థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , సురభి , సినిమాటోగ్రఫీథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , సురభి , సినిమాటోగ్రఫీసెకండ్ హాఫ్, మ్యూజిక్
ఇష్టపడిన అమ్మాయి జ్యోష్న (సురభి)తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న జీవా (అల్లు శిరీష్) జో ఎదురింటిలో ఉండే శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల జీవితాల గురించి తెలుసుకుంటారు. వారి లైఫ్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ జీవా, జోల లైఫ్ లో జరుగుతుంది. దీనికి కారణాలేంటని తెలుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. పార్లర్ లైఫ్ గా వారి ప్రెజెంట్ తమ ఫ్యూచర్ గా నడుస్తుంది. వారి లైఫ్ లానే వీరి లైఫ్ కూడా రిస్క్ లో పడగా విధి రాతకు ఎదురెళ్లి మరి తన లైఫ్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు జీవా. అసలు ఇంతకీ వీరి పార్లర్ లైఫ్ స్టోరీ ఏంటి..? జీవా ఈ ప్రాబ్లెం నుండి ఎలా బయట పడ్డాడు..? అన్నది అసలు కథ.  


అల్లు శిరీష్ జీవా పాత్రలో మెప్పించేశాడు. సినిమా సినిమాకు శిరీష్ నటనలో పరిణితి కనబడుతుంది. అయితే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ గా సురభి అలరించింది. ఇక సినిమాలో మెయిన్ గా అవసరాల శ్రీనివాస్ రోల్ ఆకట్టుకుంది. దర్శకుడు ఈ పాత్రని తెరకెక్కించిన విధానం.. దానికి అవసరాల అభినయం ఇంప్రెస్ చేశాయి. సీరత్ కపూర్ కూడా తన గ్లామర్ లుక్ లో ఆకట్టుకుంది. సినిమాలో విలన్ గా నటించిన అరుణ్ కుమార్ పర్వాలేదు అనిపించుకున్నాడు. జయప్రకాశ్ కూడా సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 
మణిశర్మ మ్యూజిక్ పాటలకన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టాడు. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ కలరింగ్ స్క్రీన్ మీద అందంగా అనిపించింది. అబ్బూరి రవి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత విఐ ఆనంద్ చేసిన ఈ పార్లర్ లైఫ్ స్టోరీ సినిమా ఒక్క క్షణం ఆకట్టుకుంది. అయితే అనుకున్నంత అవుట్ పుట్ తీసుకురావడంలో విఫలమయ్యాడని చెప్పాలి. సినిమా అయితే ఆడియెన్స్ కు ఎంగేజ్ అయ్యేలా చేశాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ నెస్ తెచ్చిపెట్టాయి.
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా హిట్ తో మరో డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చాడు డైరక్టర్ విఐ ఆనంద్. సినిమా కథ, స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నాయి. అయితే లీడ్ కాస్టింగ్ ఇంకాస్త పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండేది. సినిమాను అవసరాల శ్రీనివాస్ నిలబెట్టాడని చెప్పొచ్చు. మొదటి భాగం సినిమా అంతా సాఫీగా సాగుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు ఎంగేజ్ చేయలేకపోయాడు.

కథ కథనాలన్ని నమ్మశక్యంగా ఉండవు. సినిమాకు విఐ ఆనంద్ బాగా వర్క్ అవుట్ చేసినట్టు అనిపించినా సరే ఎక్కడో తేడా కొడుతుందని అనిపిస్తుంది. చాలా లాజిక్ లేకుండా సన్నివేశాలు వస్తాయి. మొత్తానికి లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో అలరించిన అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాతో కూడా కొత్త కాన్సెప్ట్ తో వచ్చి అలరించాడు.

అయితే కథనంలో గ్రిప్పింగ్ గా అనిపించినా అక్కడక్కడ అసలు లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. ఫైనల్ సినిమా పాస్ అయినట్టే అనిపించినా ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నది మరికొద్ది క్షణాల్లో తెలుస్తుంది. 
Allu Sirish,Surbhi,Seerat Kapoor,VI Anand,Chakri Chigurupati,Mani Sharmaఅక్కడక్కడ ట్రాక్ తప్పినా శిరీష్ ఆకట్టుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: