లీడ్ పెయిర్, మ్యూజిక్ , డైలాగ్స్ లీడ్ పెయిర్, మ్యూజిక్ , డైలాగ్స్ అక్కడక్కడ స్లో అవడం

బొమ్మలతో చిన్న పిల్లల కథలు చెప్పే విజయ్ కుమార్ (సుధీర్ బాబు) కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంటాడు. ఇక విజయ్ తండ్రి సర్వేష్ (సీనియర్ నరేష్) రిటైర్ అయ్యి సినిమాల మీద ఇష్టంతో నటించాలని అనుకుంటాడు. షూటింగ్ కు ఇల్లు ఇస్తే వేషం ఇస్తారని తెలుసుకున్న సర్వేష్ ఇంట్లో షూటింగ్ చేసుకునేలా పర్మిషన్ ఇస్తాడు. ఆ సినిమా హీరోయిన్ గా నార్త్ నుండి వచ్చిన సమీరా (అదితి రావు హైదరి) తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంది. అందుకే విజయ్ ఆమెకు తెలుగు నేర్పిస్తాడు. అలా వారిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. ఒకదశలో సమీరాకి ప్రపోజ్ చేస్తాడు విజయ్ కాని ఆమె అతని ప్రేమని తిరస్కరిస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు వారిద్దరిని దూరం చేస్తాయి. ఇంతకీ సమీరా ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? విజయ్, సమీరాల ప్రేమ సక్సెస్ అయ్యిందా..? లేదా అన్నది సినిమా కథ. 

విజయ్ పాత్రలో సుధీర్ బాబు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు అతని నటనలో పరిణితి కనబడుతుంది. ఇక హీరోయిన్ అదితి రావు రీల్ లైఫ్ హీరోయిన్ గా గ్లామర్ గా కనిపిస్తూ నటనతో కూడా అలరించింది. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు సీనియర్ హీరో నరేష్. రాహుల్ రామకృష్ణ ఓకే అనిపించాడు.

పిజి విందా సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో, హీరోయిన్ లను చూపించిన విధానం బాగుంది. వివేజ్ సాగర్ మ్యూజిక్ మెలోడీగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది. కథ, కథనాల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ మార్క్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంతా కాంప్రమైజ్ అవకుండా పెట్టారు.

టాలీవుడ్ దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ తన మార్క్ చూపిస్తున్నాడు. అష్టా చెమ్మ నుండి ఈరోజు వచ్చిన సమ్మోహనం వరకు సహజత్వానికి దగ్గరగా తన సినిమాలు ఉంటాయి. ఇక ఈ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్స్ మీద వస్తున్న కాస్టింగ్ కౌచ్ కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. సినిమా వాళ్ల మీద ఉన్న ఒపీనియన్ ను మార్చేలా ఈ సినిమా ఉంటుంది.   

కథ, కథనాలు దర్శకుడు ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడ పరిధి దాటలేదు. కమర్షియల్ హంగుల కోసం లేని పోని ఆర్భాటాలు చేయలేదు. లీడ్ పెయిర్.. ఎంచుకున్న కథ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వచ్చింది సమ్మోహనం. మొదటి భాగం సరదాగా సాగించగా సెకండ్ హాఫ్ కాస్త వేగం తగ్గిందనిపిస్తుంది. 

ఇంద్రగంటి సినిమాల్లో ఎప్పుడు సెకండ్ హాఫ్ కాస్త డల్ గానే ఉంటుంది. అయితే అది సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ పడదు. సమ్మోహనంలో కూడా సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు ఉంటుంది. ఫైనల్ గా మాత్రం ఆడియెన్స్ కు నచ్చేస్తుంది. 
Sudheer Babu,Aditi Rao Hydari,Mohan Krishna Indraganti,Sivalenka Krishna Prasad,Vivek SagarComing Soon.....

మరింత సమాచారం తెలుసుకోండి: