అల్లు అర్జున్, కొన్ని డైలాగ్స్ , యాక్షన్ సీన్స్అల్లు అర్జున్, కొన్ని డైలాగ్స్ , యాక్షన్ సీన్స్సెకండ్ హాఫ్ ల్యాగ్ అవడం, కథనం , మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ఆర్మీ ఆఫీసర్ అయిన సూర్య (అల్లు అర్జున్) కోపం వస్తే చాలు ఏమాత్రం ఆలోచించకుండా గొడవకు దిగుతాడు. ఈ టైంలో ఆర్మీ కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్ట్ ను పర్మిషన్ లేకుండా షూట్ చేస్తాడు. మేజర్ పర్మిషన్ లేని కారణం చేత అతను మారితే కాని మళ్లీ డ్యూటీలో చేరే ఛాన్స్ ఇవ్వరని చెబుతారు. అయితే ఈ క్రమంలో అతనో సైకాలజిస్ట్ దగ్గరకు పంపిస్తారు. ఆ సైకాలజిస్ట్ సైన్ చేస్తేనే మళ్లీ అతన్ని జాయిన్ చేయించుకుంటామని అన్నారు.

రామకృష్ణ రాజు (అర్జున్) తన తండ్రే అయినా చిన్న వయసులోనే ఇంటి నుండి దూరంగా వెళ్లిన సూర్య అతన్ని కేవలం ఓ బయటవ్యక్తిగానే చూస్తాడు. ఇక అప్పటివరకు బోర్డర్ వెళ్లి కాపలా ఉండాలనుకున్న సూర్య వైజాగ్ లో చల్ల వల్ల ఇబ్బంది పడుతున్న ఓ సోల్జర్ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఇంతకీ చల్లా ఎవరు..? సోల్జర్ గా సూర్యా ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు..? అతని తండ్రికి సూర్య దగ్గరయ్యాడా అన్నది సినిమా కథ.

సూర్య పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. సనికుడిగా బన్ని పడిన కష్టం తెర మీద కనబడుతుంది. డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ వీటన్నిటిలో బన్ని వన్ మ్యాన్ షో చేశాడు. అను ఎమ్మాన్యుయెల్ కేవలం పాటలకే అన్నట్టు ఉంది. అర్జున్ పాత్ర బాగుంది. సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్, శరత్ కుమార్, సాయి కుమార్ అందరు బాగానే చేశారు. నదియా చిన్న పాత్రకే పరిమితం అయ్యింది.

రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు తగినట్టుగా మంచి లొకేషన్స్, దానికి తగిన కెమెరా పనితనం చూపించారు. విశాల్ శేఖర్ మ్యూజిక్ రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరక్టర్ వక్కంతం వంశీ కంటెంట్ బాగుంది. అయితే దాన్ని తెరకెక్కించే విధానంలో అంత గ్రిప్పింగ్ గా రాసుకోలేదు. 

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. రచయితగా వక్కంతం వంశీ గొప్ప కథనే రాసుకున్నాడు. ముఖ్యంగా టెర్రరిస్ట్ గా యువకులు ఎలా మారుతున్నారు అన్న పాయింట్ మీద నడిచిన క్లైమాక్స్ సీన్ బాగుంది. అయితే సినిమా మొదట ఓపెనింగ్ హీరో క్యారక్టరైజేషన్ అంతా బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చే సరికి సినిమా ఎందుకో ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. 

ఇక హీరో హీరోయిన్ కేవలం రొమాన్స్, సాంగ్స్ కు అన్నట్టే ఉంది. సాంగ్స్ ఓకే లవర్ ఆల్సో, ఇల్లే ఇండియా దిల్లే ఇండియా సాంగ్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సైటింగ్ గా సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ మీద అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. సూర్య పాత్రలో బన్ని మంచి పర్ఫార్మెన్స్ అందించాడు.

గొప్ప కథ చెప్పే ప్రయత్నంలో స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మంచి ఎమోషన్, ఫైట్స్ ప్లాన్ చేసినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త వీక్ అయినట్టుగా ఉన్నాయి. సినిమాకు కనెక్ట్ అయిన వారికి నచ్చే అవకాశం ఉన్నా రెగ్యులర్ ఆడియెన్స్ కు నచ్చే అవకాశం ఉండదు.
Allu Arjun,Anu Emmanuel,Arjun Sarja,Vakkantham Vamsi,Sridhar Lagadapati,Bunny Vasu,Sushil Choudhary,K. Nagendra Babu,Vishal-Shekharనా పేరు సూర్య.. బన్ని ఓకే.. కాని..!

మరింత సమాచారం తెలుసుకోండి: