అనుపమ, సినిమాటోగ్రఫీ, అక్కడక్కడ కొన్ని సీన్స్అనుపమ, సినిమాటోగ్రఫీ, అక్కడక్కడ కొన్ని సీన్స్స్క్రీన్ ప్లే, డైరక్షన్, ఊహాజనితమైన సీన్స్

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తేజ్ పెదనాన్న విశ్వనాథం (జయప్రకాశ్) దగ్గర ఉంటాడు. ఒక మహిళను కాపాడే సమయంలో చిన్నప్పుడే ఒకతన్ని చంపి జైలుకెళ్తాడు తేజ్. 7 ఏళ్ల జైలు జీవితం అనుభవించిన తేజ్ ఉమ్మడి కుటుంబంగా ఉండే విశ్వనాథ్ ఇంట్లో తన వల్ల గొడవ వచ్చేలా చేస్తాడు. ఆ దెబ్బతో తేజ్ ను ఇంటి నుండి బయటకు పంపించేస్తారు. అలా హైదరాబాద్ వచ్చిన తేజ్ కు నందిని పరిచయం అవుతుంది. నందినితో పరిచయం ప్రేమలో పడటం అంతా జరిగిన తర్వాత యాక్సిడెంట్ లో నందిని తన గతం మర్చిపోతుంది. ఆమె కేవలం లండన్ నుండి హైదరాబాద్ వచ్చిన విషయాన్ని మాత్రమే మర్చిపోతుంది. అసలు నందిని లండన్ నుండి హైదరాబాద్ ఎందుకు వచ్చింది..? తేజ్, నందినిల ప్రేమ ఏమవుతుంది..? వారిద్దరు ఎలా కలిశారు అన్నది సినిమా కథ. 

సాయి ధరం తేజ్ ఎప్పటిలానే తన ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పరంగా న్యాయం చేసినా కథ, కథనాల్లో దమ్ము లేకపోవడంతో బోర్ కొట్టేస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో కాస్త పరిణితి చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు న్యాయం చేసింది. వైవా హర్ష, జోష్ రవి హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఏదో అలా నడిపించారు. జయప్రకాశ్ ఎప్పటిలానే తండ్రి పాత్రలో అలరించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఓకే. గోపీ సుందర్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎటొచ్చి కరుణాకరణ్ అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. తొలిప్రేమ తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసిందన్న డౌట్ రాక మానదు. డార్లింగ్ స్వామి డైలాగ్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. 

తొలిప్రేమ లాంటి అద్భుతమైన ప్రేమ కథ అందించిన దర్శకుడు కరుణాకరణ్ మరోసారి మెగా హీరోతో సినిమా అది కూడా తేజ్ ఐలవ్యూ అని టైటిల్ అనగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కాని ఇది కూడా పరమ రొటీన్ సినిమాగా వచ్చింది. హీరో, హీరోయిన్ లవ్ లో పడటం.. ఆమెకు యాక్సిడెంట్ అయ్యి తన ప్రేమ గురించి మర్చిపోవడం.. అతను గుర్తు చేసే క్రమంలో ఆమెతో కొంత దూరం ప్రయాణించడం.. ఆమె గతం గుర్తు చేసుకుని హీరో లవ్ ను యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.  

ఎలాంటి కొత్తదనం లేకుండా ఈ సినిమా వచ్చిందని చెప్పాలి. ఏదో యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమా అంతా బోర్ కొట్టేస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అయితే మరి రొటీన్ గా అనిపిస్తాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో తేజ్ ఐలవ్యూ ప్రేక్షకులను అలరించలేదు. ముందే ఊహించేసేలా సన్నివేశాలు ఉండటం జరిగింది.  

లవ్ స్టోరీ అనగానే రొటీన్ సీన్ అయినా సరే ఫీల్ మిస్ అవకూడదు. కాని కరుణాకరణ్ కనీసం ఆ ఫీల్ కూడా కలిగించలేకపోయాడు. హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే రిపీటెడ్ సీన్స్ కూడా ఆడియెన్స్ ను మెప్పించలేదు. కొన్ని సీన్స్ కాస్త బాగున్నాయనిపిస్తుంది. సినిమా కరుణాకరణ్ తీసిన తొలిప్రేమ, డార్లింగ్ సినిమాల కథనంలా సాగించినట్టు అనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు కొన్నే ఉన్నాయి.. మరి సినిమా ఫలితం ఏమవుతుందో చూడాలి.


Sai Dharam Tej,Anupama Parameswaran,A. Karunakaran,KS Rama Rao,Gopi Sundarతేజ్ ఐలవ్యూ.. సాయి ధరం తేజ్ బ్యాడ్ లక్ కంటిన్యూస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: