లీడ్ పెయిర్ , సినిమాటోగ్రఫీ , లొకేషన్స్ ,ప్రొడక్షన్ వాల్యూస్లీడ్ పెయిర్ , సినిమాటోగ్రఫీ , లొకేషన్స్ ,ప్రొడక్షన్ వాల్యూస్రొటీన్ స్టోరీ, ఊహించే కథనం, అక్కడక్కడ బోర్ కొట్టడం

మోహన్ రంగ (నితిన్) జీవితం మీద ఎలాంటి ఆందోళన లేక జాలీగా తిరిగే కుర్రాడు. తన చిన్న నాటి స్నేహితురాలు అమెరికా వెళ్లిందని తెలుసుకుని అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తల్లిదండ్రులు కూడా మోహన్ రంగని మార్చలేరు. ఎలాగోలా యూఎస్ వెళ్లిన నితిన్ అక్కడ మేఘా (మేఘా ఆకాష్)తో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు కలిసి ప్రయాణం చేయడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఇద్దరు ప్రపోజ్ చేసుకోరు ఇంతలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. ఇంతకీ మోహన్ రంగ, మేఘా ఎందుకు విడిపోయారు..? వారిద్దరి మళ్లీ దగ్గరయ్యారా..? అసలు కథ ఏంటన్నది తెర మీద చూడాల్సిందే.

నితిన్ మిగతా సినిమాల కన్నా ఈ సినిమాలో మంచి ఈజ్ తో నటించాడు. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా మెప్పించింది. సినిమాలో మధునందన్, సత్య కామెడీ బాగుంది. రావు రమేష్, నరేష్ ల పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇక మిగతా వారంతా కూడా పరిధి మేరకు నటించారు.

యూఎస్ లో నటరాజ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. ఇక తమన్ మ్యూజిక్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. త్రివిక్రం కథ రొటీన్ గానే అనిపిస్తుంది. కృష్ణ చైతన్య కథనం, దర్శకత్వం కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. అయితే కథనంలో కూడా పెద్దగా ట్విస్టులేమి లేకుండా కాజువల్ గా లాగించేశారు. ఎడిటింగ్ ఓకే అనేలా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.

ఏదో ఒక గోల్ తో అమెరికా వెళ్లడం.. అక్కడ హీరోయిన్ ను చూసి హీరో ఫ్లాట్ అవడం. ఇద్దరు ప్రేమించుకున్నా ఒకరికొకరు  బయటకు చెప్పుకోకుండా ఉంటారు. చివరి దాకా ఈ తర్జన భర్జన ఫైనల్ గా ఇద్దరు ఓపెన్ అవుతారు. మధ్యలో ట్విస్ట్ ఈ ఇద్దరు చిన్నప్పుడు తెలిసిన వాళ్లే. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. వస్తున్నాయి.  

కథ పాతదే అయినా కథనంలో కాస్త ఫన్ యాడ్ చేసి మధ్యలో త్రివిక్రం మార్క్ డైలాగ్స్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా చేశారు. నితిన్, మేఘా ఆకాష్ ల స్క్రీన్ ప్రెజెన్స్ జోడి కుదిరినట్టు అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకునే అంశాలు ఏమి లేవు. లొకేషన్స్ మాత్రం బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా టచ్ అవుతుంది.

క్లైమాక్స్ యూత్ ఆడియెన్స్ కు నచ్చేస్తుంది. సినిమా అంతా రొటీన్ గా అనిపించినా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలున్నాయి. ఫ్యామిలీ తో వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు.
Nithiin,Megha Akash,Krishna Chaitanya,Trivikram,Pawan Kalyan,Thaman Sఛల్ మోహన్ రంగ.. రొటీన్ గానే వచ్చేశాడండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: