స్టార్ కాస్ట్, పంచ్ డైలాగ్స్, సినిమాటోగ్రఫీస్టార్ కాస్ట్, పంచ్ డైలాగ్స్, సినిమాటోగ్రఫీకథ రొటీన్ గా అనిపించడం, తాగుడు సీన్స్

నలుగురు స్నేహితుల కథే ఈ సినిమా.. వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్), ఉపేంద్ర (వెంకటేష్) వీరంతా మంచి స్నేహితులు. వీరంగా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుంటారు. వివేక్ తన కోపంతో స్నేహితులతో గొడవపడతాడు. వీరంతా తమ టాలెంట్ ను ప్రపంచానికి చాటాలనుకునే క్రమంలో పబ్బులో పార్టీ చేసుకుని అనుకోకుండా గోవా వెళ్తారు. ఈ నలుగురు చివరకు ఏం చేశారు..? వారి జీవితాన్ని ఎలా సరిద్దుకున్నారు..? అన్నది సినిమా కథ.

కుర్రాళ్లు నలుగురు కొత్తవాళ్లే అయినా తమ పాత్రలకు తగినట్టుగా బాగా నటించారు. సినిమాలో వివేక్ పాత్ర అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్రకి దగ్గరగా ఉంటుంది. వివేక్, కార్తిక్, కౌశిక్, ఉపేంద్ర ఇలా నలుగురు బాగా నటించారు. హీరోయిన్స్ గా నటించిన అనీషా అంబ్రోస్, సిమ్రన్ చౌదరి అలరించారు.

నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు తగినట్టుగా మంచి కలరింగ్ తో ఆకట్టుకున్నాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ బాగుంది, బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. కథ, కథనాల్లో దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన ప్రతిభ చూపాడు. కథ సాదా సీదాగా అనిపించినా కథనంలో మరోసారి తన మేజిక్ చేశాడు. సురేష్ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువమందే ఉన్నారు. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అయిన తరుణ్ భాస్కర్ అదే మేజిక్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో కంటిన్యూ చేశాడు. నలుగురు కొత్త వాళ్లతో తరుణ్ ఈ సినిమా ప్రయోగాత్మకంగా చేశాడని చెప్పొచ్చు.

అసలు ఏమాత్రం ఆడియెన్స్ కు పరిచయం లేని వాళ్లతో వారిని మెప్పించే కథ, కథనాలతో వచ్చాడు. అయితే కథ చాలా కామన్ గా అనిపిస్తుంది. కథనం నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. మొదటి భాగం పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టగా సెకండ్ హాఫ్ అక్కడక్క స్లో అయ్యిందని భావన కలుగుతుంది. 

పాత్రలు వాటి స్వభావాలు సహజంగా ప్రవర్తించడం తరుణ్ భాస్కర్ సినిమాల ప్రత్యేకత అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తన మార్క్ ఫన్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా చూసుకుని యూత్ మెప్పు పొందేలా ఈ సినిమా ఉంది. 
Vishwak Sen,Abhinav Gomatam,Anisha Ambrose,Simran Choudary,Tharun Bascker Dhassyam,Vivek Sagar.ఈనగరానికి ఏమైంది.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!

మరింత సమాచారం తెలుసుకోండి: