కాస్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ప్రొడక్షన్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్ కాస్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ప్రొడక్షన్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్స్క్రీఎన్ ప్లే ,రొటీన్ కథ

తల్లి (సితార)తో కలిసి జీవనం సాగిస్తున్న విష్ణు (రాజ్ తరుణ్) తల్లికి తెలియకుండానే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కీర్తి (చిత్రా శుక్లా)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు విష్ణు. ఓ పక్క సితార విష్ణుకి పెళ్లిచేయాలని చూస్తుంది. ఈ క్రమంలో అతను కీర్తిని ప్రేమిస్తాడు. ఆమె కూడా విష్ణు ప్రేమకు ఓకే చేస్తుంది. అయితే కీర్తి అతి ప్రేమ వల్ల విష్ణు ఇబ్బంది పడుతుంటాడు. ప్రేమ విషయం తల్లికి తెలిసినా విష్ణుకి సపోర్ట్ చేస్తుంది. అయితే కీర్తి అతి ప్రేమ వల్ల విష్ణు ఆమెకు దూరం కావాలనుకుంటాడు. అసలు కీర్తి ఎందుకు అలా చేస్తుంది. ఆమె ప్రేమను విష్ణు ఎందుకు కాదంటాడు. మళ్లీ వాళ్లిద్దరు కలిశారా అన్నది అసలు కథ.

రాజ్ తరుణ్ ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ చిత్ర శుక్ల మంచి అభినయంతో మెప్పించింది. ఇక ప్రియదర్శి కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. సితార పాత్ర కూడా మంచిగా అలరించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

విజయ్ సినిమాటోగ్రఫీ బాగుంది.. శ్రీచరణ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. రొమాంటిక్ నంబర్స్ బాగా వచ్చాయి. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా శ్రీరంజని ఇంప్రెస్ చేసింది. లవ్ సీన్స్ లో నాచురల్ పర్ఫార్మెన్స్ రాబట్టడంలో మార్కులు కొట్టేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

కొన్ని కథలకు కథనం మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఈరోజు రిలీజ్ అయిన రంగుల రాట్నం సినిమా కూడ అదే పంథాలో వచ్చింది. లవ్ ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం బాగుంది. సినిమా అంతా సరదాగా సాగిపోయేలా చేశారు. మొదటి భాగం సరదాగా సాగగా.. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు తెలుస్తుంది. కథ కథనాల్లో దర్శకుడి ప్రతిభ ఆకట్టుకుంది.

సినిమా అంతా ఎంటర్టైన్ మోడ్ లో వెళ్లేలా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సినిమా ఎలా ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉంటే ఆడియెన్స్ కు నచ్చుతుందో సినిమా అదే విధంగా కొనసాగించేలా చూశారు. సినిమా లవ్ ఎమోషన్స్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చింది.


Raj Tarun,Chitra Shukla,Sree Ranjani,Nagarjuna Akkineni,Sricharan Pakalaలవ్ అండ్ ఎమోషన్స్ తో రంగులరాట్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: