మహేష్ బాబు , సినిమాటోగ్రఫీ , యాక్షన్ పార్ట్మహేష్ బాబు , సినిమాటోగ్రఫీ , యాక్షన్ పార్ట్ఎడిటింగ్ , స్క్రీన్ ప్లే
శివ (మహేష్) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తూ ఉంటాడు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారిని కాపాడతాడు. ఇక తన ఆపరేషన్ లో భాగంగా ఓరోజు అనూహ్యంగా ఓ అమ్మాయి ఫోన్ కు రెస్పాండ్ అవుతూ తనకు తెలిసిన పిసిని అక్కడకు పంపుతాడు. తెల్లారి చూస్తే ఆ ఇద్దరిని ఓ దుర్మార్గుడు దారుణంగా చంపేస్తాడు. దానికి కారణం ఎవరు అని తెలుసుకునే క్రమంలో తనకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. పుట్టగానే చావుకేకలు విన్న భైరవుడు మనుషులను చంపి తన సరదా తీర్చుకుంటాడు. ఇక ఈ క్రమంలో భైరవుడిని టార్గెట్ చేస్తూ శివ వేసిన ఎత్తులు పైఎత్తులు ఏంటి అన్నది తెర మీద చూడాల్సిందే.

మహేష్ వన్ మ్యాన్ షోగా వచ్చిన ఈ స్పైడర్ లో తన పర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. శివ పాత్రలో మహేష్ ఇంటెలిజెన్స్ సూపర్బ్ అనిపిస్తుంది. ఇక మహేష్ తో సమానంగా ఎస్.జె.సూర్య పాత్ర ఉంటుంది. భైరవుడిగా సూర్య నటన అందరిని ఆకట్టుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఏదో ఉంది అంటే ఉన్నట్టుగా రిఫ్రెష్మెంట్ కోసం అనిపిస్తుంది. భరత్ తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రియదర్శి, ఆర్జె బాలాజి హీరో పక్కన సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు.   

సినిమాకు ముందుగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి ఫ్రేం లో సినిమా రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. కథ కథనాల్లో మురుగదాస్ గ్రిప్పింగ్ బాగున్నా ఎక్కడో కాలిక్యులేషన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో హారిస్ జైరాజ్ మ్యూజిక్ పాటల వరకు ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అరుపులు పెట్టించాడు. సినిమా హైలెట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకటి. నిర్మాతలైతే సినిమాను అందంగా తెరకెక్కించడం కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించదు. 
మహేష్ మురుగదాస్ అనగానే ఆ అంచనాలు తెలిసిందే.. ఇక భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మురుగదాస్ మార్క్ టేకింగ్ తో వచ్చినా సరే ఎక్కడో తేడా కొట్టిందని తెలుస్తుంది. విజువల్ పరంగా గ్రాండ్ లుక్ తో కనిపించినా ఆడియెన్స్ కనెక్టివిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలో చాలా మంచి గూస్ బమ్స్ సన్నివేశాలు ఉన్నాయి. 

అయితే అవి సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయి అన్నది తెలియాలి. ఇక సినిమాలో చివరగా సాటి మనిషిగా ఇతరులకు సహాయం చేయాలి. ఏ సునామినో తుఫానో వచ్చినప్పుడు కాదు అన్న పాయింట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మహేష్ ఎప్పటిలానే తన పర్ఫార్మెన్స్ తో సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాడు. 

ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్ని ఇందులో ఉన్నాయి. అయితే ఆడియెన్స్ సినిమాను ఎంతవరకు ఓన్ చేసుకోగలుగుతారు అన్న దాని మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓవరాల్ గా మహేష్ ఫ్యాన్స్ కు మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు. బి,సి సెంటర్స్ లో కూడా సినిమా మంచి టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది. 
Mahesh Babu,Bharath,Rakul Preet Singh,S. J. Surya,A.R. Murugadoss,N. V. Prasad,Tagore Madhu,Manjula Swaroop,Harris Jayarajమహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే స్పైడర్..!

మరింత సమాచారం తెలుసుకోండి: