భూమిక, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్భూమిక, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్స్టోరీ , స్క్రీన్ ప్లే , మ్యూజిక్, సెకండ్ హాఫ్
నాని (నాని) మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి లేకపోవడంతో అన్నయ్య రాజీవ్ కనకాలతో ఎంతో ప్రేమగా ఉంటాడు. అన్న జ్యోతి (భూమిక)ను పెళ్లి చేసుకోగానే అన్నా తమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతుంది. ఇక వదిన కోసం హైదరాబాద్ నుండి వరంగల్ షిఫ్ట్ అవుతాడు నాని. ఈ క్రమంలో తనకు పల్లవి (సాయి పల్లవి) పరిచయమవుతుంది. నానిని చూసి పల్లవి తనంతట తనే ప్రపోజ్ చేస్తుంది. రవాణా శాఖలో పనిచేస్తున్న జ్యోతి శివ ట్రావెల్స్ బస్సులను టార్గెట్ చేస్తుంది. శివ జ్యోతిని చంపాలని చూస్తాడు. శివన్న నుండి వదినను నాని ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ. 

నాచురల్ స్టార్ నాని ఎప్పటిలానే తన నాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో నాని ఇంప్రెస్ చేశాడు. ఇక పల్లవిగా సాయి పల్లవి సినిమాలో అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్ ఏం కాదు. అయినా తన క్యూట్ యాక్టింగ్ తో అలరించింది. సినిమాలో భూమిక పాత్ర కాస్త స్కోప్ ఉన్నదిగా ఉంటుంది. వదినగా భూమిక తన సహజ నటనతో ఆకట్టుకుంది. విలన్ గా విజయ్ ఆకట్టుకున్నాడు. అయితే విలన్ ను కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదు. స్నేహితులుగా ప్రియదర్శి, సుధీర్, రచ్చ రవి కనబడ్డారు. నరేష్, ఆమని పాత్రలను సరిగా వాడలేదు. 

సినిమాకు సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి పనితనం బాగుంది. వేణు శ్రీరాం కథ కథనాలే రొటీన్ గా సాగాయి. దేవి మ్యూజిక్ రెండు పాటలు ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైలాగ్స్ అక్కడక్కడ అలరించాయి. డైరక్టర్ మాత్రం సినిమా చాలా రొటీన్ పంథాలో తీశాడు.

ఎం.సి.ఏ అని టైటిల్ పెట్టి మిడిల్ క్లాస్ మెంటాలిటీ చూపిద్దామనుకున్న దర్శకుడు మెయిన్ స్టోరీ అంతా రొటీన్ గా నడిపించేశాడు. సినిమా మొదటి భాగం కాస్త ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. కాని సెకండ్ హాఫ్ అంతా ప్రేక్షకులు ఊహించేలా ఉంటుంది. హీరో విలన్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు.

కథ కథనాలు కొత్తగా సాగవు సరికదా సెకండ్ హాఫ్ మొత్తం అంతా రొటీన్ పంథాలో కొనసాగుతుంది. దర్శకుడు రొటీన్ కథ అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యాడు. పాటల్లో కూడా కేవలం రెండు పాటలు అలరించాయి. డైలాగ్స్ విషయంలో కూడా కేవలం కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి.

ఇక సినిమా క్లైమాక్స్ కూడా నిరాశ పరచిందని చెప్పొచ్చు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఎం.సి.ఏ పై అంచనాలను పెంచేయగా ఆ అంచనాలను మాత్రం అందుకోలేదు. యూత్ ఎంటర్టైనర్ గా అనిపిస్తున్నా సెకండ్ హాఫ్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో సాయంత్రం వరకు తెలుస్తుంది. 
Nani,Sai Pallavi,Venu Sriram,Dil Raju,Devi Sri Prasadఅంచనాలను అందుకోని నాని ఎం.సి.ఏ..!

మరింత సమాచారం తెలుసుకోండి: