Star cast: Sumanth AshwinEasha
Producer: K. L. Damodar PrasadDirector: Mohan Krishna Indraganti

Anthaka Mundu Aa Tarvatha - English Full Review

అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: చిత్రకథ 
పెద్దలు కుదిర్చిన వివాహం కాకుండా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే యువకుడు అనిల్(సుమంత్ అశ్విన్), తన తండ్రి (రావు రమేష్ ) సహాయంతో తల్లి చేస్తున్న పెళ్లి ప్రయత్నాల నుండి తప్పించుకోవడానికి హైదరాబాద్ వచ్చేస్తాడు. హైదరాబాద్ చేరుకున్న అనిల్ కి అనన్య(ఈశ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. పెయింటర్ గా పని చేసే అనన్యను చూడగానే ప్రేమలో పడ్డ అనిల్ అనన్య ప్రేమను పొందాలన్న ప్రయత్నాలు చేస్తుంటాడు కాని తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతుండటం తో విసిగిపోయిన అనన్య , అనిల్ తో కూడా తన బంధం అలానే అవుతుందేమో అన్న భయంతో తనకి అనిల్ అంటే ఇష్టం ఉన్నా కూడా బయట పెట్టదు. అనిల్ కూడా పెళ్లి తరువాత జీవితం ఎలా ఉంటుందో అన్న భయంతో ఉంటాడు. వీరు ఈ సందేహాలను నివృత్తి చేసుకోడానికి రహస్యంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలు పెడతారు. అక్కడ నుండి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను ధాటి వారి ప్రేమ నిలబడిందా లేదా వాళ్ళ తల్లిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకున్నారా అన్నది మిగిలిన కథ.

అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: నటీనటుల ప్రతిభ
సుమంత్ అశ్విన్ తన మొదటి చిత్రంతో పోలిస్తే నటనలో చాలా మెరుగుపడ్డాడు కాని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల వద్ద సన్నివేశంలో ఉన్న బలం తన హవాభావల్లో రప్పించలేక ఇబ్బంది పడుతున్న విషయం యిట్టె తెలిసిపోతుంది. ఇక తన డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మొదటి చిత్రంలోనే మంచి డాన్సర్ అని నిరూపించుకున్న ఈ నటుడు ఈ చిత్రంలో అదే పంథాను కొనసాగించాడు. ఈ పాత్రకు ఈశ అనడం కన్నా ఈశ కోసం ఈ పాత్ర అన్నట్టు నటించింది. పక్కింటి అమ్మాయి అన్న ఫీలింగ్ రాబట్టగలిగింది చాలా రోజుల తరువాత తెర మీద కనిపించిన మధుబాల తన నటనతో ఆకట్టుకుంది . రవిబాబు, రోహిణి, ఝాన్సీ మరియు రావు రమేష్ కీలక పాత్రలలో చాలా బాగా నటించి సన్నివేశానికి బలం చేకూర్చారు. శ్రీనివాస్ అవసరాల తనదయిన కామెడీ తో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు అల వచ్చి ఇలా వెళ్ళాయి.

అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

మోహన్ కృష్ణ ఎంచుకున్నది సెన్సిటివ్ ప్లాట్ అయినా చాలా బాగా డీల్ చేశారు ముఖ్యంగా అయన రాసిన మాటలు చాలా ఫ్రెష్ గ ఉండడమే కాకుండా సన్నివేశాన్ని మరింత దగ్గరయ్యేలా చేశాయి. కాని మొదటి అర్ధ భాగంలో అయన చూపిన శ్రద్ద రెండవ అర్ధ భాగం మీద కూడా చూపించి ఉండాల్సింది. మొదటి అర్ధ భాగం వేగంగా గడిచిపోతుంది రెండవ అర్ధ భాగం వచ్చేసరికి చాలా నెమ్మదిస్తుంది. మొదటి అర్ధ భాగం చూసాక రెండవ అర్ధ భాగం ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడేమో ఎడిటర్ చాలా సన్నివేశాలను కత్తిరించలేదు. కథనంలోని తాజాదనాన్ని పిజి విందా సినిమాటోగ్రఫీ ఏ మాత్రం మిస్ అవ్వనివ్వలేదు. ఇంకా కాస్త ఫ్రెష్ నెస్ ని కూడా జత చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ కోడూరి అందించిన సంగీతంలో పాటలు మరియు నేపధ్య సంగీతం రెండు బాగున్నాయి.


అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: హైలెట్స్
  • హీరో, హీరోయిన్ మధ్యన లవ్ సీన్స్
  • కళ్యాణ్ కోడూరి సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • డైలాగ్స్

అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: డ్రా బాక్స్
  • సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
  • క్లైమాక్స్
  • కామెడీ తక్కువగా ఉండటం

అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: విశ్లేషణ

ప్రేమకు ముందు పెళ్ళికి తరువాత అనే అంశాన్ని ఎంచుకున్న దర్శకుడు నిజానికి బూతు సన్నివేశాలు ,అడల్ట్ కామెడీ తో నింపేసి హిట్ కొట్టేయచ్చు కాని హిట్ కన్నా విలువలను నమ్ముకున్న దర్శకుడిగా పేరున్న మోహన కృష్ణ ఈ చిత్రంలో కూడా విలువలను వదులుకోలేదు. ఏ చిత్రం అయిన పెళ్లి కి ముందు చూపించి పెళ్ళితో శుభం కార్డు వేసేస్తారు కాని పెళ్లి తరువాతే అసలు కథ ఉంటుంది అన్న అంశం మీద చాలా చిత్రాలు వచ్చాయి కాని ఇదే విషయాన్నీ ఎలాగయినా తేల్చుకోవాలని లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి చర్చించడం చాలా అరుదు, రొటీన్ లవ్ స్టొరీ లాంటి చిత్రాలు వచ్చినా అందులో కూడా సమస్యల కన్నా ఎక్కువ ప్రేమ గురించే చర్చించారు కాని ఈ చిత్రంలో నిజంగా పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత అనే అంశాన్ని చాలా బాగా చిత్రీకరించారు మోహన కృష్ణ గారు అలానే లీడ్ రోల్స్ రియలైజ్ అవ్వడానికి కావలసిన సబ్ ప్లాట్స్ కూడా బలంగా రాసుకున్నారు కాని క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎక్కువగా డ్రామా పెట్టడంతో అప్పటి వరకు కథలో ఫ్రెష్ నెస్ కి అలవాటు పడ్డ ప్రేక్షకుడు అక్కడ ఇబ్బందిపడతాడు పిజి వింధ సినిమాటోగ్రఫీ చాలా బాగుండటం డైలాగ్స్ కి తగ్గట్టుగా నటీనటుల పనితీరు చిత్రాన్ని పరవాలేదనిపించే స్థాయి నుండి బాగుంది అనే స్థాయికి తీసుకెళ్ళాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరియు దగ్గరలో ఏ చిత్రం లేకపోవడంతో ఈ చిత్రానికి లాభం చేకూరుస్తుంది. అంతకు ముందు వచ్చిన ఏ చిత్రాలు ఆకట్టుకోలేదు ఆ తరువాత చిత్రాలు ఎప్పుడొస్తాయో తెలియదు కాబట్టి సినిమాకి వెళ్ళాలి అనిపిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చిత్రానికి వెళ్ళిపొండి.


అంతకు ముందు... ఆ తరువాత... రివ్యూ: చివరగా
అంతకుముందు ఆ తరువాత : బూతు లేని యూత్ చిత్రం
 

Review board: Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Anthaka Mundu Aa Tarvatha | Anthaka Mundu Aa Tarvatha Wallpapers | Anthaka Mundu Aa Tarvatha Videos

మరింత సమాచారం తెలుసుకోండి: