మోహన్ బాబు, మ్యూజిక్, కెమెరా వర్క్మోహన్ బాబు, మ్యూజిక్, కెమెరా వర్క్స్క్రీన్ ప్లే , ఊహాజనితంగా ఉండే కథ, కథనాలు

శివాజి (మోహన్ బాబు) ఓ స్టేజ్ ఆర్టిస్ట్.. అనాథాశ్రమం నడిపించే అతను డబ్బు కోసం శిక్ష వేసిన పెద్దవాళ్ల బదులు జైలుకి వెళ్లొస్తుంటాడు. డబ్బు కోసం ఇలా చేసే శివాజి ఓసారి గాయత్రి పటేల్ (మోహన్ బాబు)కి బదులు జైలుకి వెళ్తాడు. అయితే గాయత్రి పటేల్ కు ఉరిశిక్ష పడుతుంది. అది తెలియని శివాజి అతని కోసం జైలు వెళ్తాడు. ఇక మరో పక్క చిన్నప్పుడే తప్పిపోయిన కూతురిని కలుసుకోవాలని అనుకుంటాడు శివాజి. ఈ క్రమంలో తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో అదే గాయత్రి సినిమా కథ.

శివాజి, గాయత్రి పటేల్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబు కొత్త ఎనర్జీతో ఎపాటిలానే నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా సినిమాలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ కు విజిల్స్ వేసేయొచ్చు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించారు. ఇక యంగ్ శివాజిగా మంచు విష్ణు ఆకట్టుకున్నాడు. శ్రీయ కూడా తక్కువ పాత్రే అయినా ఇంప్రెస్ చేసింది. నిఖిల్ విమల్ ఆకట్టుకోగా జర్నలిస్ట్ శ్రేష్టగా అనసూయ మార్కులు కొట్టేసింది.

మదన్ కథ, కథనాలు కొత్తగా అనిపిస్తాయి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ బాగుందు. తమన్ మ్యూజిక్ రెండు పాత్రలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే.. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సొంత సినిమా కాబట్టి రిచ్ గానే తీశారు. డైమండ్ రత్నం డైలాగ్స్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.
పెళ్లైన కొత్తలో హిట్ తర్వాత రెండు మూడు ప్రయత్నాలు చేసినా లాభం లేని మదన్ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తీసిన సినిమా గాయత్రి. కథ పరంగా కచ్చితంగా కొత్త పాయింట్ తీసుకున్నాడని చెప్పొచ్చు. అయితే కథనం కోసం ఇదో తల్లి కూతుళ్ల సెంటిమెంట్ గా తెరకెక్కించాడు. మొదటి భాగం పాత్రల పరిచయంతో కాస్త ల్యాగ్ అయినట్టు అనిపించగా సెకండ్ హాఫ్ లో పర్వాలేదు అనిపిస్తుంది.

గాయత్రి పటేల్ పాత్ర ఎంటర్ అయిన నాటి నుండి సినిమా వేరే లెవల్ కు వెళ్తుంది. క్లైమాక్స్ 40 నిమిషాలు బాగా వచ్చింది. కథలో ఆడియెన్స్ ను ఇన్వాల్వ్ అయ్యేలా మదన్ డైరక్షన్ ఉంది. అయితే సినిమా ఎంటర్టైనింగ్ అందించడంలో వెనుకపడ్డది. చాలా రోజుల తర్వాత మోహన్ బాబుని ఇంత పవర్ ఫుల్ రోల్ లో చూడటం ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది.

యూత్ ఆడిఉఎంస్ కూడా నచ్చే డైలాగ్స్ తో వచ్చింది గాయత్రి. సినిమా ఎక్కువగా ఫ్యామిలీ ఇష్టపడే అవకాశం ఉంది. డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అని మోహన్ బాబు మరోసారి చాటుకున్నారు.
Mohan Babu,Shriya Saran,Vishnu,R. R. Madan,Thaman SS.గాయత్రి.. కేవలం మోహన్ బాబు కోసమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: