కీర్తి సురేష్ నటన, కథనం, డైరక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీకీర్తి సురేష్ నటన, కథనం, డైరక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీఅక్కడక్కడ స్లో అవడం, ఎడిటింగ్
తనకు ఏ పనైనా రాదు అంటే చేసి చూపించే పట్టుదల ఉన్న సావిత్రి (కీర్తి సురేష్) నాటికలను వేస్తూ సినిమా రంగంవైపు ఎలా వెళ్లింది. ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సహ నటుడు జెమిని గణేషన్ (దుల్కర్ సల్మాన్) తో రిలేషన్ ఎలా ఏర్పడింది. ఆ తర్వాత ఎలాంటి కష్టాల్లో పడ్డది. చివరకు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది.. సావిత్రి కథనే మహానటిగా ఆవిష్కరించారు. ఆమె కథను కవర్ చేస్తూ జర్నలిస్ట్ వాణి (సమంత) కనిపించారు.
మహానటి సావిత్రి ఆమె పాత్రలో అభినయించాలంటే గట్స్ కావాలి దాన్ని నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది కీర్తి సురేష్. సావిత్రమ్మగా కీర్తి సురేష్ నటనకు అవార్డ్ రావడం గ్యారెంటీ అన్నట్టుగా నటించింది. ఇక మధురవాణిగా సమంత ఎప్పాటిలానే బాగానే నటించింది. ఆంటోనిగా విజయ్ దేవరకొండ ఓకే. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరు బాగా చేశారు.
మిక్కి జే మేయర్ మ్యూజిక్ బాగుంది. టైటిల్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక సినిమాకు కెమెరా వర్క్ బాగుంది. ఫిల్మ్, డిజిటల్ ఫార్మెట్స్ లో సినిమా తెరకెక్కించడం విశేషం. సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ గా అన్ని అంశాలను చాలా క్లియర్ గా క్లవర్ గా చూపించారు. సినిమా టెక్నికల్ గా కూడా ఎలాంటి బోర్ లేకుండా ప్రతిభ చాటాడు. ఇక స్వప్న దత్, ప్రియాంకా దత్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 
తెలిసిన కథను సినిమాగా చెప్పే క్రమంలో కొన్ని తప్పులు దొర్లుతాయి కాని సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటిలో వేలెత్తి చూపించేందుకు ఎలాంటి తప్పు లేదు. దర్శకుడు చాలా రీసెర్చ్ చేసి మరి తెరకెక్కించారు. ప్రతి అంశాన్ని చాలా కూలంకశంగా చూపించారు. మహానటి జీవితంలోని ప్రతి అంశాన్ని టచ్ చేశారు.

ఆమె నటిగా గొప్ప స్థాయికి వేళ్లిన సీన్స్ తో పాటుగా తాగుడికి బానిసగా మారిన సన్నివేశాలను మనసుకి హత్తుకునేలా చేశారు. సావిత్రి బయోపిక్ అనగానే ఇదేదో డాక్యుమెంటరీగా కాకుండా పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా ఈ సినిమా వచ్చింది. సినిమాకు అవసరం లేని ఏ విషయాన్ని ఇందులో ప్రస్థావించలేదు.

ఆ మహానటి పాత్రలో కీర్తి సురేష్ ఏమాత్రం తీసిపోని విధంగా నటించింది. పాత్రలన్ని పోటాపోటీగా నటించాయి. ఇలాంటి కథను చెప్పే ధైర్యం చేసినందుకు దర్శకుడు మెచ్చుకుని తీరాల్సిందే. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మహానటిని తెరకెక్కించారు. అది కూడా ప్రేక్షకులు మెచ్చేలా మనసుకి హత్తుకునేలా సినిమా ఉంది. అంతేకాదు సినిమా ముగిసినా ఆ పాత్ర మనల్ని వెంటాడుతూ వచ్చేలా చేశారు దర్శకుడు. 
Keerthy Suresh,Dulquer Salmaan,Samantha Akkineni,Vijay Devarakonda,Ashwin Nag,C. Ashwini Dutt,Mickey J. Meyer'మహానటి' సావిత్రికి ఘనమైన నివాళి..!

మరింత సమాచారం తెలుసుకోండి: