కామెడీ, క్లైమాక్స్, గోపిచంద్ కామెడీ, క్లైమాక్స్, గోపిచంద్ మ్యూజిక్, రొటీన్ స్క్రీన్ ప్లే

రాజకీయ నాయకులంతా తమ అక్రమ సంపాదనను హోం మినిస్టర్ జయేంద్ర అలియాస్ నాయక్ (సంపత్) దగ్గర ఉంచుతారు. అది కేవలం అవినీతి సొమ్ము మాత్రమే కాదు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా అని కూడా అని తెలుసుకుని విక్రాంత్ (గోపిచంద్) నాయక్ దగ్గర నుండి ఆ పెద్ద మొత్తాన్ని కొట్టేస్తాడు. కోట్ల కొద్ది డబ్బు తన దగ్గర నుండి మాయమవడం తెలుసుకున్న నాయక్ అతన్ని పట్టుకోవాలని చూస్తాడు. ఆ దొంగ ఎవరో కాదు విక్రాంత్ అని తెలుసుకుంటాడు. అసలు విక్రాంత్ దొంగేనా.. అతను ఎందుకు జయేంద్ర లాంటి పొలిటిషియన్స్ ను దారితీశాడు. అసలు విక్రాంత్ ఎవరు..? రాజకీయ నాయకుల మీద విక్రాంత్ వేసిన కేసు గెలిచాడా అన్నది సినిమా కథ.  

గోపిచంద్ రెగ్యులర్ పాత్రల కన్నా ఈ సినిమాలో కాస్త లౌడ్ గా కనిపిస్తాడు. నటన, ఫైట్స్ ఎప్పటిలానే పర్ఫెక్ట్ అనిపించగా కోర్ట్స్ సీన్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగా చెప్ప్పాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ అన్ని కమర్షియల్ సినిమాల హీరోయిన్ లానే పాటకు ముందు జస్ట్ ఏదో ఫీమేల్ లీడ్ ఉండాలనిపించేలా ఉంటుంది. విలన్ గా సంపత్ మంచి నటన కనబరిచాడు. శ్రీనివాస్ రెడ్డి, పృధ్వి కాస్త నవ్వులు పండించడానికి ప్రయత్నించారు. తణికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, షియాజి శిండే కూడా ఎప్పటిలానే తమ రొటీన్ పాత్రల్లో నటించారు.  

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగానే అనిపిస్తుంది. కొన్ని షాట్స్ లో గోపిచంద్ ను బాగా చూపించారు. గోపి సుందర్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతావి థియేటర్ నుండి బయటకు రాగానే మర్చిపోతాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. డైలాగ్స్ ఇంప్రెసివ్ గా అనిపించాయి. దర్శకుడు చక్రవర్తి కథ రొటీన్ గానే రాసుకున్నాడు. కథనం కూడా అదే పంథాలో కొనసాగించాడు.అయితే చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం బాగుంది.. దానికి రొటీన్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది.  

రాజకీయ నాయకుల మీద పంతం సాధించే హీరో కథే గోపిచంద్ పంతం సినిమా కథ. పొలిటిషియన్స్ నుండి డబ్బు కాజేసి ప్రజలకు పంచడమే హీరో పని. అయితే ఈ సినిమాలో కొత్తగా యాక్సిడెంట్ అయ్యి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ డబ్బు పంచుతాడు. 

పాయింట్ కొత్తది అని చెప్పలేం కాని అటు ఇటుగా పొలిటిషియన్స్ డబ్బు కొట్టేసి ప్రజలకు ఇచ్చే కథలు ఇదవరకు చాలా సినిమాలు వచ్చాయి. సినిమా అక్కడక్కడ కిక్ సినిమాలా అనిపిస్తుంది. మొదటి భాగం సరదాగా సాగించిన దర్శకుడు సెకండ్ హాఫ్ సీరియస్ గా నడిపించాడు. 

కథ, కథనంలో దర్శకుడు రొటీన్ పంథా కొనసాగించాడు. అక్కడక్కడ కొన్ని మంచి డైలాగులు పడినా లాభం లేకుండా పోయింది. కోర్ట్ సీన్ లో డైలాగ్స్ బాగున్నాయి. అయితే సినిమా చూసొచ్చాక ఆడియెన్స్ మాత్రం రొటీన్ సినిమా చూసిన భావన కలుగుతుంది. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. 
Gopichand,Mehreen Pirzada,K Chakravarthy,K. K. Radhamohan,Gopi Sundar'పంతం' నెగ్గడంలో తడబడిన గోపిచంద్..!

మరింత సమాచారం తెలుసుకోండి: