నాని పర్ఫార్మెన్స్ , సినిమాటోగ్రఫీ , నిర్మాణ విలువలునాని పర్ఫార్మెన్స్ , సినిమాటోగ్రఫీ , నిర్మాణ విలువలుఆకట్టుకోలేని కథ, కథనం , ఎడిటింగ్ , రొటీన్ కామెడీ

చిత్తూరులో ఉండే కృష్ణ (నాని) సరదా జీవితం గడుపుతుంటాడు. అతను రియా(రుక్సర్ మిర్) ను చూసి ఇష్టపడతాడు. ఇక మరో పక్క ప్రాగ్ లో రాక్ స్టార్ అయిన అర్జున్ (నాని) ప్లే బోయ్ గా అమ్మాయిలతో ఆడుకుంటాడు. ఫైనల్ గా సుబ్బలక్ష్మి (అనుపమ)కు కనెక్ట్ అవుతాడు. సడెన్ గా రియా, సుబ్బలక్ష్ము ఇద్దరు కనబడకుండా మిస్ అవుతారు. ఈ ఇద్దరికి ఏంటి సంబంధం. కృష్ణా, అర్జున్ ఎలా కలుసుకున్నారు అన్నదే సినిమా కథ.

నాని రెండు పాత్రల్లో అదరగొట్టాడు. కృష్ణ పాత్రలో చిత్తూరు యాసతో అలరించగా అర్జున్ గా పోష్ లుక్ లో కనిపించాడు. అనుపమ రోల్ అంతగా ఆకట్టుకోలేదు. రుక్సర్ మిర్ అలరించింది. ఫన్ బకెట్ మహేష్ విట్టా మంచి రోల్ చేశాడు. బ్రహ్మాజి కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రాగ్ లో లొకేషన్స్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. చిత్తూరు యాస్ డైలాగ్స్ బాగా రాసుకున్నారు. హిప్ హాప్ తమిజ మ్యూజిక్ బాగుంది. మేర్లపాక గాంధి డైరక్షన్ ఓకే. కథ, కథనాలు కాస్త రొటీన్ గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఎక్స్ ప్రెస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధి నానితో చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణ, అర్జున్ పాత్రలలో ఆకట్టుకున్నాడు. అయితే సినిమా కథ అంతగా బలంగా లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఇక కథనం కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా సెకండ్ హాఫ్ రొటీన్ గా నడిపించాడు దర్శకుడు.

నాని మాస్ హీరోగా ప్రమోట్ చేసేందుకు చేసే ప్రయత్నం గా అనిపిస్తున్నా సినిమా అంతా ఊహించే విధంగా కథ, కథనాలు సాగుతాయి. అయితే సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకురాగలిగాడు. నాని రొటీన్ క్యారక్టరైజేషన్ కు కాస్త భిన్నంగా ఉన్నా కథనం రొటీన్ గానే అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ అయితే ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. వీక్ విలన్ కూడా సినిమాకు పెద్ద మైనస్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఏదో అలా సాగాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నాని మంచి మార్కులే కొట్టేశాడు.
Nani,Anupama Parameswaran,Rukshar Dhillon,Merlapaka Gandhi,Sahu Garapati,Harish Peddi,Hiphop Tamizhaనాని కృష్ణార్జున యుద్ధం.. ఆశించినంత లేదు కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: