నిఖిల్ , కాలేజ్ లో కొన్ని సీన్స్, క్లైమాక్స్నిఖిల్ , కాలేజ్ లో కొన్ని సీన్స్, క్లైమాక్స్రొటీన్ కథ , సాగదీసిన కథనం
ఇంజినీరింగ్ జాయిన్ అయిన కృష్ణ (నిఖిల్) సరదాగా గడుపుతుంటాడు. ఫ్రెండ్స్ తో బిటెక్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అతను ఫోర్త్ ఇయర్ చదువుతున్న మీరా  (సిమ్రాన్) ను చూసి ఇష్టపడతాడు. మీరా కూడా రెగ్యులర్ కృష్ణ యాక్టివిటీస్ నచ్చకపోయినా ఓ సహాయం చేయడంతో అతని మీద ప్రేమ పుడుతుంది. ఇంతలోనే మీరా కృష్ణని వదిలి శాస్వతంగా దూరం అవుతుంది. ఇక అప్పటిదాకా కూల్ గా ఉండే కృష్ణ గెడ్డం పెంచుకుని రఫ్ గా తయారవుతాడు. ఆ తర్వాత అతని లైఫ్ లోకి సత్య (సంయుక్త హెగ్దె) వస్తుంది. కృష్ణని అమితంగా ఇష్టపడే సత్య అతన్ని మాములు మనిషిగా మార్చా లని ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ మీరా ఎలా దూరమైంది..? కృష్ణ ఎలా మారాడు..? సత్య లవ్ ని కృష్ణ యాక్సెప్ట్ చేశాడా అన్నది అసలు కథ. 

నిఖిల్ సాఫ్ట్, రఫ్ ఇలా రెండు పాత్రల్లో కనిపించాడు. సినిమా మొత్తం నిఖిల్ తన భుజాన వేసుకుని నడిపించాడు. హీరోయిన్స్ ఇద్దరు బాగానే చేశారు. ఫ్రెండ్స్ పాత్రలు కూడా అలరించాయి. శియాజి షిండే ఒక్క సీన్ లోనె మెరిసాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి. 

అద్వైత్ గురుమూర్తీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా అంతా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ పర్వాలేదు. రెండు సాంగ్స్ బాగా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరిస్తుంది. ఇక చందు మొండేటి డైలాగ్స్, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే ఓకే.. శరణ్ డైరక్షన్ కూడా పర్వాలేదు. అయితే ఇలాంటి  సినిమాలు తెలుగులో ఆల్రెడీ వచ్చాయన్న భావన కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

కన్నడలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ రీమేక్ గా వచ్చిన ఈ కిరాక్ పార్టీ.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ కు హ్యాపీడేస్ గుర్తుకురాక మానదు. కన్నడ ప్రేక్షకులకు ఇది కొత్త కథ కావొచ్చేమో కాని తెలుగులో ఆల్రెడీ బీ టెక్ బ్యాగ్రౌండ్ కథలు చాలానే వచ్చాయి. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త ఫన్ ఫిల్డ్ గా నడుస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ రొటీన్ గా సాగినా సరే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. హీరో, హీరోయిన్స్, స్నేహితుల గ్యాంగ్ ఇలా అందరిని కొత్తగా ట్రై చేసి చూపించారు. లవ్ స్టోరీగా మొదటి భాగం.. సెకండ్ హాఫ్ పెయిన్ ఫుల్ తీసుకెళ్లాలని అనుకున్నారు కాని అది వర్క్ అవుట్ కాలేదు. సినిమాకు ఇద్దరు ప్రముఖ దర్శకులు చందు మొండేటి డైలాగ్స్, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అంతగా వర్క్ అవుట్ కాలేదు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కేవలం వారిని బేస్ చేసుకునే కథ కథనాలు సాగించారు. బి, సి సెంటర్స్ లో మాస్ కమర్షియల్ సినిమాలు నచ్చే ప్రేక్షకులు పెదవివిరిచే అవకాశం ఉంది.
Nikhil Siddharth,Simran Pareenja,Samyuktha Hegde,Sharan Koppisetty,Ramabrahmam Sunkara,B. Ajaneesh Loknathకిరాక్ పార్టీ థ్రిల్ కలిగించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: