సిద్ధార్త్, అనీషా నటన , కథ, కథనాలు, డైరక్షన్సిద్ధార్త్, అనీషా నటన , కథ, కథనాలు, డైరక్షన్అక్కడక్కడ ల్యాగ్ అవడం

డాక్టర్ కృష్ణ కుమార్ అలియాస్ క్రిష్ (సిద్ధార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి జీవనం సాగిస్తుంటాడు. ఇక వారు ఉండే ఇంటి ఎదురింట్లో కొత్తగా ఓ ఫ్యామిలీ దిగుతుంది. ఆ ఇంట్లో వారికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. క్రిష్ ఎదురింట్లో జెన్నీ (అనీషా) విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఇంట్లో దెయ్యాలున్నాయని తెలుసుకున్న క్రిష్ అతను కూడా చిక్కుల్లో పడతాడు. ఇంతకీ ఆ గృహంలో ఏం జరిగింది..? అసలు దెయ్యం ఎందుకు వారిని ఇబ్బంది పెడుతుంది..? అన్నది అసలు కథ.

సిద్ధార్థ్ చాలా కొత్తగా ఉన్నాడనిపిస్తుంది. సినిమాలో తన రోల్ పర్ఫెక్ట్ గా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఆండ్రియా కూడా తన పాత్ర వరకు బాగా చేసింది. సిద్ధార్థ్, ఆండ్రియా రొమాన్స్ బాగుంది. ఇక జెన్నిగా నటించిన అనీషా కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించింది. అనీషా కూడా నటనతో మెప్పించింది. అతుల్ కులకర్ణి, సురేష్ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సిద్ధార్థ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా కథకు ఎంత వసరమో అంత ఖర్చు పెట్టేశాడు. మిలింద్ రావ్ కథ కథనాలు సినిమాకు బలమని చెప్పొచ్చు. ముఖ్యంగా హర్రర్ సినిమాకు కావాల్సిన సస్పెన్స్.. క్యూరియాసిటీ ఈ సినిమాలో మెయింటైన్ చేశాడు. సినిమా కెమెరా వర్క్ కూడా బాగుంది. మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ సినిమాకు హెల్ప్ అయ్యింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ తమిళంలో ఓ మోస్తారు క్రేజ్ తో ఉన్నా తెలుగులో ఈమధ్య హిట్ కొట్టింది లేదు. కొద్దిపాటి గ్యాప్ తో తెలుగులో గృహం అంటూ వచ్చాడు సిద్ధార్థ్. కచ్చితంగా ఓ మంచి ప్రయత్నమే అని చెప్పొచ్చు. హర్రర్ సినిమాలంటే కామెడీ కలిపి భయపెట్టి నవ్వించడమే అన్న విధంగా ఉన్న తరుణంలో అసలు హర్రర్ సినిమా అనేలా వచ్చింది గృహం.


కథ కథనాల్లో చాలా క్లియర్ గా ప్రేక్షకులను భయపెడుతూ అలరించడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు. కథలో పెద్దగా ట్విస్టులు లేకున్నా క్లైమాక్స్ లో మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఇక సిద్ద్ధార్థ్, ఆండ్రియా రొమాన్స్ యూత్ కు నచ్చుతుంది. హర్రర్ సినిమాలు మిస్ గైడ్ అవుతున్న తరుణంలో సిద్ధార్థ్ గృహం నిజంగా ఓ హర్రర్ మూవీ ఫీల్ కలిగిస్తుంది. 


సిద్ధార్థ్ కు కచ్చితంగా తెలుగులో ఓ హిట్ దక్కినట్టే అంటున్నారు. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి గృహం తప్పక నచ్చుతుంది. సిద్ధార్థ్ ఈ సినిమాతో తప్పకుండా మళ్లీ జోష్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు.
Siddharth,Andrea Jeremiah,Milind Rau,Girishhసిద్ధార్థ్ గృహం.. భయపెట్టడం ఖాయం..!

మరింత సమాచారం తెలుసుకోండి: