జయం రవి, మ్యూజిక్, స్టోరీ లైన్జయం రవి, మ్యూజిక్, స్టోరీ లైన్స్క్రీన్ ప్లే, సిజి వర్క్ సరిగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్

అంతరిక్షంలోని ఓ భారీ ఉల్క వలన ఇండియాకు ప్రమాదం ఉందని కనుగొన్న సైంటిస్టులు ఎలాగైనా ఈ ప్రమాదం నుండి ఇండియాను కాపాడాలని అంతరిక్ష నౌక ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించుకుంటారు. ఉల్కని బద్ధలు చేసి దాన్ని గమనం మార్చేయాలని వారు ప్రయాణం మొదలు పెడతారు. అందుకు కావాల్సిన న్యూక్లియర్ వెపన్ వేరే గ్రహంలో ఉందని తెలిసి దాన్ని కాజేయాలని ఎస్కేప్ ఆర్టిస్ట్ వాసు (జయం రవి) అతని టీంను అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. ఇంతకీ వాసు అండ్ టీం ఆ పెను ప్రమాదం నుండి ఇండియాను ఎలా కాపాడాడు అన్నది సినిమా కథ.

జయం రవి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. సినిమాలో అతని పాత్రలో వెరైటీ షేడ్స్ కనిపిస్తాయి. నివేదా పేతురాజు కూడా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ఆరోన్ అజిజ్, రమేష్ తిలక్, అర్జునన్ నటన బాగుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇమ్మాన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తిగా సాగుతుంది. వెంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో వచ్చిన ఈ సినిమా ఉన్నంతవరకు బాగానే అనిపిస్తుంది. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తన ప్రతిభ చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు ఇంకా ఎక్కువ బడ్జెట్ అయితే ఇంకాస్త గ్రాండియర్ గా ఉండేదనిపిస్తుంది.

అంతరిక్ష నేపథ్యంలో సాగిన మొదటి ఇండియన్ సినిమాగా టిక్ టిక్ టిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇండియాకు ఓ ఉల్క ద్వారా ప్రమాదం పొంచి ఉండడం.. దాని గమనం మార్చే వెపన్ వేరే దేశంలో ఉండటం దాని కోసం హీరో టీంను పంపడం అంతా బాగున్నాయి. అయితే సినిమా చాలా వరకు లాజిక్ లెస్ గా ఉంటుంది.

కథనంలో సెంటిమెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. సిజి వర్క్ కూడా అంత బాగా అనిపించవు. స్పేస్ నేపథ్యంలో సినిమా  కాబట్టి కొంత రీసెర్చ్ చేసి సినిమా తెరకెక్కించాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. అక్కడక్కడ కాస్త కథనం మందగించిందని చెప్పొచ్చు.

సినిమా చూసిన ఆడియెన్స్ మాత్రం ఓ కొత్త అనుభూతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాని ఈ సినిమా ఇంకాస్త సీరియస్ మోడ్ లో తీసుంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా దర్శకుడు చాలా విషయాల్లో సినిమా ఎంటర్టైనింగ్ పంథాలోనే కొనసాగించాడు.
Jayam Ravi,Nivetha Pethuraj,Shakti Soundar Rajan,Hitesh Jhabak,D. Immanటిక్.. టిక్.. టిక్ మంచి ప్రయత్నమే కాని నిరాశపరచింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: