మంచు మనోజ్ , సినిమాటోగ్రఫీ , కథమంచు మనోజ్ , సినిమాటోగ్రఫీ , కథకథనం , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

కాలేజ్ స్టూడెంట్ అయిన సూర్య (మంచు మనోజ్) కాలేజ్ లో ముగ్గురమ్మాయిలు ఆత్మహత్య చేసుకోగా దాని మీద నిరసనకు దిగుతాడు. విద్యార్ధి నాయకుడిగా ఉన్న సూర్య ఈ విషయం మీద ఉద్యమానికి దిగుతాడు. ఈ టైంలో అతనికి స్వర్ణ (అనీషా ఆంబ్రోస్) రిపోర్టర్ సహాయం తీసుకుంటాడు. ఆత్మహత్యలకు కారణమైన మినిస్టర్ సూర్యను అరెస్ట్ చేయించి ఎంకౌంటర్ చేయించేలా ప్లాన్ చేస్తాడు. వార్ని భారి నుండి సూర్య ఎలా ఎస్కేప్ అయ్యాడు..? ఇక ఈ కథలో పీటర్ ఎలా వచ్చాడు..? అసలు అతను ఎవరు అన్నది అసలు కథ.

రెండు పాత్రల్లో మంచు మనోజ్ నటన అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు జోవియల్ పాత్రలో ఆకట్టుకునే మంచు కుర్రాడు ఈసారి ఫుల్ లెంథ్ సీరియస్ రోల్ లో నటించాడు. విధ్యార్ధి నాయకుడిగానే కాదు పీటర్ గా కూడా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రముఖ పాత్ర అజయ్ ఆండ్రూస్ బాగా నటించాడు. హీరోయిన్ అనీషా పర్వాలేదు అనిపిస్తుంది. పోసాని సిన్సియర్ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకోగా సుహాసిని, మిలింద్ గునాజి పాత్రలు ఆకట్టుకున్నాయి. 

సినిమా దర్శకుడు అజయ్ ఆండ్రోస్ కథ కథనాల్లో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. శ్రీలంకలో ఉండే శరణార్ధులు ప్రత్యేక దేశం కోసం పోరాడగా వారికి అండగా నిలిచిన ఎల్టిటి చీఫ్ ప్రభాకరణ్ జీవితంలో కొన్ని ఘట్టాలని ఈ సినిమాలో తీసుకున్నాడు. కథను యాక్సెప్టబుల్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమాటోగ్రఫీ ఓకే. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండాల్సింది. మ్యూజిక్ సోసోగానే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. 

మంచు మనోజ్ ఎల్టిటి చీఫ్ గా కనిపించడం.. సినిమా టీజర్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించడంతో ఒక్కడు మిగిలాడు మీద అంచనాలు పెంచుకున్నారు. అయితే ఇదో డాక్యుమెంట్రీ లాగా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ అద్భుతంగా ఉండగా డ్రమా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా కాస్త తగ్గింది.
టీజర్, ట్రైలర్ లో సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడగా సినిమా మొదలు పెట్టిన

విధానం ముగింపు కూడా పొంతనలేకుండా చేశారు. సినిమాలో హీరోగా మనోజ్ బాగున్నాడు కాని ఎంతసేపు చంపుకోవడం లాంటివి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. డాక్యుమెంటరీ సినిమాగా అనిపించడం అంటే సినిమా దర్శకుడి లోపం అనే చెప్పాలి.

సినిమాలో దర్శకుడు విలన్ గా నటించాడు అతని పాత్రని హైలెట్ చేసుకున్నాడు. ఇక కథ కథనాల్లో అవసరమైన మ్యాజిక్ మాత్రం చూపించలేదు. రియలిస్టిక్ గా తెరకెక్కించే క్రమంలో అది డాక్యుమెంటరీగా అవుతుందని గుర్తించలేదు కాబోలు సినిమా అక్కడక్కడ కాస్త బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మనోజ్ కు ఉన్న యూత్ ఫాలోయింగ్ తో ఈ సినిమా వారికి కనెక్ట్ అయితే సినిమా మంచిగా ఆడే అవకాశం ఉంది.
Manchu Manoj Kumar,Anisha Ambrose,Ajay Andrews Nuthakki,SN Reddy,Siva R Nandigamమంచు మనోజ్ ప్రయత్నం ఫలించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: