నయనతార, క్లైమాక్స్, డైరక్షన్నయనతార, క్లైమాక్స్, డైరక్షన్మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్ , అక్కడక్కడ ల్యాగ్ అవడం
నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మధువర్షిణి (నయనతార) అక్కడ ప్రజలు నీటి సమస్యతో బాధపడుతుంటే వారి సమస్యను పరిష్కరించాలని అనుకుంటుంది. ఇక ఆ క్రమంలో ఓ చిన్న పాప ధన్సిక బోరు బావిలో పడుతుంది. ఆమెను కాపాడేందుకు స్వయంగా రంగంలో దిగిన కలెక్టర్ మధువర్షిణి ప్రభుత్వం పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుంది. అయితే చివరకు కలెక్టర్ ఏం చేసింది. ఆ పాపను కలెక్టర్ ప్రాణాలతో కాపాడగలిగిందా లేదా అన్నది సినిమా కథ.

కలెక్టర్ మధువర్షిణిగా నయనతార మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. లేడీ సూపర్ స్టార్ గా తమిళనాట లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార కర్తవ్యం సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించింది. ముఖ్యంగా కలెక్టర్ గా ఆమె అభినయం బాగుంది. ఇక సినిమాలో మిగతా పాత్రలన్ని అంత ప్రాముఖ్యత ఉన్నవి కాదు. చిన్నారి ధన్సిక కూడా బాగా చేసింది. అందరు తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు.

సినిమా టెక్నికల్ గా ఓ రేంజ్ లో కాకున్నా తీసుకున్న కథకు కావాల్సిన సాంకేతిక అందించారు. కెమెరా మన్ పనితనం బాగుంది. డైలాగ్స్ బాగా రాశారు. మ్యూజిక్ ఆడియెన్స్ సినిమా ఫీల్ క్యారీ చేసేలా ఉంది. డైరక్టర్ గోపి నెరైన్ సినిమా ఎలా అనుకున్నాడో అలా తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

కలెక్టర్ తన డ్యూటీని సక్రమంగా చేస్తే ఆ జిల్లా ఎలా ఉంటుంది అని చెప్పే కథ ఈ కర్తవ్యం. ముఖ్యంగా ఊళ్లల్లో ఉండే నీటి సమస్యతో పాటుగా బోరు బావిలో పడి పిల్లలు మరణిస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విషయాన్ని ఇందులో చూపించారు. సినిమా అంతా సీరియస్ సబ్జెక్ట్ తోనే నడుస్తుంది. అయితే స్క్రీన్ ప్లే నడిపించిన తీరు కొంత అసంతృప్తిగా ఉంటుంది.

ఓ పక్క అంతరిక్షంలోకి రాకెట్ పంపించే పరిజ్ఞాం చూపిస్తూ మరో పక్క బోరు బావిలో ఉన్న పిల్లల్ని కాపాడలేని అసమర్ధత ఉందంటూ చూపించారు. ఇక సబ్జెక్ట్ కు అనవసరమైన విషయాల జోలికి వెళ్లలేదు. ఇక సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అన్న విషయం మీద కూడా ఇందులో పంచ్ వేశారు. 

సినిమాలో క్లైమాక్స్ కు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా డైరక్టర్ తన ప్రతిభ చూపించాడు. సినిమా చూడాలని వెళ్లిన ప్రతి ఒక్కరు మంచి అనుభూతితో వస్తారు. అయితే యూత్, బి, సి ప్రేక్షకులు ఎక్కకపోవచ్చు.
Nayanthara,Gopi Nainar,Kotapadi J Rajesh,Ghibranనయనతార కర్తవ్యం ఆలోచింపచేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: