కళ్యాణ్ రాం ,ఎంటర్టైన్మెంట్ ,ప్రొడక్షన్ వాల్యూస్కళ్యాణ్ రాం ,ఎంటర్టైన్మెంట్ ,ప్రొడక్షన్ వాల్యూస్రొటీన్ స్టోరీ , స్క్రీన్ ప్లే
సరదా జీవితం గడుపుతున్న కళ్యాణ్ (కళ్యాణ్ రాం) బావతో బెంగళూరు వెళ్లి అక్కడ ఇందు (కాజల్) ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ కు ఇందు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుస్తుంది. ఈ టైంలో కళ్యాణ్ ఎం.ఎల్.ఏగా మారాలని నిర్ణయించుకుంటాడు. గాడప్ప (రవికిషన్)కు పోటీగా రంగంలో దిగాలని అనుకుంటాడు కళ్యాణ్. ఇంతకీ అసలు ఇందు ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? కళ్యాణ్ ఎందుకు ఎం.ఎల్.ఏ గా మారాలనుకుంటాడు..? చివరకు అతను ఎం.ఎల్.ఏ అయ్యాడా అన్నది సినిమా కథ.

కళ్యాణ్ రాం ఎప్పటిలానే తన ఈజ్ తో సినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో కాస్త కామెడీ టైమింగ్ కూడా ట్రై చేశాడు కళ్యాణ్ రాం. ఇక ఇందుగా కాజల్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. అందం, అభినయం కలిసి కాజల్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక రవి కిషన్ విలనిజం బాగుంది. వెన్నెల కిశోర్, పోసని కృష్ణ్ మురళి, పృధ్వి రాజ్ కామెడీ అలరించింది. 

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చింది. కెమెరా మెన్ పనితనం బాగుంది. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తాయి. మణిశర్మ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. వేణు ఊడుగుల కథ కథనం డైరక్షన్ అంతా సినిమా ఫన్ ఫుల్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. అయితే రొటీన్ కథ అనిపిస్తుంది. కమర్షియల్ అంశాలు బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఓకే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో సినిమా రిచ్ గా ఉంటుంది.

కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ వేణు ఊడుగుల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అయితే సినిమా అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. కళ్యాణ్ రాం కు పటాస్ సినిమా ఛాయలు కనిపిస్తాయి. అందులో పోలీస్ గా విలన్ల పని పడితే.. ఇందులో పొలిటిషియన్ గా మారేందుకు విలన్ల ఆట కట్టిస్తాడు.

మొదటి భాగం అంతా ఎంటర్టైనింగ్ గా సాగగా.. సెకండ్ హాఫ్ సీరియస్ గా నడుస్తుంది. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు కొత్త సినిమా చూసిన భావన కలుగదు. రొటీన్ కథే అయినా దర్శకుడి ప్రతిభ మెచ్చుకోవచ్చు. కళ్యాణ్ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తో సేఫ్ గేం ఆడేయొచ్చని నిరూపించుకున్నాడు.

యూత్ ఫుల్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంది. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది.
Nandamuri Kalyan Ram,Kajal Aggarwal,Upendra Madhav,Kiran Reddy,Bharath Chowdary,Mani Sharmaఎం.ఎల్.ఏ.. కళ్యాణ్ రాం మార్క్ రొటీన్ కమర్షియల్ మూవీ..!

మరింత సమాచారం తెలుసుకోండి: