవ, కుశల పాత్రలతో ఎంటర్టైన్ చేసిన బాబి సెకండ్ హాఫ్ లో జై పాత్రతో పీక్స్ లోకి తీసుకెళ్లాడు.

జై పాత్ర వచ్చినప్పటి నుండి సినిమా మరో రేంజ్ కు వెళ్తుంది. ముఖ్యంగా ఆ పాత్రకు నత్తి ఉండటం ఆ పరిస్థితుల్లో ఎన్.టి.ఆర్ భారీ డైలాగులు కొట్టడం అబ్బో ఇంతకుమించి ఏం కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్, ట్విస్టులు అన్ని కలగలిపి సినిమా ఫుల్ మీల్స్ ప్యాక్ గా తీసుకువచ్చాడు బాబి. సినిమా కోసం కోనా స్క్రీన్ ప్లే బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పాలి. 

కథ కథనాలే కాదు ఎన్.టి.ఆర్ ప్రెజెన్స్ సినిమాకు బీభత్సమైన క్రేజ్ తెస్తుంది. మూడు పాత్రలతో ఎన్.టి.ఆర్ సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్స్ అందాలు సినిమాకు అదనపు ఆకర్షణలు. దేవి మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి సినిమా మీద ఏదైతే నమ్మకం ఉంచారో అదే తరహాలో ఆడియెన్స్ ను ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ తెచ్చేసిందని చెప్పాలి.

Cast & Crew

3 / 5 - 9911
Add To Favourite

APHERALD EXCLUSIVE MOVIE REVIEWS

Kollywood

View all
Kalakalappu 2 Tamil Movie Review, Rating

Kalakalappu 2 Tamil Movie Review, Rating

Bhaagamathie Telugu Movie Review, Rating

Bhaagamathie Telugu Movie Review, Rating