ఎంచుకున్న కాన్సెప్ట్, కామెడీఎంచుకున్న కాన్సెప్ట్, కామెడీలీడ్ పెయిర్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే

చిన్నప్పటి నుండి దొంగతనం అనే వింత రోగంతో బాధపడుతుంటాడు రాజ్ (రాజ్ తరుణ్). తనకున్న ఈ వ్యాధి గురించి ఎవరికి చెప్పడు. ఇక మనసుకి నచ్చిన అమ్మాయి తన్వి (అమైరా దస్తర్)ను చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా రాజుని ఇష్టపడుతుంది. ఇద్దరు ప్రేమని ఇంట్లో వారికి చెప్పి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారు. ఈ తరుణంలో తన్వి తాత నాగినీడు దగ్గరకు ఓ 10 రోజులు ఉండేలా వెళ్తారు రాజు, తన్వి. తన్వి తాతకు దొంగతనం చేసే వారంటే కోపం చిన్న దొంగతనానికే పెద్ద శిక్ష వేస్తాడు. ఇక అలాంటి ఇంట్లో తన్వి తాతాకి దొరక్కుండా రాజు ఎలా తప్పించుకున్నాడు. చివరకు ఆమెని ఎలా దక్కించుకున్నాడు అన్నది సినిమా కథ.

రాజ్ తరుణ్ హీరోగా తనవరకు బాగానే చేశాడు. అయితే కుర్రాడిలో ఇదవరకు ఉన్న జోష్ ఈ సినిమాలో కనిపించలేదు. అమైరా దస్తర్ అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయలేదు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నాగినీడు, సితార, ప్రవీణ్ సినిమాలో పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సినిమా కెమెరా వర్క్ బాగానే అనిపిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ బాగుంది. దర్శకురాలు సంజనా రెడ్డి కథ, కథనాలు ఏమంత కొత్తగా అనిపించవు. సినిమా అంతా రొటీన్ పంథాలో సాగుతుండటం జరుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఈ సినిమా చూస్తున్నంతసేపు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమా గుర్తుకొస్తాయి. ఆ సినిమాల్లానే హీరోకి ఓ ప్రాబ్లెం దాన్ని కవర్ చేస్తూ హీరోయిన్ ను ప్రేమించడం.. అది వారి పెద్దవాళ్లకు తెలిసి అల్లరి చేయడం.. చివరకు తన సమస్యను సాల్వ్ చేసుకోవడం. ఇలా వచ్చిన కథే అనిపిస్తుంది.

అయితే దర్శకురాలు హీరో పాత్ర మొదలు పెట్టిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక కథనంలో ఫన్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటే బాగుండేది కాని అలా చేయలేదు. సినిమా అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్ గా అనిపించదు. విన్న డైలాగులే.. ఎక్కడో చూసిన సీన్సే వస్తున్నట్టు అనిపిస్తాయి.

ఇక హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా అంతగా కుదరలేదు. మొదటి భాగం ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ కుదరలేదు. క్లైమాక్స్ కాస్త బెటర్ అన్నట్టు ఉంటుంది. కుమార్ 21ఎఫ్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకునేందుకు రాజ్ తరుణ్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు ఇక అలా వచ్చిన రాజుగాడు కూడా నిరాశ పరచిందనే చెప్పాలి.


Raj Tarun,Amyra Dastur,Sanjana Reddy,Sunkara Ramabrahmam,Gopi Sundarరాజుగాడు.. రాజ్ తరుణ్ వృథా ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: