బాలకృష్ణ ,నయనతార , సినిమాటోగ్రఫీబాలకృష్ణ ,నయనతార , సినిమాటోగ్రఫీమాస్ ఎలిమెంట్స్ , వీక్ క్లైమాక్స్ , విలన్
నరసింహ (బాలకృష్ణ) తన చంటి బిడ్డతో కుంభకోణంలో ఉంటాడు. తన భార్య మంగ(హరిప్రియ)కు ఇచ్చిన మాట ప్రకారం కొడుకుని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇక అక్కడే కాలకేయ ప్రభాకర్ నరసింహ తో గొడవపడతాడు. అక్కడ గొడవలలా ఉంటే నరసింహ మీద పగతో రగిలిపోతుంటాడు అశుతోష్ రాణా. కొడుకుని ఎంపి నామినేషన్ కు అడ్డు వచ్చి అతని మరణానికి కారణమైన నరసింహా మీద పగ పెంచుకుంటాడు. మరో పక్క గౌరి (నయనతార)ను ప్రేమించిన నరసింహా ఎందుకు ఆమెకు కాదని మంగను పెళ్లిచేసుకుంటాడు. విలన్ మీద నరసింహా పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ.

నందమూరి బాలయ్య మరోసారి ఫుల్  లెంగ్త్  మాస్ రోల్ లో మెప్పించాడని చెప్పొచ్చు. డైలాగ్స్, ఫైట్స్ మాత్రమే కాదు ఈ సినిమాలో డ్యాన్సులు కూడా అదరగొట్టాడు. ఇక సినిమాలో నయనతార మంచి అభినయం చూపించింది. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. హరిప్రియకు ప్రాముఖ్యత ఉన్న రోల్ దొరికింది. ఇక నటాషా దోషిది అంత బలమైన పాత్ర కాదు. బ్రహ్మానందం కామెడీ కాస్త పర్వాలేదు. అశుతోష్ రాణా విలనిజం అంతగా వర్క్ అవుట్ కాలేదు. మురళి మోహన్ రెండు మూడు సీన్స్ లో కనిపించి మెప్పించారు. 

రాం ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ ఓకే. కథా, మాటలను అందించిన రత్నానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే వాయిలెన్స్ ఎక్కువయ్యింది అని చెప్పొచ్చు. రవికుమార్ డైరక్షన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. 

నందమూరి బాలకృష్ణ నుండి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా జై సింహా. ఈ సినిమా మొదటి భాగం ఎంటర్టైన్ మోడ్ లో సాగగా సెకండ్ హాఫ్ లో వయిలెన్స్ ఎక్కువవయ్యిందని అనిపిస్తుంది. కథ కథనాలు కొత్తగా కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పొచ్చు. బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కు తగిన సినిమా అని చెప్పొచ్చు.

కథ.. కాస్టింగ్ ఇలా అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ అనిపిస్తుంది. అయితే యాక్షన్ సీన్స్ మరి ఎక్కువ అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కాస్త బోర్ అనిపిస్తుంది కూడా. సంక్రాంతి రాజు గా బాలయ్య మరోసారి తన సత్తా చాటాడని చెప్పొచ్చు. రొటీన్ కామెడీనే అయినా బ్రహ్మానందం సీన్స్ ప్లేస్ మెంట్ కరెక్ట్ గా పడినట్టు అనిపిస్తుంది. 

ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా పక్కాగా నచ్చే అవకాశం ఉంటుంది. డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు తిరుగులేదని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. 


Nandamuri Balakrishna,Nayanthara,K. S. Ravikumar,Kalyan .C,Chirantan Bhattహై వోల్టేజ్ జై సింహా.. ఫ్యాన్స్ కు మాత్రమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: