తమన్నా, సినిమాటోగ్రఫీతమన్నా, సినిమాటోగ్రఫీస్క్రీన్ ప్లే, మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్

ఆర్జే గా పనిచేస్తున్న మీరా (తమన్నా) వాలెంటైన్స్ డే ప్రోగ్రాంలో తన ప్రేమకథ చెప్పడం మొదలుపెడుతుంది. ఒక్కసారి కూడా కలవకుండా వరుణ్ ను ఇష్టపడుతుంది మీరా. దొరికిన ఓ బుక్ లో వరుణ్ ఫోటో చూసి అతన్ని ఇష్టపడుతుంది మీరా. వరుణ్ ఫోటో చూసిన ప్రతిసారి ఆమెకు మంచి జరుగుతుంది. ఇక అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉన్నా మూడుసార్లు వేరు వేరు కారణాల వల్ల వెళ్లడం కుదరని వరుణ్ మీరా ప్రేమను తెలుసుకుంటాడు. డెస్టినీని విపరీతంగా నమ్మే మీరా అసలు ఎలాంటి నమ్మకాలు లేని వరుణ్ కు ఓ చిన్న టెస్ట్ పెడతాడు. ఫైనల్ గా వరుణ్ ను కలిసిన మీరా తన ప్రేమని గెలిపించుకుందా..? అసలు వరుణ్, మీరాలు ఎలా కలిశారు..? వారి ప్రేమకథకు ముగింపు ఏంటి..? అన్నది సినిమా కథ.   

కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఇంత రిజర్వెడ్ గా కనిపించిన సందర్భాలు తక్కువ. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశాడు నందమూరి హీరో. ఇదవరకు కళ్యాణ్ రాం అసలు ఏమాత్రం గుర్తురానంతగా చేశాడు. మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మ్యాక్సిమం సినిమా అంతా వీరిద్దరి పాత్రల మీదే నడుస్తుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రియదర్సి ఉన్నా కామెడీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. తనికెళ్ళ భరణి మెప్పించారు. 

నా నువ్వే ప్రత్యేకమైన సినిమాగా నిలిచేందుకు పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీకి క్రెడిట్ ఇవ్వాలి. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. శరత్ మెలోడీ మ్యూజిక్ మనసుకి నచ్చేలా ఉంటుంది. కథ విషయంలో దర్శకుడు సృజనాత్మకత తెలిసినా కథనం కన్విన్స్ అయ్యేలా తీయలేదు. డైలాగ్స్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

కళ్యాణ్ రామ్ కెరియర్ లో కొత్తగా ట్రై చేసిన సినిమా నా నువ్వే. ప్రతి సినిమాలో హీరో ప్రేమ కోసం హీరోయిన్ వెంటపడటం చూస్తుంటాం. ఇందులో హీరోయిన్ హీరోని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అతని ప్రేమను పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అంతా ఓ కొత్త జానర్ లో వెళ్తుంది. 


అయితే కథనం అక్కడక్కడ ఇంప్రెస్ చేసినా ఆడియెన్స్ ను మెప్పించేలా మాత్రం తీయలేదు. సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. కళ్యాణ్ రామ్, తమన్నాల కెమిస్ట్రీ బాగుంది అనిపించినా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఆల్రెడీ ఓ ఇమేజ్ ఉన్న హీరో, హీరోయిన్ కాబట్టి ఈ డ్రమెటిక్ స్క్రీన్ ప్లే మెప్పించలేదు అనుకోవచ్చు.  


హీరో, హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. జయేంద్ర తీసిన 180 సినిమాలానే ఈ సినిమా కూడా మంచి కథతో వచ్చినా కథనం విషయంలో దర్శకుడి పొరపాట్లు చేశాడు. క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా తక్కువే. యూత్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రచించలేదు.
Nandamuri Kalyan Ram,Tamannaah,Jayendra Panchapakesan,Kiran Muppavarapu,Vijayakumar Vattikuti,Sharrethకళయాణ్ రామ్ 'నా నువ్వే'.. మెప్పించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: