కార్తి , స్టోరీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కార్తి , స్టోరీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్సాంగ్స్ , డ్యూరేషన్

నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ ధీరజ్ (కార్తి) డిఎస్పిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే దోపిది పట్టుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. ప్రాణాలకు తెగించి మరి ధీరజ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కేసులో వాస్తవాలను తెలుసుకునేందుకు ధీరజ్ ఎంతో రిస్క్ చేస్తాడు. దోపిడి హత్యల వెనుక ఉన్న ముఠా ఎవరు..? వారిని ధీరజ్ ఎలా పట్టుకున్నాడు..? అన్నది అసలు కథ.

కార్తి నటన ఎప్పటిలానే ఆకట్టుకుంది.. అయితే తెలుగు డబ్బింగ్ మీద కార్తి ఇంకాస్త జాగ్రత్త వహించాల్సిందని అనిపిస్తుంది. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా రియలిస్టిక్ గా కార్తి ఆకట్టుకున్నాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కేవలం కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితం అయ్యింది. సినిమాలో రకుల్ ఉన్నంత సేపు రొమాంటిక్ లుక్ లో కనిపించింది. ఇక విలన్ గా అభిమన్యు సింగ్ నటన ఆకట్టుకుంది. తన లుక్ విషయంలో దర్శకుడు సహజత్వం చూపించాడు. బోస్ వెంకట్ కూడా ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

వినోద్ రాసుకున్న కథ మీద చాలా రిసర్చ్ చేశాడని చెప్పొచ్చు. కథ కథనాల్లో తన స్టాంప్ చూపించాలని చూశాడు. అయితే కథనంలో వేగం తగ్గడం సినిమాకు మైనస్. గిబ్రన్ మ్యూజిక్ పాటలెలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నార్త్ ఇండియా విలేజ్ లో తీసిన సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది అనిపిస్తుంది.

ఖాకి అంటూ ఓ రియల్ పోలీస్ పది సంవత్సరాలుగా మర్చిపోయిన కేసుని రీసర్చ్ చేసిన పోలీస్ కథ. సినిమా సహజత్వానికి దగ్గరగా తీయడం దర్శకుడి గొప్పతనం. పోలీస్ అనగానే భారీగా ఊహించాలనుకుండా సగటు మనిషిగానే చూపిస్తూ తన పవర్ ఏంటో చూపించేలా చేశాడు. కార్తి పాత్రను మలిచిన తీరు బాగుంటుంది.


ఇక దొంగల ముఠా ఎలా ఉంటుంది.. వారి మూర్ఖత్వం.. పోలీస్ ఇంటరాగేషన్ సంబందించిన విషయాలు అందరిని ఆకట్టుకుంటాయి. ఇక సినిమా మొదటి భాగం కార్తి, రకుల్ సీన్స్ బాగున్నా ఎందో ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వవు. ఇక సినిమా కేసు రీసర్చ్ స్టార్ట్ అయినప్పటి నుండి వేగం పుంజుకుంటుంది. సినిమా సెకండ్ హాఫ్ వేగం తగ్గిందనిపిస్తుంది.


సినిమా నిడివి కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. అయితే సినిమా సెకండ్ హాఫ్ దొంగల ముఠాని హీరో ఎలా పట్టుకున్నాడు అన్నదే.. ఆ కథనం నడిపించిన తీరు బాగున్నా కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా కార్తి మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వచ్చాడని చెప్పొచ్చు.


Karthik Sivakumar,Rakul Preet Singh,Vinoth H,Prabhu S R,Ghibranఖాకితో కార్తి మెప్పించే ప్రయత్నమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: