సినిమాటోగ్రఫీ, విజయ్ ఆంటోనీ, మూల కథసినిమాటోగ్రఫీ, విజయ్ ఆంటోనీ, మూల కథకథనం, మ్యూజిక్, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

అమెరికాలో పెద్ద డాక్టర్ విలాసవంతమైన జీవితంతో ఉండే భరత్ (విజయ్ ఆంటోని)తన తల్లిదండ్రులుగా ఉన్న వారు తనని దత్త తీసుకున్నారని తెలుసుకుంటాడు. ఇక ఈ క్రమంలో అతనికి రోజు ఓ కల వెంటాడుతుంది. ఆ కలని వెతుక్కుంటూ ఇండియాకు బయలుదేరుతాడు భరత్. అక్కడ తల్లి పరిస్థితి చూసి షాక్ అవుతాడు. ఇక తన తండ్రి ఎవరు అని తెలుసుకునే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి..? అసలు భరత్ ఎందుకు ఇండియా వచ్చాడు అన్నది సినిమా కథ.

విజయ్ ఆంటోని సినిమా అనగానే డిఫరెంట్ కథ, కథనాలు అని ప్రేక్షకుల్లో ఓ ముద్ర పడిపోయింది. అయితే ఒకేరకమైన కథలతో విజయ్ క్యారక్టరైజేషన్ తో కాస్త విసుగు తెప్పిస్తున్నాడని చెప్పాలి. కాశీలో కనిపించిన అన్ని పాత్రల్లో ఒకేరకమైన నటన కనిపించాడు. అంజలి కొన్ని సీన్స్ కే పరిమితం కాగా సునైనా కూడా చిన్న పాత్రే చేసింది. కమెడియన్ యోగి కాంపౌండర్ గా నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. నాజర్ పాత్ర అలరించిది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్ష్ణగా చెప్పొచ్చు. మ్యూజిక్ ఎప్పటిలానే అరవ వాసన కనిపిస్తాయి. కథ, కథనాల్లో విజయ్ మార్క్ కనిపిస్తున్నా దర్శకుడు ఉదయనిధి ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ఎడిటింగ్ నిడివి తక్కువ ఉన్నా ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనేలా ఉన్నాయి.


అమెరికాలో డాక్టర్ గా ఉన్న హీరో ఓ కల వెంటాడటం దాని ద్వారా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ రావడం ఇలా కథగా చెప్పుకుంటూ వెళ్తే సినిమా బాగుందనిపిస్తుంది. అయితే సినిమా తెర మీద కథనం సినిమాను డిస్ట్రబ్ చేశాయి. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో కాశీ వచ్చాడు.

మొదటి భాగం అమెరికా ఎపిసోడ్స్ కాస్త బాగున్నాయనిపిస్తాయి. అయితే హీరో కథలో వెంటాడే మూడు పాత్రలని తనలా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ పాత్రలు ఎందుకు కథకు సంబంధం లేకుండా చేశాడో ఆయనకే తెలియాలి.

బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని సినిమాలకు ఇక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒకే రకమైన కథ, కథనాలతో వస్తే ఆడియెన్స్ తిప్పి కొడతారు. విజయ్ నటనలో కూడా కొంత మార్పు అవసరమనిపిస్తుంది. కాశి క్లైమాక్స్ కూడా నిరాశ పరుస్తుంది. 
Vijay Antony,Anjali,Sunaina,Kiruthiga Udhayanidhi,Fatima Vijay Antonyవిజయ్ 'కాశీ'.. నిరాశ పరచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: