శర్వానంద్ నటన , స్క్రీన్ ప్లే , కామెడీశర్వానంద్ నటన , స్క్రీన్ ప్లే , కామెడీమిస్సింగ్ కమర్షియాలిటీ , రొటీన్ స్టోరీ
ఆనంద్ (శర్వానంద్) ఓసిడి అనగా అతి శుభ్రత అనే రోగంతో బాధపడుతుంటాడు. చూడటానికి అది రోగం గా కనిపించదు. అతిగా శుభ్రంగా ఉండటం పరిసరాలను శుభ్రంగా ఉండేలా  చూసుకోవడం ఈ వ్యాధి లక్షణం. తన నీట్ అండ్ క్లీన్ తనకు కాబోయే భార్యకు ఉండాలని కోరుకునే  ఆనంద్ కు తన ఆఫీస్ లోనే జాయిన్ అవుతుంది మేఘన (మెహెరిన్ పిర్జాదా). తన అలవాట్లను చూసి ఆనంద్ ను ప్రేమించిన మేఘన ఆనంద్ లవ్ ప్రపోజల్స్ ను ఓకే చేస్తుంది.

అయితే అతి శుభ్రత వల్ల తనకు కలిగే అసౌకర్యాన్ని ఆనంద్ ముందు ఉంచుతుంది మేఘన. అంతేకాదు తన తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే శుభ్రత గురించి ఆలోచించాడని అతని ప్రేమను బ్రేకప్ చేస్తుంది. అయినా సరే మేఘన తండ్రి సహాయంతో తన పుట్టి పెరిగిన ఊరికి వెళ్లి అక్కడ ఆమె ప్రేమను దక్కించుకోవాలని చూస్తాడు. ఇక ఊరి సర్పంచ్ పోటీలో కుస్తి యుద్ధం చేస్తేనే కాని గెలవరు అప్పటిదాకా మేనళ్లుడు తమ ఊరిపక్కన ఉండగా కూతురిని తనకు ఇవ్వట్లేదని పోటీగా వచ్చే ఊరికి సపోర్ట్ ఇస్తాడు. ఇక ఫైనల్ గా ఆ ఊరి పరువుని ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలిచాడు అన్నది అసలు సినిమా కథ.

ఎలాంటి పాత్రనైనా తన నటనతో ఆకట్టుకునే శర్వానంద్ ఓసిడి ఉన్న క్యారక్టరైజేషన్ తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం తన ఆకర్షణీయమైన నటనతో ఇంప్రెస్ చేశాడు శర్వానంద్. తనకు నప్పే కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాలో కనిపిస్తాడు. ఇక మేఘనగా మెహెరిన్ కూడా పర్వాలేదు. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన అంతగా ఇంప్రెసివ్ అనిపించదు. వెన్నెల కిశోర్ పాత్ర త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటుంది కాని అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఊరి పెద్దగా నాజర్ పాత్ర ఎప్పటిలానే అలరించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

దర్శకుడు మారుతి మంచి ఎంటర్టైనింగ్ కథతో ఈ మహానుభావుడు తీశాడు. సినిమా కథ రొటీన్ అనిపించినా కథనంలో హీరో క్యారక్టరైజేషన్ ను బేస్ చేసుకుని కామెడీని పండించడం బాగుంది. థమన్ మ్యూజిక్ కాస్త కొత్తగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. ఇక యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

ఈ సినిమా చూసిన తర్వాత మారుతి నాని కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మైండ్ లోకి వస్తుంది. అక్కడ మతిమరుపు పెట్టి దాన్ని కవర్ చేసిన హీరో ఇందులో అతి శుభ్రత అంటూ కనిపిస్తాడు. అయితే కథ రొటీన్ అనిపించినా కథనంలో మాత్రం ఎక్కడ ఎంటర్టనింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు మారుతి. అక్కడ అతనికి మంచి మార్కులే పడ్డాయి.

సినిమాను నిలబెట్టే సీన్స్ రెండు మూడు రాసుకుంటాడు. అవి కామెడీతో కడుపుబ్బా నవ్వించినా సినిమాకు అవి మంచి మైలేజ్ ఇస్తాయి. ఇదే ఫార్ములాను మారుతి ఈ సినిమాలో కూడా పెట్టాడు. కచ్చితంగా సినిమా ఓ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. అయితే కమర్షియాలిటీ లేకపోవడం కాస్త లాజికల్ గా స్క్రీన్ ప్లే ని నడిపించడం ఇబ్బందిగా ఉంటుంది.

సినిమా మొత్తం తన క్యారక్టరైజేషన్ మీదే సీన్స్ రాసుకోవడం చాలా కస్టమైన పని. కచ్చితంగా ఈ సినిమా టైటిల్ కు యాప్ట్ అయ్యే సినిమా. మహానుభావుడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది. మారుతి శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మహానుభావుడు మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
Sharwanand,Mehreen Pirzada,Maruthi Dasari,V. Vamsi Krishna Reddy,Pramod,S. Thamanశర్వానంద్ మహానుభావుడు నవ్వించేస్తాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: