రవితేజ, యాక్షన్ సీన్స్, బిజిఎం రవితేజ, యాక్షన్ సీన్స్, బిజిఎంరొటీన్ కథ, కథనం, మ్యూజిక్

పోలీస్ ఆఫీసర్ అయిన కార్తికేయ (రవితేజ) ఆ జాబ్ వదిలేసి పాండిచ్చేరిలో కార్తికేయ ఇండస్ట్రీస్ నడుపుతుంటాడు. తన కుటుంబంతో సరదాగా జీవిస్తున్న కార్తికేయ అక్కడ లోకల్ లీడర్ సెల్వం అడ్డు పడుతుంటాడు. కార్తికేయ లాలా (ఫ్రెడ్డీ దరువాలా)తో వైరం పెంచుకుంటాడు.


డ్యూటీ మానేసినా లక్ష్యం వైపు అడుగులేస్తుంటాడు. అసలు కార్తికేయ పోలీస్ జాబ్ ఎందుకు వదిలాడు..? మళ్లీ డ్యూటీలో కార్తికేయ ఏ లక్ష్యంతో చేరాడు..? అతని జీవితంలో పప్పు (రాశి ఖన్నా), దివ్య (సీరత్ కపూర్)ల పాత్రలు ఏంటి..?  అసలు కార్తికేయకు ఇర్ఫాన్ లాలాకు ఉన్న గొడవలేంటి అన్నది సినిమా కథ.  

రవితేజ ఎప్పటిలానే తన మార్క్ ఎనర్జీతో నటించారు. సినిమా మొత్తం తానే అంతా నడిపించాడు. ఇక రాశి ఖన్నా ఈ సినిమాలో హాట్ లుక్స్ లో కనిపించింది. సీరత్ కపూర్ కూడా అలరించింది. అయితే హీరోయిన్స్ ఇద్దరికి అంత బలమైన పాత్రలేమి ఇవ్వలేదు.


జయప్రకాశ్, సుహాసిని, మురళి శర్మ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ గా నటించిన ఫ్రెడ్డీ దారువాలా లుక్స్ ఓకే.. కాని అతన్ని దర్శకుడు సరిగా వాడుకోలేదని చెప్పాలి.

రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మంచి కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. ప్రియతం జాంబ్ 8 మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. కొద్దిగా  చెప్పాలంటే.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంది.


వక్కంతం వంశీ పాత చింతకాయ పచ్చడి లాంటి కథనే ఇచ్చాడు. డైరక్టర్ విక్రం సిరి కథనం లో ఏమాత్రం మ్యాజిక్ చూపించలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయ్.

సూపర్ హిట్ రైటర్ గా వక్కంతం వంశీ రాసిన కథతో రవితేజ హీరోగా వచ్చిన సినిమా టచ్ చేసి చూడు. సినిమాను విక్రం సిరి డైరెక్ట్ చేశారు. కథ కథనాల్లో ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ఓ రకంగా ఇలాంటి సినిమాలు తెలుగులో ఇప్పటికే చాలానే వచ్చాయి. కథ పాతదే అయినా కథనంలో కూడా ఆడియెన్స్ ను కనీసం లవ్ సీన్స్ లో కూడా ఎంగేజ్ అయ్యేలా చేయలేదు దర్శకుడు.


ఇది కచ్చితంగా దర్శకుడి వైఫల్యం అని చెప్పొచ్చు. మొదటి భాగం పాత్రల పరిచయంతోనే సరిపోతుంది. అంతేకాదు రవితేజ, రాశి ల లవ్ ఎపిసోడ్ కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్ మాస్ ఎలిమెంట్స్ ఎమోషన్స్ ఉన్నా అప్పటికే సినిమాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాస్ ఎలిమెంట్స్ తో రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చినా సినిమా ల్యాగ్ అవడం.. ఆడియెన్స్ కూడా ఊహించేల కథనం సాగడం అసహనం కలిగిస్తుంది.


సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా బాగా ఉంది. రవితేజ స్టైలిష్ లుక్ బాగుంది. అయితే మాస్ రాజా అభిమానులకు ఈ సినిమా నచ్చొచ్చేమో కాని సగటు సిని ప్రేక్షకుడు మాత్రం పెదవి విరిచే అవకాశం ఉంది.



Ravi Teja,Raashi Khanna,Seerat Kapoor,Vikram Sirikonda,Nallamalupu Bujji,Vallabhaneni Vamshi,Mohan,Pritam Chakraborty రవితేజ టచ్ చేసి చూడు.. ఫెయిల్యూర్ అటెంప్ట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: