స్టోరీ, స్క్రీన్ ప్లే, శ్రీవిష్ణు ,ఎమోషనల్ సీన్స్స్టోరీ, స్క్రీన్ ప్లే, శ్రీవిష్ణు ,ఎమోషనల్ సీన్స్అక్కడక్కడ స్లో అవడం

ఉత్తమ ఉపాధ్యాయుడైన రుద్రరాజు దేవి ప్రసాద్ (దేవి ప్రసాద్) తనయుడైన సాగర్ చదువంటే అంత ఆసక్తి కనబరచడు. డిగ్రీ పాస్ అవ్వడానికి నానా తంటాలు పడే సాగర్ తండ్రిని మెప్పించే ప్రయత్నం చేస్తాడు. జీవితంలో పైకి రావడం కోసం వ్యక్తిత్వ వికాసం బుక్స్ చదువుతుంటాడు. ఇలా తండ్రి కొడుల మధ్య సాగే కథే ఈ సినిమా. ఫైనల్ గా సాగర్ తండ్రిని మెప్పించాడా..? వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలే నీదీ నాదీ ఒకే కథ సినిమా.

శ్రీవిష్ణు హీరోగా సాగర్ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సినిమా చూస్తున్నత సేపు ఆ పాత్రలో అతన్ని కాకుండా వేరొకరిని ఊహించుకోలేం. అంతగా ఒదిగిపోయాడు. ఇక పత్న టిటస్ కూడా మంచి పాత్రలోనే నటించింది. ఇక సినిమాలో తండ్రి పాత్ర చేసిన ఒకప్పటి దర్శకుడు దేవి ప్రసాద్ కూడా హీరోకి సమానమైన రోల్ చేశాడు. అతను కూడా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు తగినట్టుగా ఉంటుంది. సాహిత్యం కూడా అందుకు సహకరిస్తుంది. రాజ్ తోడ, పర్వాజ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. అయితే అక్కడక్క కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక మొదటి సినిమానే అయినా దర్శకుడుతీసుకున్న పాయింట్ అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా చక్కగా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టేశారు.

నీదీ నాదీ ఒకే కథ. టీజర్ వచ్చినప్పుడే మళ్లీ శ్రీవిష్ణు కొత్త కథతో వస్తున్నాడని అనుకున్నారు. ఇక ట్రైలర్ చూశాక ఆ భావన మరింత బలపడింది. సినిమా అంతా ఓ చదువంటే ఆసక్తి లేని వ్యక్తి జీవితంలో ఎలా పైకి రావలన్న కథతో నడుస్తుంది. చిన్నప్పటి నుండి కష్టపడి మంచి జాబ్ వచ్చాక సుఖ పడొచ్చు అన్న కాన్సెప్ట్ ను కళ్లకు కట్టినట్టు చూపించారు.

సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా.. మన పక్కన జరిగే వ్యక్తి కథగా.. మన కథగా అనిపిస్తుంది. అలా స్క్రీన్ ప్రెజెన్స్ రావడంలో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాలి. అక్కడక్కడ కొన్ని కమర్షియల్ అంశాలను టచ్ చేసినా సినిమా మెయిన్ కంటెంట్ బాగా రాసుకున్నాడు. ఆర్టిస్టు పర్ఫార్మెన్స్, బేస్ లైన్ మీదే సినిమా అంతా నడిపించడం సినిమాకు బలాలని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా అంతా ఎమోషనల్ గా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.   

మొదటి భాగం స్పీడ్ గా లాగించేసినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పటికి 121 నిమిషాల డ్యూరేషన్ సినిమాకు కలిసి వచ్చే అంశమే. నేటి యువత ఆలోచించే విధానాలకు దగ్గరగా ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా యూత్ ఎంటర్టైనర్ గా అవుతుందనడంలో సందేహం లేదు.
Sree Vishnu,Satna Titus,Venu Udugula,Prashanthi,Krishna Vijay,Sureshనీదీ నాదీ ఒకే కథ.. మనసుని కదిలించే కథే..!

మరింత సమాచారం తెలుసుకోండి: