లీడ్ కాస్ట్ ,సినిమాటోగ్రఫీ ,క్లైమాక్స్లీడ్ కాస్ట్ ,సినిమాటోగ్రఫీ ,క్లైమాక్స్మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, అక్కడక్కడ స్లో అవడం

కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) కాలేజ్ డేస్ లో ప్రేమించుకుంటారు. పెళ్లికి ముందే తొందరపడిన ఈ ఇద్దరు వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నామని తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఈ విషయం అటు ఇటు పేరెంట్స్ కు తెలిసి ఇద్దరిని విడదీస్తారు. కడుపులో ఉన్న పాపని అబార్షన్ ద్వారా తీసేస్తారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ కృష్ణ, తులసి పెళ్లి చేసుకుంటారు. అయితే తులసి కడుపులో తీసివేయబడిన పాప ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది. తనని పిండ దశలోనే చంపేసిన వారి మీద పగ తీర్చుకుంటుంది. ఈ క్రమంలో కృష్ణ మీద కూడా ఆత్మ కక్ష్య కడుతుంది. మరి ఆత్మ నుండి తులసి తన భర్తని కాపాడిందా లేదా అన్నదే సినిమా కథ.

ఇన్నాళ్లు లవర్ బోయ్ గా చేసిన నాగ శౌర్య కెరియర్ లో మొదటి సారి వెయిట్ ఉన్న రోల్ చేశాడు. అయితే సినిమాలో ఫోకస్ అంతా సాయి పల్లవి మీదే ఉంటుంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఇక ఫిదా తర్వాత సాయి పల్లవి మళ్లీ అంతట్ ప్రతిభ చూపించిన సినిమా కణం అని చెప్పొచ్చు. చిన్న పాపతో సాయి పల్లవి నటన బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా ఇంప్రెస్ చేసింది. ఇక దియా నటన కూడా ఆకట్టుకుంది. ప్రియదర్శి చిన్న పాత్రలో అయినా మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సినిమా కెమెరా వర్క్ బాగుంది ప్రతి సీన్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా అర్ధవంతంగా తీశారు. మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. దర్శకుడు విజయ్ భ్రూణహత్యల మీద ఈ కథ రాసుకున్నాడని చెప్పొచ్చు. కథ, కథనాల్లో థ్రిల్లింగ్ అంశాలను మేళవించి అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రొడక్ష వాల్యూస్ కూడా సినిమాకు తగినట్టుగా బాగున్నాయి.



భ్రూణ హత్యల మీద మంచి ఆలోచనతో విజయ్ ఈ కథ రాసుకున్నాడని చెప్పొచ్చు. సినిమా అంతా రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలను సినిమాలను మెచ్చే ప్రేక్షకులు ఉన్నారు. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను సినిమాగా చెప్పదల్చుకోవడం మంచి విషయం.

అందులో పిండ దశలోనే హత్యలకు పాల్పడుతున్న వారికి ఈ సినిమా ఓ పాఠం అవుతుంది. ఆత్మ కథలనగానే అవి రాగానే అరుపులు కేకలు ఇలా కాకుండా ఈ సినిమా ఎమోషన్, సెంటిమెంట్ తో తీయడం జరిగింది. సినిమాకు కనెక్ట్ అయిన ఆడియెన్ తప్పకుండా ఎంజాయ్ చేసేలా కథనం ఉంది.

లేని పోని కమర్షియల్ ఎలిమెంట్స్ ను చొప్పించకుండా సినిమా చాలా నీట్ గా తీయగలిగారు. విజయ్ తన మార్క్ చూపించే సినిమాగా ఈ కణం వచ్చింది. సినిమా రన్ టైం కూడా కలిసివచ్చే అంశమే. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైఎల్ట్ గా నిలుస్తాయి.


Sai Pallavi,Naga Shaurya,AL Vijay,Allirajah Subaskaran,Sam CSకణం.. ప్రతి ఒక్కరిని కదిలించే సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: