ఆకాష్ నటన, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ఆకాష్ నటన, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్స్క్రీన్ ప్లే, మ్యూజిక్, నేరేషన్
తానో సైనికుడిగా తనని ఎవరో చంపేసినట్టుగా రోజు కల కనే రోషన్ (ఆకాష్ పూరి) హిమాలయాల్లో ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చినట్టు కల వస్తుంది. మరో పక్క లాహోర్ లో ఉన్న అఫ్రీన్ (నేహా శెట్టి) కూడా కలలో తనని ఎవరో ప్రేమించినట్టు ఆమె కోసం అతను వచ్చినట్టు కల వస్తుంది. స్టడీస్ కోసం ఇండియా వచ్చిన అఫ్రీన్ ను ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. అయినా రోషన్ ను చూడదు అఫ్రీన్. మరోపక్క అఫ్రీన్ ను పెళ్లిచేసుకోబోయే నాదిల్ (విషు రెడ్డి)కి ఆమె ఇండియా వెళ్లడం నచ్చదు. ఈ క్రమంలో రోషన్ తన గతజన్మ గురించి తెలుసుకుంటాడు. తన ప్రేయసి అఫ్రీన్ అని తెలుసుకుంటాడు. రోషన్ కు గత జన్మ రహస్యాలు ఎలా తెలిసాయి..? పాకిస్థాన్ వెళ్లిన అఫ్రీన్ ను కలుసుకునేందుకు రోషన్ ఏం చేశాడు..? వారిద్దరు ఒకటయ్యారా లేదా..? అన్నది మెహబూబా కథ.
రోషన్ గా ఆకాష్ బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. అయితే అక్కడక్కడ క్యారక్టర్ వెయిట్ మోసే ఇమేజ్ లేదని తెలిసిపోతుంది. హీరో హీరోయిన్ మధ్య ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. హీరోయిన్ నేహా శెట్టి ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. మురళి శర్మ, షియాజి షిండే పాత్రలు రెగ్యులర్ గానే ఉన్నాయి. ఇక మిగతా వారంగా బాగానే నటించారు.
సందీప్ చౌతా మ్యూజిక్ బాగుంది. రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విష్ను శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. యుద్ధ సన్నివేశాలు, ట్రెక్కింగ్ సీన్స్ చాలా బాగా చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. కథ, కథనాల పరంగా పూరి కొత్తగా ప్రయత్నించినా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. టేకింగ్ పరంగా పూరి ఎక్కడో లాజిక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.


పూరి సినిమా అంటే టేకింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. అయితే ఈ సినిమా కూడా కెమెరా వర్క్ బాగున్నాయి. కథను సాగించిన తీరు మాత్రం ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. పూరి అతి జాగ్రత్త కొంపముంచిందనే చెప్పొచ్చు. రొటీన్ కథ కాదు కాని గతజన్మ అనేసరికి ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది.


ఇక తనయుడు ఆకాష్ కు ఎలాంటి ఇమేజ్ లేదు అందువల్ల రాసుకునే సీన్స్ చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. కాని ఓ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి సీన్స్ రాసినట్టుగా రాశారు. కథనం చాలా స్లో గా అనిపిస్తుంది. మొదటి భాగం హీరో క్యారక్టరైజేషన్ కంటెంట్ మీద నడిచినా అంత ఇంట్రెస్ట్ అనిపించదు.


ఇక సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. పూరి మార్క్ రొటీన్ కథ అయినా చూడాలనిపిస్తుంది. కాని ఈ సినిమాలో కథ కొత్తగా ఉన్నా పూరి ట్రాక్ తప్పినట్టు కనిపిస్తుంది. పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలాగా మాత్రం మెహబూబా ఉండదు.
Aakash Puri, Neha Shetty,Puri Jagannadh,Puri Connects,Sandeep Chowta'మెహబూబా'.. పూరి మరోసారి నిరాశపరచాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: