విజయ్ నటన, మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , డైలాగ్స్విజయ్ నటన, మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , డైలాగ్స్సెకండ్ హాఫ్ ల్యాంగ్

డాక్టర్ వృత్తిలో ఉన్న భార్గవ్ దాన్ని వ్యాపారంగా చేస్తున్న వారి పట్ల కక్ష్య కడతాడు. అందుకు కారణమైన వారిని వరుసగా చంపుతూ వస్తుంటాడు. ఓ పక్క మ్యుజిషియన్ గా మరో పక్క డాక్టర్ గా విజయ్ భార్గవ్ తన పని తాను చేసుకుంటుండగా డాక్టర్ డానియోల్ (ఎస్.జే.సూర్య) కు సన్నిహితుడని అర్జున్ ని చంపేస్తాడు. అక్కడి నుండి అతని చావుకి కారణమైన విజయ్ భార్గవ్ మీద దృష్టి పెడతాడు డానియల్. అసలు విజయ్ భార్గవ్ ఒకరేనా..? ఎందుకు డాక్టర్ అర్జున్ ను చంపుతారు..? అసలు విజయ్ భారగ్ మనోగతం ఏంటి..? అన్నది అసలు కథ.  

ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పాత్రల్లో విజయ్ తన అద్భుతమైన నటనను కనబరిచాడు. తనకున్న మాస్ ఫాలోయింగ్ కు సరిగ్గా అలాంటి సినిమా తెచ్చాడు. ఇక తన సినిమాలో ఉండాల్సిన మెసేజ్ మాత్రం మిస్ అవ్వలేదు. ఇక హీరోయిన్స్ గా కాజల్, సమంత, నిత్యా మీనన్ నటించగా అందులో ముగ్గురికి అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర లేదని చెప్పాలి. నిత్యా మీనన్ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొతమేరకు బెటర్ అని చెప్పొచ్చు. ఇక వడివేలు పాత్ర కూడా ఆకట్టుకుంది. విలన్ ఎస్.జె.సూర్య నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సత్యరాజ్ కూడా తన పాత్రకు తగినట్టుగా చేశాడు.

సినిమా దర్శకుడు అట్లీ విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలతో ఈ కథ రాసుకున్నాడని చెప్పొచ్చు. దర్శకుడు సినిమాను కమర్షియల్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కథ కథనాలు పాతవే అయినా టేకింగ్ పరంగా అబ్బురపరచాడు. ఇక రెహమాన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు పెద్ద అసెట్. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మెర్సల్ గా తమిళనాడులో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన విజయ్ సినిమా తెలుగు వర్షన్ అదిరింది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ కథనాల్లో కొత్తదనం లేకున్నా వైద్యవృత్తిలో జరుగుతున్న అన్యాయాలను బాగా చూపించారు. సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వగా అదే అంచనాలతో తెలుగులో వచ్చింది.

అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఈ సినిమా సోసోగానే నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో డైలాగ్స్ కొన్ని మ్యూట్ చేసేశారు. సినిమా కాన్సెప్ట్ చెప్పే డైలాగులకే మ్యూట్ పడేసరికి నిరాశ పడక తప్పదు. ఇక కమర్షియల్ గా చూస్తే తెలుగులో అదిరింది విజయ్ కు మంచి హిట్ సినిమాగానే నిలుస్తుంది. 

స్టార్ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులుంటూనే కథలో మంచి మెసేజ్ తో కూడా వచ్చింది ఈ తెలుగు మెర్సల్ అదే అదిరింది. ఇక్కడ యూత్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం స్పీడ్ గా లాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా విజయ్ కు తెలుగులో తుపాకి తర్వాత మంచి హిట్ ఇస్తుందని చెప్పొచ్చు.
Vijay,Samantha,Kajal Aggarwal,Nithya Menon,S. J. Surya,Atlee,N. Ramasamy,Hema Rukmani,R. Mahendran,H. Murali,A. R. Rahmanవిజయ్ 'అదిరింది' మొత్తానికి అదరగొట్టేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: