రాం చరణ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్రాం చరణ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్సెకండ్ హాఫ్ ల్యాగ్ అవడం, రన్ టైం, ఊహించే కథనం
రంగస్థలంలో చిట్టిబాబు (రాం చరణ్) తనకున్న చెవిటి తనం కూడా లెక్క చేయకుండా ఊళ్లో పొలాలకు ఇంజిన్ పెడుతుంటాడు. అయితే ఊరిలో 30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా చెలామణి అవుతున్న మహేంద్ర భూపతి (జగపతి బాబు) ఊరి ప్రజలకు అన్యాయం చేస్తూ సొసైటీ పేరు మీద తప్పులు చేయిస్తుంటాడు. ఎదురుతిరిగిన వారిని చంపేస్తూ వస్తున్న ప్రెసిడెంట్ కు ఎదురుగా నిలబడతాడు చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి). నవ భారత్ పార్టీ ఎం.ఎల్.ఏ ప్రకాష్ రాజ్ సపోర్ట్ తో ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తాడు. తనకు ఎదురువచ్చిన వారిని అడ్డు తొలగించుకునే ప్రెసిడెంట్ కుమార్ బాబు అడ్డు తొలగించుకుంటాడు. ఇంతకీ కుమార్ బాబుని చంపింది ఎవరు..? అన్న మీద ప్రేమతో చిట్టిబాబు ఏం చేశాడు..? సినిమా కథ ఎలా ముసింది అన్నది తెర మీద చూడాల్సిందే.

రాం చరణ్ చిట్టిబాబుగా నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. పాత్రలో చరణ్ చక్కగా ఒదిగిపోయాడు. చరణ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమా మొదటి నుండి చివరి వరకు చిట్టిబాబు వన్ మ్యాన్ షో చేశాడు. ఇక రామలక్ష్మిగా సమంత సహజ నటనతో ఆకట్టుకుంది. ఇక కుమార్ బాబుగా ఆది మెప్పించాడు. ఇక జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో ఎప్పటిలానే అదరగొట్టగా.. ప్రకాశ్ రాజ్ పాత్ర చిన్నదే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేశాడు. యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఎక్కువ పాత్రే చేసింది. రంగమ్మత్తగా అనసూయ కూడా అదరగొట్టింది. ఇక నరేష్, రోహిణి సహజ నటనతో ఆకట్టుకున్నారు. 

సినిమా టెక్నికల్ గా చాలా వర్కవుట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆ కష్టం ప్రతి ఫ్రేం లో కనబడుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ పల్లెటూరి వాతావరణాన్ని అద్దం పట్టింది. ఇక దేవి మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. సుకుమార్ డైరక్షన్ బాగుంది. కథ, కథనాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. అయితే రన్ టైం విషయంలోనే కాస్త ట్రిం చేయాల్సి ఉంది. ఎడిటింగ్ ఒక్కటే కాస్త అటు ఇటుగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవలేదని తెలుస్తుంది.
30 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా రంగస్థలం ను పరిపాలించే మహేంద్ర భూపతి తనకు అడ్డొచ్చిన వారినల్లా అడ్డు తొలగిస్తూ.. సొసైటీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. ఇక చిట్టిబాబు అతని సోదరుడు ప్రెసిడెంట్ కు పోటీగా నిలబడగా చిట్టిబాబు సోదరుడిన్ చంపేస్తారు. అయితే అది తెలిసి ఆ వెనుక ఉన్న వారి పని పడతాడు చిట్టిబాబు.

సుకుమార్ ఎంచుకున్నా కథ కొత్తగా లేకున్నా సరే హీరోకి చెవిటితనం పెట్టి కాస్త స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేశాడు. కథ కన్నా కథనం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా 1980 నాటి పరిస్థితులను బాగా చూపించారు. మొదటి భాగం అంతా ఎక్సైటింగ్ గా సాగగా.. సెకండ్ హాఫ్ కాస్త సాగినట్టు అనిపిస్తుంది. సుకుమార్ సినిమా రన్ టైం బెదడ తెలిసిందే. 

ఈ సినిమా కూడా 179 నిమిషాల రన్ టైం ఉంది. అయితే సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు. ముఖ్యంగా చిట్టిబాబు పాత్ర తీరుతెన్నులు.. రాం చరణ్ నటన సినిమాకే హైలెట్. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రంగస్థలం మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే సినిమాగా వచ్చింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా రాం చరణ్ నటనకు ముగ్ధులవ్వడం ఖాయం.
Ram Charan,Samantha,Aadhi Pinisetty,Sukumar,Naveen Yerneni,Y Ravi Shankar,Mohan Cherukuri,Devi Sri Prasadరంగస్థలం.. నటుడిగా రాం చరణ్ విశ్వరూపం..!

మరింత సమాచారం తెలుసుకోండి: