నాగ శౌర్య, రష్మిక , సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ , కామెడీనాగ శౌర్య, రష్మిక , సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ , కామెడీకథ , లాజిక్ లేని సీన్స్

హరి (నాగ శౌర్య) చిన్నప్పటి నుండి గొడవల్లో తలదూర్చడం అంటే ఇష్టమున్న కుర్రాడు. ఇతని తిక్క కుదర్చాలని తిరుప్పురం ఊరిలో కాలేజ్ లో వేస్తారు అతని తల్లిదండ్రులు. ఆల్రెడీ ఒకే ఊరిని చీలికగా ఏర్పడి తెలుగు, తమిళ వాళ్లు గొడవల పడుతూ ఉంటారు. తెలుగు వాడిగా హరి తమిళ వాళ్ల వైపు అడుగుపెడితే జరిగే పరిణామాలే సినిమా కథ. ఇలాంటి పరిస్థితుల్లో హరి తమిళ అమ్మాయి కార్తిక (రష్మిక)ని ప్రేమిస్తాడు. అప్పటిదాకా ఉన్న గొడవ ఇంకాస్త పెద్దవుతుంది. ఫైనల్ గా హరి తన ప్రేమని గెలిపించుకున్నాడా..? రెండుగా విడిపోయిన తిరుప్పురం కూడా హీరో ఒకటి చేశాడా..? అన్నది అసలు కథ.

నాగ శౌర్య ఎప్పటిలానే తన ఈజ్ తో హరి పాత్రలో నటించాడు. అయితే ఇందులో కథ మొత్తం తన మీద నడిచేలా జాగ్రత్త పడ్డాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్ రష్మిక తెలుగులో మొదటి సినిమనే అయినా ఆకట్టుకుంది. నరేష్, ప్రగతి పాత్రలు అలరించాయి. వైవా హర్ష, సత్య, వెన్నెల కిశోర్, పోసాని, సుదర్శన్ పాత్రలు అలరించాయి. 

సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు వాడిన కలరింగ్ చాలా బాగుంది. ఇక మహరి స్వర సాగర్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్ష్ణగా నిలిచింది. సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. డైరక్టర్ వెంకీ కుడుముల కథ, కథనాలు గ్రిప్పింగ్ తో నడిపించాడు. కథలో అంత దమ్ము లేకున్నా సినిమా నడిపించిన తీరు ఇంప్రెస్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

తిరుప్పురం ఊరు.. ఆల్రెడీ గొడవలతో ఒకటిగా ఉన్న ఊరు రెండుగా చీలగా.. హీరో వచ్చి వారి మధ్య గొడవలు మరింత పెంచుతాడు. అయితే ఫైనల్ గా ఆ ఊరిని ఒకటి ఎలా చేశాడు అన్నది సినిమా కథ. కథ కొత్తగా అనిపించదు కాని కథనంలో ఆ ఫ్రెష్ నెస్ తెలుస్తుంది. నాగ శౌర్య ఈ కథను ఎంపిక చేసుకోవడంలో తన టేస్ట్ తెలుస్తుంది. 

కథ కథనాలు ఎక్కడ బోర్ కొట్టించలేదు. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నడిపించిన డైరక్టర్ సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ నెస్ యాడ్ చేశాడు. అయితే అది సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్న విధానం బట్టి ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా హ్యాపీ ఎండింగ్ చేసాడు.

కథలో బలం ఉన్నా సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గానే నడిపించి సేఫ్ సైడ్ నిలిచాడు డైరక్టర్. నాగ శౌర్య, రష్మిక పెయిర్ అలరించింది. అయితే లాజిక్స్ ఆలోచిస్తే మాత్రం కష్టమే.. యూత్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు వచ్చిన ఛలో ఆ విషయంలో లోటు లేకుండా చేసింది.
Naga Shaurya,Rashmika Mandanna,Venky Kudumula,Usha Mulpuri,Mahati Swara Sagarఛలోతో నాగ శౌర్య సత్తా చాటినట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: