రవితేజ, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్రవితేజ, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్హీరోయిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే , ఫస్ట్ హాఫ్
అనాథగా పెరిగిన హీరో రవితేజ అవసరం అనుకున్న వారికి అడుగకుండానే సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి. ఇలా నడుస్తుండగా హోం మినిస్టర్ ఆదిత్య భూపతి(జగపతి బాబు) మనుషులు హీరోకి కెలకడం దానితో హీరో దృష్టి అతని మనుషుల మీద పడటం ఆ తర్వాత హీరో విలన్ ను ఎలా టార్గెట్ చేశాడు అన్నది సినిమా కథ. హీరో, విలన్ ల మధ్య ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి. వారిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్నది తెర మీద చూడాల్సిందే.
మాస్ మహరాజ్ ఎనర్జీకి తగినట్టుగానే రవితేజ ఈ సినిమాలో నటించారు. సినిమాలో రవితేజ స్టైలిష్ గా కూడా ఉంటారు. తన మార్క్ కామెడీ పంచులతో రవితేజ అలరించాడు. హీరోయిన్ మాళవిక శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేదు. హోమీ లుక్ తో పాటుగా అందాల ప్రదర్శన సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవలేదు. జగపతి బాబు నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. పొలిటికల్ లీడర్ గా మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు జెబి. ఇక కామెడీ గ్యాంగ్ అంతా సందడి చేసినా ఎంటర్టైనింగ్ మాత్రం కొంతనే ఉందని చెప్పొచ్చు.

సినిమాకు ప్రొడక్షన్ పరంగా భాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. శక్తికాంత్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం తన ప్రతిభ కనబరచలేకపోయాడు. డైలాగ్స్ ఓకే అన్నట్టు అనిపించగా కామెడీ ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు.

రవితేజ హీరోగా మాస్ టైటిల్ నేల టిక్కెట్టు అంటూ మాస్ టైటిల్ తో క్లాస్ మూవీ తీశాడు కళ్యాణ్ కృష్ణ. సినిమా కథ కథనాలు అవుట్ డేటెడ్ గా అనిపించకమానవు. ఫస్ట్ హాఫే ఆడియెన్స్ పేషెన్సీని టెస్ట్ చేసేలా ఉంటుంది. కథ పాతదే అయినా కథనంతో ఆకట్టుకోవాల్సిన దర్శకుడు అది కూడా రొటీన్ గా పరమ బోరింగ్ గా రాసుకున్నాడు.

సినిమా ప్రమోషన్స్ లో 4 ఇయర్స్ రాసుకున్న కథ అని చెప్పాడు దర్శకుడు అదేవిధంగా కథనం సాగుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల దర్శకుడేనా ఈ సినిమా తీసింది అన్న విధంగా ఉంటుంది. కామెడీ కోసం ట్రై చేసినా అది కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.

రవితేజ వరకు ఓకే అనుకున్నా అలాంటి హీరోని సరిగా వాడుకోలేకపోవడం దర్శకుడి తప్పే అని చెప్పొచ్చు. హీరోయిన్ అయితే ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి ప్రస్థావించే ఛాన్స్ లేకుండా పోయింది. కథ పరంగా రవితేజను ఇంప్రెస్ చేసిన దర్శకుడు సినిమా తెర మీద మాత్రం రొటీన్ గా చూపించాడు. రవితేజ ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరచేలా సినిమా ఉంది.
Ravi Teja,Malvika Sharma,Kalyan Krishna,Ram Talluri,ShakthikanthComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: