అఖిల్ , స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్అఖిల్ , స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్అక్కడక్కడ స్లో అవడం , కథ ముందే తెలుస్తుండటం
శీను (అఖిల్) ఓ అనాధ.. చిన్నతనంలో తనని అభిమానించిన జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి ప్రియదర్శిని) దూరం చేసుకుంటాడు. ఆమె తనని వదిలి వెళ్లే టైంలో అతనికి 100 రూపాయల నోట్ మీద తన నెంబర్ రాసి వెళ్తుంది. అయితే ఆ నెంబర్ మిస్ అయ్యిన శీను తన కోసం 15 ఏళ్లుగా వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే పిల్లలు లేని జగపతి బాబు, రమ్యకృష్ణలు శీనుని దత్తత తీసుకుంటారు. అప్పటి నుండి శీను అవినాష్ గా మారతాడు. ఇక పెద్దదైన జున్ను ఓ పెళ్లి కోసం హైదరాబాద్ వస్తుంది. శీను అయిన అవినాష్ ను కలుస్తుంది. అయితే తన సోల్ మెట్ తనే అని తెలియక ఇద్దరు కలిసి ఉన్నా సోల్ మెట్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఇంతకీ శీను జున్నులు కలిశారా..? వీరి ప్రేమ ఎలా నిలబడింది..? ఫైనల్ గా ఈ ఇద్దరిని ఎవరు కలిపారు అన్నది సినిమా కథ.

అఖిల్ రీ లాంచింగ్ మూవీగా ఈ హలో ఉందని చెప్పొచ్చు. సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. నటనలో పరిణితి కనబరిచాడు. యాక్షన్ సీన్స్ లో అయితే ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే. ఓవరాల్ గా సినిమా మొత్తం అఖిల్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని నటన బాగుంది. క్యూట్ లుక్స్ తో ఆమె ఆకట్టుకుంది. జగపతి బాబు, రమ్యకృష్ణల నటన ఎప్పటిలానే సహజంగా ఆకట్టుకుంది. చిన్న పాత్రలో అజయ్ అలరించాడు.

హలో సినిమా దర్శకుడు విక్రం కుమార్ చిన్న కథను బాగా డీల్ చేశాడు. చిన్నప్పుడు విడిపోయిన ప్రేమికులు ఫోన్ నెంబర్ ద్వారా ఎలా కలిశారు అన్న కథను బాగా తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడ ట్రాక్ తప్పినా ఓవరాల్ గా సినిమా బాగుంది. ఇక పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి.

అఖిల్ రీ లాంచింగ్ మూవీగా హలో గ్రాండ్ గా ఉంది. ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా కథలా చాలా సినిమాలొచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే నీట్ గా ప్రెజెంట్ చేశాడు విక్రం కుమార్. సినిమా మొదటి భాగం అందంగా తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది మళ్లీ క్లైమాక్స్ నిలబెట్టాడు.

సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆడియెన్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఈ విడిపోయిన రెండు పాత్రలు కలవడమే సినిమా కథ అని తెలుస్తుంది. అయితే ఈమధ్యలో దర్శకుడు తన చక్కని కథనంగా అలరించాడు. అఖిల్ యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్. ఫైట్స్ అందంగా తెరకెక్కించారు. పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. అఖిల్ తో ఫ్లాప్ కొట్టిన అఖిల్ ఈ హలోతో హిట్ అందుకున్నట్టే.

సెన్సిబుల్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడు ప్రేక్షకులు గెలిపిస్తారు. హలో కూడా అలాంటి కోవకు చెందిన సినిమానే క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా పండించారు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాత టైట్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా అఖిల్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.
Akhil Akkineni,Kalyani Priyadarshan,Vikram Kumar,Nagarjuna Akkineni,Anup Rubensఅఖిల్ హలో.. మెప్పించేశాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: