కథ, కథనాలు ,సుమంత్ నటన , భావోద్వేగాలుకథ, కథనాలు ,సుమంత్ నటన , భావోద్వేగాలుస్లో నేరేషన్ , ఫస్ట్ హాఫ్ ల్యాంగ్

కార్తిక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష) చిన్నప్పుడే ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లకి ఆ విషయం తెలియడంతో అంజలిని వాళ్ల పేరెంట్స్ వేరే ఊరికి తీసుకెళ్తారు. కార్తిక్, అంజలి దూరమైనా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇక 13 ఏళ్ల తర్వాత కార్తిక్ పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీలోనే అంజలి చేరుతుంది. అక్కడ ఇద్దరు తమ ప్రేమని వ్యక్తపరచుకుని పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. అయితే ముందు సరే అన్న అంజలి ఆ తర్వాత కార్తిక్ తో పెళ్లికి నో అని చెబుతుంది. ఇంతకీ కార్తిక్ ను అంజలి ఎందుకు కాదంది..? కార్తిక్ అంజలిని పెళ్లి చేసుకుందా లేదా..? అసలు ఇద్దరు విడిపోడానికి కారణాలేంటి అన్నది సినిమా కథ.

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ మళ్లీరావా తో మంచి నటన కనబరిచాడు. కచ్చితంగా సుమంత్ కు ఇది కం బ్యాక్ సినిమా అవుతుంది. ఇక హీరోయిన్ ఆకాంక్ష సింగ్ బాగానే చేసింది. హీరో హీరోయిన్ చిన్ననాటి పాత్రలు పోశించిన సాత్విక్, ప్రీతిలు కూడా బాగా చేశారు. ఇక మిర్చి కిరణ్ పాత్ర కామెడీతో అలరించింది. సినిమాలో మిగతా నటీనటులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.



దర్శకుడు గౌతం ఓ మంచి ఫీల్ గుడ్ స్టోరీ రాసుకున్నాడని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు గట్టెక్కినట్టే. అయితే నేరేషన్ ఫస్ట్ హాఫ్ ఎక్కువ డ్రమెటిక్ గా అనిపిస్తుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకాస్త తగ్గించాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ హీరోగా సత్తా చాటాలని అనుకుంటున్నా టైం కలిసి రావట్లేదు. లాస్ట్ ఇయర్ నరుడా డోనరుడా సినిమా చేసిన సుమంత్ ఈసారి ఫీల్ గుడ్ మూవీ మళ్లీరావాతో వచ్చాడు. సినిమా అంతా సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో నడుస్తుంది. హీరో పాత్ర అయితే చాలా గొప్పగా రాసుకున్నాడు దర్శకుడు.

అయితే ఎక్కువ డ్రమెటిక్ గా ఉంటుందన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. సినిమా ఫస్ట్ హాఫ్ దెబ్బ కొట్టింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పతాక సన్నివేశాల్లో మనసులను టచ్ చేస్తుంది. ప్రేమకథనే అయినా దర్శకుడు కొత్త పాయింట్ తో వచ్చాడు.

ఇక సినిమా యూత్ కు బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమంత్ కు కచ్చితంగా కం బ్యాక్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. సినిమా అంతా సుమంత్ నటనతో ఆకట్టుకున్నాడు. 
Sumanth,Aakanksha Singh,Gowtam Tinnanuri,Rahul Yadav Nakka,Shravan Bharadwajసుమంత్ మళ్లీరావా మంచి ప్రయత్నమే.. కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: