సాయి ధరం తేజ్, మెహ్రీన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్సాయి ధరం తేజ్, మెహ్రీన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్సెకండ్ హాఫ్ , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్కుటుంబం కన్నా దేశాన్ని ప్రేమించే జై (సాయి ధరం తేజ్) ఎలాగైనా సరే డి.ఆర్.డి.ఓలో జాబ్ సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక మరో పక్క తన స్వంత ప్రయోజనాల కోసం దేశానికి అన్యాయం చేయాలని చూస్తాడు కేశవ (ప్రసన్న) ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షనే జవాన్ కథ. డి.ఆర్.డి.ఏ ప్రతిష్టాత్మకంగా కనిపెట్టిన ఆక్టోపస్ ను కాజేసే ప్లాన్ చేసిన ప్రసన్నను జై ఎలా అడ్డుకున్నాడు..? ఈ ఆపరేషన్ లో జై ఫ్యామిలీ ఎలా రిస్క్ లో పడ్డది..? అన్నది అసలు కథ.
జై పాత్రలో సాయి ధరం తేజ్ బాగా నటించాడు. సినిమాలో తేజ్ కాస్త పరిణితి చెందిన నటుడిగా కనిపిస్తాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ఇక మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. అమ్మడు అందాలకు ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయం. ఇక విలన్ ప్రసన్న తన పాత్ర చక్కగా చేశాడు. నాగ బాబు కూడా తనకు తగిన పాత్ర చేశాడు. కోటా శ్రీనివాసరావు, సుబ్బరాజు, జయ ప్రకాశ్ కూడా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

జవాన్ సినిమాటోగ్రఫీ కె.వి.గుహన్ పనితనం బాగుంది. థమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా తమన్ తన పనితనం చూపించాడు. ఇక దర్శకుడిగా బివిఎస్ రవి ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉన్నాయి.

దేశం కోసం ఏదైనా చేసే కుర్రాడు జై.. తన స్వప్రయోజనాల కోసం దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే కేశవ ఈ పాత్రల మధ్య జరిగే మైండ్ గేం బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. హీరో క్యారక్టరైజేషన్ బాగా రాసుకున్నాడు. అయితే అనవసరమైన కమర్షియల్ హంగులకు పోయి సినిమాను కాస్త డిస్ట్రబ్ చేసినట్టు అనిపిస్తుంది.


మొదటి భాగం బాగా నడిపించినా సెకండ్ హాఫ్ లో అసలు పట్టు సాధించాల్సిన సమయంలో సినిమా తేలగొట్టారు. ఇక కొన్ని లాజికల్ గా డ్రా బ్యాక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రేక్షకుడు ఊహించేలా నడుస్తుండటం విశేషం. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. అయితే హీరో చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి.


దర్శకుడిగా బివిఎస్ రవి కొంతమేరకు సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. అయితే కథ బాగున్నా దాన్ని ఇంకాస్త పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా కొత్తగా తీసుంటే బాగుండేదని అంటున్నారు. ఓవరాల్ గా మెగా పవర్ చూపించడానికి వచ్చిన సాయి ధరం తేజ్ జవాన్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడని చెప్పొచ్చు.
Sai Dharam Tej,Mehreen Pirzada,B. V. S. Ravi,Dil Raju,S. Thamanజవాన్ గా మెప్పించిన సాయి ధరం తేజ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: