రజినికాంత్, నానా పటేకర్, సినిమాటోగ్రఫీ, హీరో ఎలివేషన్ సీన్స్రజినికాంత్, నానా పటేకర్, సినిమాటోగ్రఫీ, హీరో ఎలివేషన్ సీన్స్స్లో నరేషన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, వీక్ క్యారెక్టర్స్, క్లయిమాక్స్ పోర్షన్
ముంబైలో ధారావి ప్రాంతంలో ప్రజలకు నాయకుడిగా వారి కష్టాల్లో అండందడగా ఉంటాడు కరికాలన్ (రజినికాంత్) తన కుటుంబంతో అక్కడే నివసిస్తున్న కాలా మాట అంటే ధారావి ప్రాంత వాసులకు ఓ శాసనం. అయితే అక్కడ స్లం ను బయటకు పంపించి అక్కడ పెద్ద బిల్డింగులు కట్టేందుకు చూస్తారు కొందరు. కాలా ఎటాక్ తో వారు ఆ పని చేయలేరు. ఓ పొలిటిషియన్ హరిదేవ్ దాదా (నానా పటేకర్) ధారావి మీద కన్నేస్తాడు. ఆ పొలిటిషియన్ నుండి ధారావి ప్రాంతాన్ని కాలా ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ. 

కాలాగా రజినికాంత్ వన్ మ్యాన్ షో చేశారు. బ్లాంక్ అండ్ బ్లాక్ లో రజిని లుక్ బాగుంది. ఇక తన స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాలా రజిని ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తాడు. ఇక కాలాకు పోటీగా సహజ నటనతో ఆకట్టుకున్నాడు విలన్ గా చేసిన నానా పటేకర్. సినిమాలో అతని పాత్ర చాలా బాగుంటుంది. సౌత్ సినిమాలు అసలు ఒప్పుకోని నానా పటేకర్ కాలాకి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషిలు నటనతో ఆకట్టుకున్నారు. సముద్ర ఖని సినిమా మొత్తం రజిని పక్కన ఉండి కామెడీ పండించాడు. మిగతా పాత్రలన్ని ఓకే అనిపిస్తాయి.

మురళి సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి పాత్రాన్ని చాలా చక్కగా చూపించారు. సినిమాకు వాడిన కలరింగ్ కూడా బాగుంది. ఇక సంతోష్ శివన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కథ విషయంలో పా. రంజిత్ ఈసారి కాస్త జాగ్రత్తపడినా కథనం లో మళ్లీ కబాలి ఫ్లేవర్ కనిపించేలా చేశాడు. సాగదీఇన కథనం ప్రేక్షకులను మెప్పించలేదు. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ముంబైలోని ఓ ప్రాంతం అక్కడ ప్రజలను కాపాడే హీరో ఎలాగైనా వారికి ఆశ చూపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుందామని చూసే పొలిటిషియన్ సింపుల్ గా చెప్పాలంటే ఇదే కాలా కథ. కథగా అనుకున్నప్పుడు ఆ మురికివాడల్లోని ప్రజలు పడే ఇబ్బందులు, వాస్తవాలు ఏంటన్నది ప్రస్థావించొచ్చు అయితే కథనంలో అవి ప్రస్థావించినా ఆడియెన్స్ ను మెప్పించలేదు.

దర్శకుడు తాను రాసుకున్న కథకు సరైన కథనం ఎంచుకోలేదు. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజినితో సినిమా అంటే ఆడియెన్స్ లో కొన్ని అంచనాలుంటాయి. వాటిని అందుకోవడంలో మళ్లీ పా. రంజిత్ వెనుకపడ్డాడు. సినిమా మొత్తం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రజిని ఒక్కటే తప్ప మిగతావేవి ఉండవు.

తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండే టేకింగ్ కూడా తెలుగు ప్రేక్షకులను కాస్త అసహనానికి గురి చేస్తుంది. మ్యూజిక్ పాటలు బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎంచుకున్న కథ, కథనాలు సూపర్ స్టార్ లాంటి హీరో ఉన్నప్పుడు ఇంకాస్త డెప్త్ గా వెళ్తే బాగుండేది అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా కేవలం కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. కబాలి చూశాక రజినితో రంజిత్ ఇలాంటి సినిమా చేశాడే అన్న భావన వస్తుంది. కాలా తర్వాత కూడా మళ్లీ రజిని ఇలా అయితే కష్టమే అనిపిస్తుంది.
Rajinikanth,Nana Patekar,Samuthirakani,Huma Qureshi,Eashwari Rao,Pa. Ranjith,Dhanush,Santhosh NarayananComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: